టారో : 31 జూలై నుంచి 6ఆగస్టు, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. జీవితంలో కొత్త కొత్త పరిణామాలు మొదలవు తాయి. ఇంటా బయటా అంతా ఆనందంగా గడిచిపోతుంది. సంతోషానికి భంగం కలిగించే పరిసరాలకు దూరంగా ఉంటారు. చాలాకాలంగా దూరంగా ఉంటున్న స్నేహితుల్లో ఒకరిని కలుసుకుంటారు. రహస్యాలను దాచడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెడతారు.
లక్కీ కలర్: నేరేడు
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
కొత్త దిశలో ముందుకు సాగుతారు. ఆత్మీయులకు భారంగా వీడ్కోలు పలుకుతారు. మనసుకు కష్టంగా అనిపించినా, ఇష్టమైన ప్రదేశాలను వదిలి వెళ్లక తప్పని పరిస్థితులు తలెత్తుతాయి. ఇల్లు మారడం లేదా కార్యాల యాన్ని మార్చడం జరుగుతాయి. అనుకున్న లక్ష్యాలలో కొన్నింటిని సాధించలేకపోయినా, ఆనందంగానే ఉంటారు.
లక్కీ కలర్: లేత పసుపు
మిథునం (మే 21 - జూన్ 20)
ఇదివరకటి ఒత్తిళ్లు, చిరాకులు తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంటా, బయటా మార్పులను స్వాగతిస్తారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల తీరిక దొరకడం దాదాపు అసాధ్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచన లను సానుకూల దృక్పథంతో అధిగమిస్తారు. ఇతరుల మేలు కోసం, లక్ష్య సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారు.
లక్కీ కలర్: ముదురు నారింజ
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
గడ్డుకాలం నుంచి గట్టెక్కి ఒడ్డున పడతారు. ఒక దురలవాటును వదులుకుంటారు. పరిస్థితులు మెల్లగా మెరుగుపడతాయి. దూర ప్రయాణాలకు వెళతారు. గట్టి పోటీతోనే ఘన విజయాలు సాధించగలమని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. దృక్పథాన్ని మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.
లక్కీ కలర్: లేత నారింజ
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
శక్తివంచన లేకుండా కృషి చేసి, వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రశాంతంగా, తృప్తిగా ఉంటారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత పరిణతితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారు.
లక్కీ కలర్: పసుపు
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేయడంతో కాలాన్ని కొంత వృథా చేసుకుంటారు. సకాలంలోనే అప్రమత్తతతో పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన కాలం. ప్రేమించిన వ్యక్తులను కానుకల ద్వారా సంతోషపెడతారు. అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ధ్యానంలో గడుపుతారు.
లక్కీ కలర్: ఊదా
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
గతానుభవాల దృష్ట్యా సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటారు. చిరకాల స్వప్నాలను నెరవేర్చుకోవడానికి తగిన అవకాశాలు కలిసొస్తాయి. లక్ష్యసాధనలో నిర్భయంగా ముందంజ వేస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
కాలం పెట్టే పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకునేందుకు అలుపెరుగని పోరాటం సాగిస్తారు. నిరాశ చెందాల్సిన పనిలేదు. విజయం చేరువలోనే ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మిత్రులు మీ సలహా కోరుకుంటారు. సహచరులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు.
లక్కీ కలర్: నలుపు
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్వయం ప్రతిభతో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు సతమతం చేస్తాయి. వెన్నునొప్పి, కీళ్ల నొప్పుల వల్ల వైద్యుణ్ని సంప్రదించాల్సి రావచ్చు. పని ఒత్తిడిని అధిగమించడానికి విహార యాత్రలకు వెళతారు. కీలకమైన సమస్యల పరిష్కారానికి పెద్దల సలహా తీసుకుంటారు.
లక్కీ కలర్: లేత గోధుమ
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
సత్తా చాటుకోవడానికి తగిన అవకాశం అనుకోకుండా కలిసొస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగి ఆలోచనలను ఆచరణలో పెడతారు. పని ప్రదేశంలో సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యలు తీరిక లేకుండా చేస్తాయి. ఇతరులకు సలహాలు ఇస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితులతో విందు వినోదాల్లో, విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు.
లక్కీ కలర్: ముదురాకుపచ్చ
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
ఏళ్ల తరబడి నిరీక్షించిన అవకాశం కలిసొస్తుంది. ఆకాశమే హద్దుగా సృజనాత్మక సామర్థ్యంతో ముందుకు సాగుతారు. గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. మెరుగైన భవిష్యత్తుకు కొత్త దారులు తెరుచుకుంటాయి. అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి తీరిక లేకుండా తలమునకలవుతారు.
లక్కీ కలర్: తెలుపు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో పాలు పంచుకుంటారు. చిరస్మరణీయమైన విజయాన్ని సాధిస్తారు. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది సానుకూల సమయం. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
లక్కీ కలర్: లేత ఊదా
- ఇన్సియా, టారో అనలిస్ట్