వారఫలాలు : 5 జూన్ నుంచి 11జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
పుష్కలంగా సంపద కలిసొచ్చే కాలం. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పొరపాట్లు చేయకుండా ఉండటానికి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రేమికులతో ఆనందంగా కాలం గడుపుతారు. అంతా సానుకూలంగా గడుస్తుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు విసుగు కలిగించినా, వాటిని మానుకోవద్దు.
లక్కీ కలర్: బ్రౌన్
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
అనూహ్యమైన మార్పులు ఉంటాయి. భయాలను, భ్రమలను విడిచిపెట్టడం ద్వారా జీవితంలో ఆచరణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతారు. భావోద్వేగాలు తరచూ మారుతూ ఉండవచ్చు. ఈ విషయమై కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోగల భాగస్వామి తారసపడతారు.
లక్కీ కలర్: పసుపు
మిథునం (మే 21 - జూన్ 20)
శుభ సంకేతాలు అందుతాయి. వాటి ఆధారంగా ముందుకు సాగడం ద్వారా సంపదను, సంతోషాన్ని పొందగలరు. ఇతరుల విమర్శలపై వ్యతిరేకత పెంచుకోకండి. అపోహలకు లోను కాకుండా, ఎదుటివారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఇంట్లో జరిగే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: నీలం
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ఆలోచనల్లో గందరగోళం కారణంగా అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి సలహా కోరుకుంటారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ఆశించిన లక్ష్యాలను సాధించగలరు. ఆఫీసులో మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మార్పుల వల్ల మీలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి.
లక్కీ కలర్: బ్రౌన్
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
జీవనశైలిపై మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కాస్త లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పనికి సంబంధించిన ఒక కీలక సమాచారం మీ ఆలోచనా సరళిలో పెను మార్పులకు కారణమవుతుంది. మీ స్వస్థలంలో సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
అధ్యయనం కోసం మీరు వెచ్చించిన కాలం వృథా పోదు. పైగా సత్ఫలితాలను ఇస్తుంది. జ్ఞాన సంపదతోనే మీరు మీ కలలను నెరవేర్చుకుంటారు. ఒక ముఖ్యమైన సందేశాన్ని అందుకుంటారు. ఈ వారంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు సాధించిన విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి.
లక్కీ కలర్: గులాబి
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
కాలం ప్రవాహంలా ముందుకు సాగుతుంది. ఏదీ ప్రణాళికాబద్ధంగా సాగదు. ఏ రోజు పని ఆ రోజుకు ముగించుకుంటారు. సన్నిహితులతో వాదులాటలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నలుగురూ చేరే చోట సామాజిక, రాజకీయ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరి ద్వారా సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు మిమ్మల్ని బలహీనంగా మారుస్తాయి.
లక్కీ కలర్: లేత గోధుమరంగు
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా కొత్త అవకాశాలు కలిసొస్తాయి. సృజనాత్మకమైన ఆలోచనలతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అన్ని రంగాల్లోనూ గొప్ప ఫలితాలను సాధిస్తారు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఘన విజయాలు సాధిస్తారు. అయితే, మీపై అసూయాపరుల చెడు దృష్టి సోకకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: ఊదా
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సానుకూలమైన మార్పులు సంతోషం కలిగిస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కొత్త సవాళ్లకు సంసిద్ధంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కెరీర్‌లో మీకు అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఉద్యోగ జీవితంలో గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే, గ్రహబలం వల్ల అవరోధాలను అధిగమిస్తారు.
లక్కీ కలర్: నారింజ
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
కఠిన పరిశ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తారు. మీ ఆరోగ్యం పట్ల ఒక మహిళ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ వారంలో అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటేనే మంచిది. జీవిత భాగస్వామితో కలసి నిర్ధారించుకున్న ప్రణాళికల్లో మార్పులు చేయవద్దు. మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్: లేతనీలం
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
పరస్పర విరుద్ధమైన అంశాలు మిమ్మల్ని చెరోవైపు లాగుతుంటాయి. వారం ప్రారంభంలో ఎటూ తేల్చుకోలేని డోలాయమాన స్థితిలో పడతారు. నెమ్మదిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటారు. కొత్త ఆస్తుల కొనుగోలుకు పూర్తి సానుకూలమైన కాలం. కుటుంబంలోని పెద్దలతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
లక్కీ కలర్: బూడిదరంగు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. గట్టి ప్రయత్నంతో వాటన్నింటినీ అధిగమిస్తారు. ఒక సామాజిక కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. మీ పరిజ్ఞానంతో, అనుభవంతో శరవేగంగా పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు నిస్తేజంగా అనిపిస్తాయి. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్: నారింజ
- ఇన్సియా,టారో అనలిస్ట్