టారో: 19 జూన్ నుంచి 25 జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
వారం మొత్తం విజయవంతంగా సాగుతుంది. మహిళా వ్యాపారవేత్తలకు, సొంత వృత్తుల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అకస్మాత్తుగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ మైకంలో కలల్లో తేలిపోతారు. ఎలాంటి దిశానిర్దేశం లేకుండా సాగుతున్నామని భావిస్తారు. అయితే, గ్రహబలం వల్ల సురక్షితంగానే ఉంటారు.
లక్కీ కలర్: పసుపు
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
జీవితం సుసంపన్నంగా సాగుతుంది. గతానికి చెందిన గాయాలను మరచిపోయి ముందుకు సాగుతారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. స్థైర్యం కోల్పోయి కలవరపడవద్దు. మానసికంగా చికాకులు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మిత్రులతో మాట్లాడటం ద్వారా సాంత్వన పొందుతారు. వారి సలహాలు స్వీకరిస్తారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
మిథునం (మే 21 - జూన్ 20)
కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇంతవరకు మీరు చేసిన కఠోర పరిశ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌పరంగా సుస్థిరతను సాధిస్తారు. జీవితం సుస్థిరంగా, సురక్షితంగా, లాభదాయకంగా సాగుతుంది.
లక్కీ కలర్: లేత ఊదా
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
వృత్తి ఉద్యోగాల్లో ఇది గడ్డుకాలమే అని చెప్పవచ్చు. ఇంటా బయటా ఒత్తిళ్లు తప్పవు. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. మీ పనితీరుపై పదే పదే ఎదురయ్యే ప్రశ్నలు చిరాకుపెడతాయి. అవివాహితులు వివాహానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనిశ్చితి నుంచి బయటపడటానికి చొరవ తీసుకుని ధైర్యంగా ముందంజ వేస్తారు.
లక్కీ కలర్: నీలం
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
వ్యాపార భాగస్వాముల మధ్య బంధం బలపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. లక్ష్య సాధన కోసం కఠోరంగా పరిశ్రమిస్తారు. ఆశించిన విజయాలు సాధిస్తారు. కొత్త వెంచర్లు ప్రారంభిస్తాయి. అదనపు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిన కాలం ఇది. ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: లేత గులాబి
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఈ వారంలో మీకు లక్ష్మీకటాక్షం పుష్కలంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇంటి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆశించిన లక్ష్యాలు సాధించడానికి మరింతగా శ్రమించాల్సి వస్తుంది. ప్రేమికులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అదృష్టం కలిసొస్తుంది.
లక్కీ కలర్: కెంపు ఎరుపు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
అనుబంధాల విషయంలో ఈ వారం పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే మంచిది. పరుగులు తీసే కాలంతో పోటీ పడి పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మొండితనం వల్ల మీ ఎదుగుదలకే అవరోధం కలుగుతుందని గ్రహించి ముందుకు సాగండి. త్వరలోనే అదృష్టం కలిసొచ్చే కాలం ప్రారంభం కానుంది. ఇంట్లోని పనికిరాని వస్తువులను వదుల్చుకుంటారు.
లక్కీ కలర్: ఊదా
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
అన్ని విషయాల్లోనూ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వారం మొత్తం సుసంపన్నంగా సాగుతుంది. గ్రహబలం పూర్తి అనుకూలంగా ఉంటుంది. చిరకాలంగా పూర్తి చేయకుండా మరుగునపడ్డ పనులను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు.
లక్కీ కలర్: పొద్దుతిరుగుడు పసుపు
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఈ వారంలో దుబారా ఖర్చులను అదుపు చేసుకుంటేనే మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి బడ్జెట్‌కు కట్టుబడి ఆచి తూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. శక్తివంచన లేకుండా లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఒత్తిడులు ఎదురైనా, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు.
లక్కీ కలర్: బూడిదరంగు
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
వృత్తి, ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి లేదా మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. బదిలీలు జరగవచ్చు. ఈ వారంలో వివాదాలకు దూరంగా ఉండటమే క్షేమం. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రయాస పడాల్సి వస్తుంది. కల్మషం లేని మీ వ్యక్తిత్వమే మీకు శ్రీరామరక్ష.
లక్కీ కలర్: తెలుపు
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
గ్రహబలం పూర్తి అనుకూలంగా ఉంటుంది. గొప్ప అవకాశాలు మీ తలుపు తడతాయి. విద్యార్థులు అనుకున్న కోర్సుల్లో చేరుతారు. కెరీర్ ప్రారంభదశలో ఉన్న ఉద్యోగులు తమ పనితీరుతో సత్ఫలితాలు సాధిస్తారు. అదనపు బాధ్యతలు స్వీకరించి నాయకత్వ పాత్ర పోషించే అవకాశం దొరుకుతుంది. పని ఒత్తిడి పెరిగినా, ఉత్సాహభరితంగా గడుపుతారు.
లక్కీ కలర్: నాచురంగు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సరదా షికార్లు, షాపింగ్‌లతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. చిరకాలంగా కొనాలనుకుంటున్న వాహనం, నగలు వంటివి కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి.
లక్కీ కలర్: లేత గులాబి