టారో : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకు సాగుతారు. రోజువారీ జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకమైన ఆలోచనలతో జీవితంలో సుస్థిరత సాధిస్తారు. మనోధైర్యంతో ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటుంటారు. ‘కష్టేఫలి’ సూత్రాన్ని ఆచరణలో పెడతారు.
లక్కీ కలర్: బంగారురంగు
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఇంటా బయటా శాంతిసామరస్యాల కోసం తగిన కార్యాచరణను ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభావంతులను గుర్తించి, వారి శక్తియుక్తులు మరింతగా రాణించేలా వారికి సహాయ సహకారాలను అందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. వ్యక్తిగత జీవితంలో లోపాలను సరిదిద్దుకుంటారు.
లక్కీ కలర్: నాచురంగు
మిథునం (మే 21 - జూన్ 20)
అప్రమత్తత వదులుకోకుండా విజయపథంలో దూసుకుపోతారు. గ్రహబలం అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు పొరపాటు చేసినా, దాని వల్ల కూడా మేలు పొందగలుగుతారు. క్రియాశీలంగా ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇతరుల నుంచి గౌరవం, ప్రేమాభిమానాలు పొందుతారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
లక్కీ కలర్: గులాబి
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకుండా తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సంధించి విడిచిన బాణంలా లక్ష్యం వైపు దూసుకుపోతారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఆంతరంగికుల్లో ఒకరిని కలుసుకుంటారు. ఈ భేటీ మీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుంది.
లక్కీ కలర్: ఊదా
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ఎంచుకున్న ప్రతి అంశాన్నీ శ్రద్ధగా అధ్యయనం చేస్తారు. జ్ఞాన సముపార్జనను దినచర్యగా మార్చుకుంటారు. స్పెక్యులేషన్ ఈ వారంలో ఏమాత్రం అనుకూలంగా ఉండదు. సంప్రదాయ పద్ధతుల్లో పొదుపు చర్యలు చేపట్టడమే క్షేమం. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. విహారయాత్రల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు.
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పొదుపు చేసుకున్న డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు నడుమ కచ్చితమైన సమతుల్యతను పాటిస్తారు. పనిలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. సహోద్యోగులతో పోటీ పడాల్సి వస్తుంది. వివాదాలు తలకు చుట్టుకోకుండా మీ వంతు ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్: తెలుపు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు. గతంలో చవిచూసిన చేదు అనుభవాల వల్ల అభద్రతా భావానికి లోనవు తారు. శ్రద్ధాసక్తులతో పనిచేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విలాస వస్తువులను సేకరిస్తారు. షాపింగ్ వంటి కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతారు. అయితే, ఖర్చును అదుపు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: లేత నారింజ
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఎలాంటి అవాంతరాలనైనా సునాయాసంగా ఎదుర్కొని నిలదొక్కుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యాపారంలో కొనసాగుతున్నట్లయితే మీ పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడిస్తాయి. అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
లక్కీ కలర్: ముదురు నారింజ
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సృజనాత్మక రంగంలో కొత్త అనుబంధం ఒకటి ఏర్పడుతుంది. కావలసినవన్నీ అందుబాటులోనే ఉన్నా, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింత కఠినంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుని, వాటి ద్వారా లబ్ధి పొందుతారు. విహార యాత్రల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో చేరడానికి ఇది అనుకూలమైన కాలం.
లక్కీ కలర్: ఇటుక రంగు
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
పనుల ఒత్తిడిలో ఊపిరి సలపకుండా ఉంటారు. ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. అయితే, పరిస్థితుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారు. ఆచి తూచి వ్యవహరించకుంటే ప్రేమికుల మధ్య మనస్పర్థలు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్: పసుపు
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
గ్రహబలం అనుకూలంగా ఉండటంతో అన్ని విధాలా కలిసొచ్చే కాలం. వృత్తి ఉద్యోగాల్లో సృజనాత్మక శక్తితో, ప్రతిభా పాటవాలతో అందరినీ మెప్పిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
అవరోధాలను అధిగమిస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషితో సంపాదనకు ప్రయత్నిస్తారు. పరిస్థితులు అంత అనుకూలంగా లేకున్నా, ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతారు. మీపై శ్రద్ధ తీసుకునే ఆత్మీయులు ఒకరు మీకు తగిన సలహాలు ఇచ్చి, సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. ఈ వారంలో దురలవాట్లకు దూరంగా ఉంటే క్షేమం.
లక్కీ కలర్: నీలం
- ఇన్సియా
టారో అనలిస్ట్