ఒలంపిక్ క్రీడాకారుడు పిస్టోరియస్, అతని చేతిలో హత్యకు గురైన గర్ల్ ఫ్రెండ్ రేవా (ఫైల్ ఫొటో)
ప్రిటోరియా: తన ప్రియురాలు, మోడల్ అయిన రేవా స్టీన్ కాంప్ ను హత్య చేసిన కేసులో సౌతాఫ్రికన్ ఒలింపిక్ క్రీడాకారుడు ఆస్కార్ పిస్టోరియస్ జూన్ లో జైలుకు వెళ్లనున్నాడు. ప్రియురాలి హత్య కేసులో ఈ బ్లేడ్ రన్నర్ కు న్యాయస్థానం గతంలోనే ఐదేళ్ల శిక్షను విధించింది.
అయితే ఒక ఏడాది జైలులో గడిపిన పిస్టోరియన్ ఈ హత్యకు తాను సిగ్గు పడుతున్నానని, శిక్ష తగ్గించాలని కోరుతూ గతేడాది డిసెంబర్ లో సౌతాఫ్రికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి.. పిస్టోరియస్ జూన్ నుంచి కొత్తగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. కోర్టు శిక్ష ఖరారుకు ముందు వరకు ఆయన గృహనిర్భందంలో ఉన్నారు.