టారో : 1 మే నుంచి 7మే, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. చెప్పలేనన్ని పనులతో బిజీబిజీగా ఉంటారు. విషయాలను జాగ్రత్తగా గమనించండి. తర్వాతే నిర్ణయాలను తీసుకోండి. శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మరొకరితో కలిసి కొత్త ప్రాజెక్ట్ చేపడతారు. కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి విజయాలు, లాభాలు వస్తాయి.
కలసివచ్చే రంగు: ఆకుపచ్చ
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
కెరీర్ ఊపందుకుంటుంది. అవకాశాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంపద పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. విజయాలు దరికి చేరుతాయి. ప్రేమ వ్యవహారాలు సంతోషాన్ని పంచుతాయి. బంధువులను కలుస్తారు. దగ్గర్లో ఉన్న ఓ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
కలసివచ్చే రంగు: పసుపు, ఆకుపచ్చ
మిథునం (మే 21 - జూన్ 20)
కలలు నిజమవుతాయి. ఎప్పట్నుంచో చూడాలనుకుంటున్న ప్రదేశానికి విహార యాత్రకు వెళ్తారు. ఓ ప్రత్యేక వ్యక్తిని కలుసు కుంటారు. పనితో తీరిక లేకుండా గడుపుతారు. ఊహించని గొప్ప అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఆధ్మాత్మికంగా గడుపుతారు. గత కాలపు చేదును మర్చిపోవడానికి ప్రయత్నించండి.
కలసివచ్చే రంగు: పర్పుల్
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
డబ్బు, ఇతరత్రా సదుపాయాలు కోరుకున్న వెంటనే దొరకవు. కలలు నిజమవ్వాలంటే వాటిని నెరవేర్చుకునే విధానం పక్కాగా ఉండాలన్న విషయం గ్రహించండి. చిన్న చిన్న అవకాశాలను కూడా వదిలిపెట్టకండి. ఇది మీ ఆలోచనలకు పదును పెట్టాల్సిన సమయం. మీ కుటుంబం మీకు అన్ని విషయాల్లో అండగా ఉంటుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు వ చ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కలసివచ్చే రంగు: తెలుపు, బేబీ పింక్
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ఈ వారం కాస్త విసుగ్గా గడుస్తుంది. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పలు విషయాల్లో ఊహించని మార్పులు ఎదురవుతాయి. స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఇంట్లోను, పని చేసేచోట క్రిస్టల్స్‌ని ఉంచుకుంటే శుభం జరుగుతుంది. దుష్టశక్తులు తొలగిపోతాయి.
కలసివచ్చే రంగు: ముదురు రంగులన్నీ
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
మీ శక్తియుక్తుల్ని వినియోగించే విధానాన్ని నేర్చుకోండి. ఇగోని పక్కన పెట్టండి. ఈ వారం మీ జీవితం ‘ఎస్’ అన్న అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి ద్వారా శుభవార్త అందుతుంది. ఆహారం, వ్యాయామం విషయంలో శ్రద్ధ పెట్టండి. ఆగ్నేయం మూలన ఎర్రటి క్యాండిల్స్‌ను ఉంచుకుంటే కలసి వస్తుంది.
కలసివచ్చే రంగు: పసుపు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
సంతోషాన్ని పొందడానికి, అనుకున్నది సాధించడానికి కొన్ని కట్టుబాట్లను ఛేదించాల్సి వస్తుంది. ప్రేమలో పరాజయం మిమ్మల్ని కాస్త బాధిస్తుంది. అయితే ఓ కొత్త ప్రారంభం వైపుగా అది మిమ్మల్ని నడిపిస్తుంది. ఓ మంచి, నమ్మదగిన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వారితో మీకు బలమైన బంధం ఏర్పడుతుంది. నవ్వు దేనినైనా సాధించే శక్తినిస్తుంది. దాన్ని వదలకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది.
కలసివచ్చే రంగు: కాషాయరంగు
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
అన్ని అవరోధాలనూ అధిగమిస్తారు. అయినవాళ్లతో కాస్త ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. లేదంటే కొన్ని బంధాలు బల హీనపడే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో మీ పద్ధతి మీకు అత్యంత సన్ని హితమైన ఒక వ్యక్తిని మీకు దూరం చే సే అవ కాశం ఉంది. ఉద్యోగులు లక్ష్యాలు అందు కుంటారు. అదనపు ఆదాయం పొందుతారు. ఇతరుల ప్రభావం మీపై లేకుండా చూసుకోండి.
కలసివచ్చే రంగు: వయొలెట్
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. మీరు పనిచేసే చోట ఓ యంగ్ అండ్ డైనమిక్ వ్యక్తి ద్వారా మీకో మంచి వార్త తెలుస్తుంది. అది మిమ్మల్ని విజయం వైపుగా నడిపిస్తుంది. ఆదాయం రెట్టింపవుతుంది. వ్యక్తిగత జీవితంలో కొంత అశాంతి ఏర్పడు తుంది. ఆర్థిక విషయాల్లో ఎవరైనా నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం.
కలసివచ్చే రంగు: లేత నీలం
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలు పొందు తారు. అయితే దానికోసం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని చట్టపరంగా కాకుండా తెలివితేటలతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కాలం మీలో కొన్ని మార్పుల్ని తీసుకొస్తుంది. మీరో కొత్త వ్యక్తిలా మారతారు.
కలసివచ్చే రంగు: బ్రౌన్
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
కొన్ని విసుగులు, ఇబ్బందులు వస్తాయి. ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఆఫీసులో రాజకీయాలు మిమ్మల్ని కలత పెడ తాయి. కానీ కాస్త బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తే ఆ పరిణామాలు మిమ్మల్ని స్ట్రాంగ్‌గా తయారు చేస్తాయి. కాస్త తెలివిగా వ్యవహరిస్తే అన్నీ మీకు తగినట్టుగా మారిపోతాయి. ఏదైనా మంచి హాబీపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోడానికి సమయం వెచ్చించండి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
కలసివచ్చే రంగు: ముదురు పసుపు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మానసిక ప్రశాంతత పొందుతారు. విధి నిర్వహణలో లక్ష్యాలు సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. గతంలోని విజయాల కారణంగా ఇప్పుడు మీకు ఇతరులతో పోటీ ఎక్కువవుతుంది. ఆర్థిక స్థితి బాగా మెరుగు పడుతుంది. అతిగా ఖర్చులు చేయకండి. ముఖ్యమైన వాటిపై ఖర్చు చేయడానికి కూడా ఇది తగిన సమయం కాదు. 4వ తేదీ తర్వాత మీకొక సర్‌ప్రైజ్ లభించే అవకాశం ఉంది.
కలసివచ్చే రంగు: బంగారువర్ణం
- ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్