టారో : 22 మే నుంచి 28మే, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తారు. మానసికంగా ఒంటరితనాన్ని ఫీలవుతారు. విద్యార్థులకు కొత్త కోర్సుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల నుంచి అందే కానుకలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కళ్లు తిరగడం, మగతగా అనిపించడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఊదారంగు పండ్లు తినడం వల్ల ఫలితం ఉంటుంది.
లక్కీ కలర్: ఇండిగో
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
అహంకార ధోరణి వల్ల అపోహలకు లోనై కుటుంబంలో సంబంధాలను పాడు చేసుకోకండి. మిమ్మల్ని ముందుకు నడిపించే గురువు తారసపడతారు. శుభవార్తలు వింటారు. మీతో ప్రేమానుబంధాన్ని కోరుకుంటున్న వ్యక్తిని కలుసుకుంటారు. పెట్టుబడుల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: లెమన్ యెల్లో
మిథునం (మే 21 - జూన్ 20)
ఇది మీకు సుసంపన్నమైన వారం. పెట్టుబడులకు అనుకూలం. కొత్త మిత్రులు తారసపడే అవకాశాలు ఉన్నాయి. సమస్యలు ఎదురైనా పట్టించుకోవాల్సిన పని లేదు. వాటిని మీ సంతోషానికి అవరోధం కానివ్వకండి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. సాధారణ ఆరోగ్యం వారమంతా బాగానే ఉంటుంది. అయితే, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: తెలుపు
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
జీవితం సాఫీగా సాగుతుంది. మీ కుటుంబంలోకి కొత్త శిశువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇదివరకటి కోరికలు ఈ వారంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. జీర్ణాశయ సమస్యలు బాధపెట్టే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: లేత నారింజ
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
మందకొడిగా సాగిన పనులు వేగం పుంజుకుంటాయి. ఈ వారంలో చాలాచాలా మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సాహసభరితమైన కొత్త ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జీర్ణాశయ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: బ్రౌన్
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
జీవితం సుఖదుఃఖాల సమ్మేళనంలా సాగుతుంది. చెడు వెంటనే మంచి అనుభవంలోకి వస్తుంది. ముఖ్యమైన వాటిపైనే దృష్టి పెట్టండి. మీరు ఈ వారంలో కొత్త పని చేపట్టాలనే నిర్ణయం తీసుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ ఇల్లు లేదా ఆఫీసులో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరగవచ్చు. చాలాకాలంగా కొనసాగుతున్న అనుబంధానికి ఈ వారంలో ఫుల్‌స్టాప్ పడవచ్చు.
లక్కీ కలర్: పసుపు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
మంచికాలం మొదలవుతోంది. శక్తివంచన లేకుండా పనిచేసి మంచి ఫలితాలను సాధించగలరు. కొత్త వాహనం కొనే అవకాశాలు లేకుంటే ఎక్కడికైనా అందమైన ప్రాంతానికి విహార యాత్ర కోసం టికెట్లు కొనే అవకాశాలు ఉన్నాయి. సానుకూలమైన మనుషుల మధ్యనే కాలం గడపండి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. ఈ వారంలో మీ జీవితం ఏడురంగుల హరివిల్లులా ఉంటుంది.
లక్కీ కలర్: నారింజ
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఈ వారంలో మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతున్న మీకు ఈ వారంలో జీవితానికి వెలుగునిచ్చే ఆశాదీపం కనిపిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్‌పరంగా అన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. ప్రేమించే వారితో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: నీలం
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
మీ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. బంధు మిత్రుల నుంచి కానుకలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మీ సామాజిక జీవితం మరింత సందడిగా, ఆనందభరితంగా సాగుతుంది. ఈ వారంలో మీ కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
లక్కీ కలర్: గులాబి
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
వ్యవసాయదారులకు, ముఖ్యంగా ఆహారపంటలు పండించేవారికి ఇది అద్భుతమైన వారం. వ్యాపార భాగస్వామి
ఒకరి నుంచి అద్భుతమైన సలహాలు, ఆర్థిక సాయం అందుతాయి. మరింత అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. అంతరాత్మ ప్రబోధం మేరకు వివేకంతో ముందుకు సాగుతారు. ప్రేమికులు ఆనందంగా గడుపుతారు. అనూహ్యమైన కానుకలను అందుకుంటారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
వారం అంతా చాలా రిస్కీగా ఉంటుంది. మీరు చేస్తున్న పనికి సమాంతరంగా మరో పని కూడా చేపట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. నిద్రలేని రాత్రులు గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు మీ ప్రేమానుబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. నైరుతి దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.
లక్కీ కలర్: లేత పసుపు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
వేడుకలు, సంబరాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకలో బిజీగా ఉంటారు. ప్రేమికులు కోరుకున్న వారి ప్రేమను దక్కించుకుంటారు. పెళ్లికి సిద్ధంగా ఉన్నవారు తగిన జీవిత భాగస్వామిని పొందగలరు. కొలీగ్స్ నుంచి చక్కని సహాయ సహకారాలు అందుతాయి. వారి సాయంతో ఆశించిన లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు.
లక్కీ కలర్: లేత నీలం
- ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్