టారో : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు | taro | Sakshi
Sakshi News home page

టారో : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు

Published Sun, May 29 2016 1:08 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

టారో : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు - Sakshi

టారో : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
దేనికైనా వెనుకంజ వేయడానికి, తాత్సారం చేయడానికి ఇది తగిన సమయం కాదు.  పాత బంధాలను వదులుకుంటారు. ఏకాంతమే మీ బాధలన్నింటినీ నయం చేస్తుంది. సమస్యలు చుట్టుముట్టిన వెంటనే వాటి పరిష్కారానికి నడుం బిగించకండి. కొంత కాలం మౌనంగా గమనిస్తూ ఉంటే, అన్నీ సర్దుకుంటాయి.
లక్కీ కలర్: ఊదా
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఈ వారం మీలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అద్భుతమైన శక్తితో పనులు పూర్తి చేస్తారు. ఉరకలు వేసే ఉత్సాహంలోని హెచ్చుతగ్గులు మీ అనుభవంలోకి వస్తాయి. ఉత్సాహం ఉధృతి నిమ్మళించాక మీరు చాలా సహజంగా తయారవుతారు. ఇంట్లో సంతోషంగా గడుపుతారు. ప్రకృతిలోని చెట్లలా, పిట్టల్లా మీ సహజ స్థితిని మనసారా అనుభూతిస్తారు. అత్యంత సహజంగా మిమ్మల్ని మీరు అభివ్యక్తీకరించుకుంటారు.
లక్కీ కలర్: ఎరుపు
 
మిథునం (మే 21 - జూన్ 20)
కాలం నెమ్మదిగా నడుస్తున్నట్లుగా ఉంటుంది.. ఈ వారంలో మీ ఊహలకు రెక్కలొస్తాయి.  ఇంద్రియాల బాహ్యంతర సంచలనాలను, ఇంద్రియాల ద్వారా కాల చలనాన్ని స్పష్టంగా అనుభూతి చెందుతారు. మీ ఎదుట ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. అనుకున్న పనుల్లో చాలావరకు సునాయాసంగా నెరవేరుతాయి.
లక్కీ కలర్: గులాబి
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
కార్యాచరణలోకి దిగే ముందు ఎదురుచూపులోని తీపి బాధను మనసారా అనుభవించే పరిస్థితులు ఎదురవుతాయి. అన్ని శంకలూ తొలగిపోయి, జీవితంలో అత్యవసరమైనదిగా మీరు భావించే అంశంపై వ్యామోహం పెరుగుతుంది. ప్రతి కొత్త అడుగులోనూ జీవన ప్రయాణం మరింత గాఢతరమవుతూ వస్తుంది.. ఎదురుచూపులు చూసే కాలం పెరుగుతుంది.
లక్కీ కలర్: ముదురు ఊదా
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
రిస్కు తీసుకోవలసిన సమయం ఇది. ప్రేమను ఆస్వాదించాలంటే రిస్కు తీసుకోక తప్పదు. అయితే, సూర్యుడి ప్రభావం వల్ల అట్టే ఆత్రపడరు. మిమ్మల్ని ఉద్వేగభరితుల్ని చేసే అంశాల వైపు సాగించే ప్రయాణంలో ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ వారంలో మీ జీవితం ప్రతిక్షణం ఉద్విగ్నభరితంగా సాగుతుంది.
లక్కీ కలర్: నారింజ
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
సూర్యుడి ప్రభావం వల్ల మీ దారి ఎలాంటి అవరోధాలూ లేకుండా ఉంటుంది. చాలా సహజంగా, తాపీగా ముందుకు సాగుతారు. జీవితంలోని ప్రతి అంశం పరిణామం దిశగా, విస్తరణ దిశగా సంసిద్ధంగా ఉంటాయి. భయం, దిగులు విడనాడి, ధైర్యంగా ముందుకు సాగండి. . మీరు సేదదీరుతూ గడిపినా, ఈ వారంలో పనులు వాటంతట అవే ముందుకు సాగుతాయి.
లక్కీ కలర్: పసుపు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
మబ్బుల్లో తేలియాడే మీ ఆలోచనలను పరిస్థితులు నేలకు దించుతాయి. మిమ్మల్ని అప్రమత్తంగా, క్రియాశీలంగా ఉండేలా చేస్తాయి. ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ధ్యానంలో గడపడం ద్వారా మీ జీవితాన్ని మరింత అందంగా మలచుకునేందుకు ప్రయత్నించండి.
లక్కీ కలర్: బూడిదరంగు
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఆవేశంలో అదుపు తప్పే అలవాటు మీకు ఉండొచ్చు. అయితే, గ్రహబలం మిమ్మల్ని స్థిరంగా, బలోపేతంగా ఉంచుతుంది. మీరు తలచుకుంటే, ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని మీ అదుపులోకి తెచ్చుకునే స్థితిలో ఉంటారు. అయితే, ఎలాంటి అపోహలకు లోనుకాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంతఃసంఘర్షణలో అలజడి రేపే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: తెలుపు
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఇంతకాలం ఊపిరి సలపనివ్వకుండా ఒత్తిడికి గురిచేసిన ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. పరిస్థితులకు ఎదురీదుతున్న మీరు శక్తులను కూడదీసుకుంటారు. ఇప్పటి వరకు జీవితంలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెడతారు.  మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకుంటారు. సంతోషభరితంగా గడుపుతారు.
లక్కీ కలర్: మీగడ రంగు
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
మీరు సంతోషాన్ని, సంతృప్తిని వేటిలో పొందగలరో వాటన్నింటినీ ఆస్వాదించేందుకు అనువైన సమయం. మీ భుజస్కంధాలపై ఉన్న బాధ్యతల బరువు కొంతవరకు సడలుతుంది. ప్రతి దానికీ బాధ్యత తీసుకునే అలవాటును మానుకోండి. ఆనందానుభూతులు మిమ్మల్ని ఊరిస్తాయి. అయితే, వీటి కారణంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఏర్పడదని తెలుసుకుంటారు.
లక్కీ కలర్: లేత ఊదా
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
తక్షణ పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా మీరు స్పందించే తీరును బట్టే మీకు లభించే ఆనందం ఆధారపడి ఉంటుంది. ఒడిదుడుకులు ఎదురైనా, పట్టువీడని ప్రయత్నంతో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. జీవితంలో వెలుగు చీకట్ల నడుమ సమతుల్యత సాధించాలనుకుంటారు. అలాగే స్త్రీ పురుషుల మధ్య సమన్వయం సాధించాలనుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు.
లక్కీ కలర్: బంగారురంగు
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మీలోని శక్తి సామర్థ్యాలను అనుభవంలోకి తెచ్చుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు.  మీ అంతరాత్మ ప్రబోధానుసారం ముందుకు సాగండి. మీలో పెల్లుబికే వాంఛలను మీ మేధాశక్తితో అణచివేసే ప్రయత్నాలు చేయకండి. ఈ వారం మీ జీవితం మిరుమిట్లుగొలిపే వెలుగులతో ఆనందభరితంగా సాగుతుంది.
లక్కీ కలర్: గోధుమరంగు
- ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement