టారో : 17 ఏప్రిల్ నుంచి 23ఏప్రిల్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఈవారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. సరదాగా గడుపుతారు. కుటుంబ సంబంధాల విషయంలో, అనుబంధాల విషయంలో మీకు మరింత ఆనందం లభిస్తుంది. ఇంటా బయటా అందరూ మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి.
కలసివచ్చే రంగు: వెండి రంగు
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన కన్‌ఫ్యూజన్‌కు లోనవుతారు. దానివల్ల టెన్షన్లు చాలా ఎక్కువవుతాయి. పనిచేసే చోట మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. టీమ్ వర్‌కతో మంచి విజయాలు సాధిస్తారు. ఈవారం కాస్త రొమాంటిక్‌గా గడుపుతారు. క్యాండిల్ లైట్ డిన్నర్లు చేస్తారు.
కలసివచ్చే రంగు: పీచ్
మిథునం (మే 21 - జూన్ 20)
ఊహించని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు ఇది తగిన సమయం. మీ ఉత్సాహమే మిమ్మల్ని లక్ష్యాలను అందుకునేలా చేస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అనుకోకుండా మీ జీవితంలోకి వచ్చిన ఓ వ్యక్తితో అకస్మాత్తుగా ప్రేమలో పడతారు. అది మిమ్మల్ని పెళ్లి వరకూ నడిపిస్తుంది.
కలసివచ్చే రంగు: లేత వంకాయరంగు
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ఈవారం మీరు చెప్పలేనంత సంతోషంగా ఉంటారు. మీ కృషి మీకోసం సంతోష ద్వారాలను తెరుస్తుంది. ఉద్యోగంలో మరింత బాగా నిలదొక్కుకుంటారు. త్వరలో మీరు ఇల్లు మారే అవకాశం ఉంది. భద్రతాపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేస్తారు. ముత్యాలు ధరిస్తే మంచి జరుగుతుంది.
కలసివచ్చే రంగు: హాఫ్ వైట్
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ఈ వారం మహిళలకు బాగా కలసి వస్తుంది. ఆత్మవిశ్వాసం, తెగువ ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అవరోధాలను అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో నిర్లిప్తత ఏర్పడుతుంది. బంధాలు మరింత బలపర్చుకోవడంపై కాస్త దృష్టి పెట్టండి. 20వ నంబర్ మీకు అదృష్టాన్ని, సంపదను తెచ్చిపెడుతుంది.
కలసివచ్చే రంగు: ఆలివ్ గ్రీన్
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య, వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. లక్ష్యాలను అందుకోవడానికి మీరు పడే కష్టం సఫలమవుతుంది. మరో కొత్త ప్రాజెక్టును చేపట్టే అవకాశం కూడా ఉంది. ఆఫీసును మరో ప్రదేశానికి మారిస్తే మరింత కలసి రావొచ్చు.
కలసివచ్చే రంగు: గులాబి
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
ఈవారం లక్ష్మీదేవి తన దీవెనలు మీమీద కుమ్మరిస్తుంది. సరదాగా షాపింగ్ చేస్తారు. కొత్త వాహనం కొంటారు. కొత్త ఇంటికోసం ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. మరిన్ని విజయాల కోసం మరింత కష్టపడండి. మిమ్మల్ని ప్రేమించేవారి కోసం కూడా తగినంత సమయం కేటాయించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. యోగా చేయండి.
కలసివచ్చే రంగు: పసుపు
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
మీ స్థిరత్వం, నిజాయతీ మిమ్మల్ని కోరుకున్న తీరాలవైపు నడిపిస్తాయి. ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడతాయి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలోను, పని చేయడంలోను జాప్యం చేయవద్దు. ప్రతి క్షణాన్నీ సందర్భాన్నీ ఆస్వాదించడం అలవర్చుకోండి. 21వ నంబర్ మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది.
కలసివచ్చే రంగు: వంకాయరంగు
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సంపద చేకూరుతుంది. భద్రత ఏర్పడుతుంది. సంతోషం సమకూరుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాకుండా ఉన్న ఒక ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. జీతం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 1వ నంబరు అదృష్టాన్ని తెస్తుంది.
కలసివచ్చే రంగు: బంగారువర్ణం
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఖర్చుల్ని నియంత్రించుకోండి. ఆర్థికపరమైన అంశాల్లో ఓ ప్రణాళికతో సాగిపోండి. రేపటి గురించి చింతించకుండా ఇవాళ్టిని ఎంజాయ్ చేయడం అలవర్చుకోండి. కోపం చేటు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి తగ్గించుకోండి. మీ మంచితనమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 19 మీ లక్కీ నంబర్.
కలసివచ్చే రంగు: బ్రౌన్
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఓ వ్యక్తి కారణంగా అనవసర ఇబ్బందులకు గురవుతారు. మీరు కనుక ఎవరికైనా ఏదైనా రుణపడి ఉంటే వెంటనే తీర్చేయండి. లేదంటే అవమానాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఏడు క్రిస్టల్స్ ఉన్న బ్రేస్‌లెట్ ధరిస్తే దోషాలు తొలగిపోతాయి.
కలసివచ్చే రంగు: తెలుపు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మీ ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. కొందరు విశేష వ్యక్తులను అనుకోకుండా కలుసుకుంటారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో దూసుకుపోతారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కాస్త శ్రద్ధగా చూడండి. దోషాలు తొలగిపోవడానికి వెండిని ధరించండి. 4వ నంబర్‌కు ప్రాధాన్యతనివ్వండి.
కలసివచ్చే రంగు: వెండి రంగు
ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్