Oscar Pistorius
-
ఆరు స్వర్ణాలు గెలిచిన బ్లేడ్ రన్నర్.. గర్ల్‌ఫ్రెండ్‌ను హత్యచేసి.. ఇలా..
ప్రిటోరియా: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో గత తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్న మాజీ ఒలింపియన్, ప్రముఖ బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు పెరోల్ లభించింది. దక్షిణాఫ్రికాకు చెందిన పిస్టోరియస్ పారాలింపిక్స్‌లో ఆరు స్వర్ణపతకాలు గెలుచుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రశంసలు పొందాడు. అయితే తన కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేసి జైలుపాలయ్యాడు. వలంటైన్స్డే రోజు ఆమెతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14, 2013లో తన ప్రేయసి రీవా స్టీన్కాంప్ బాత్రూంలో ఉన్న సమయంలో బయటి నుంచి కాల్పులు జరిపాడు. తలుపును చీల్చుకు వెళ్లిన బుల్లెట్లు తాకి తీవ్రంగా గాయపడ్డ రీవా మరణించింది. అయితే, పిస్టోరియస్ మాత్రం.. లోపల ఉన్నది దొంగ అనుకుని పొరబడి షూట్ చేసినట్లు తెలిపాడు. కానీ.. అక్కడ లభించిన సాక్ష్యాల ఆధారంగా పిస్టోరియస్ దోషిగా తేలాడు. దీంతో 2014లో అతడు జైలుపాలయ్యాడు. ఈ కేసులో పిస్టోరియస్కు మొత్తం 13 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు. జనవరి 5న పిస్టోరియస్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. చదవండి: యువరాణి.. 225 ఎకరాల ఎస్టేట్.. 6 ఎకరాల్లో ప్యాలెస్.. భారత క్రికెటర్‌గా! జడేజాకు చుట్టమా? -
పిస్టోరియస్కు 13 ఏళ్ల జైలు
జొహన్నెస్‌బర్గ్: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్యచేసిన కేసులో దక్షిణాఫ్రికా పారా ఒలింపిక్ చాంపియన్ ఆస్కార్ పిస్టోరియస్ శిక్షను రెట్టింపుచేస్తూ ఆ దేశ అప్పీల్స్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గతంలో ఆరేళ్ల జైలు శిక్ష విధించాలని ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉద్దేశపూర్వకంగానే హత్యచేసినట్లు పేర్కొనటంపై చర్చించిన న్యాయస్థానం 13 ఏళ్ల 5నెలల జైలు శిక్షను విధించింది. ఈ పారా ఒలింపిక్స్ అథ్లెట్ 2013 వాలెంటైన్స్ డే తెల్లవారుజామున తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను కాల్చిచంపాడు. దొంగగా భావించి చంపినట్లు పిస్టోరియస్ పేర్కొన్నా... ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపించటంలో విఫలమయ్యాడు. -
పిస్టోరియస్కు ఆరేళ్లు
జైలు శిక్ష విధించిన దక్షిణాఫ్రికా కోర్టు ప్రిటోరియా: ప్రియురాలి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దక్షిణాఫ్రికా పారా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. రీవా స్టీన్కాంప్ హత్య కేసులో ప్రిటోరియా హై కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. నిజానికి దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం హత్య కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉన్నా.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పిస్టోరియస్కు తక్కువ శిక్షను విధిస్తున్నట్లు ఈ సందర్భంగా జడ్జి థోకోజిలే మసిపా వ్యాఖ్యానించారు. పిస్టోరియస్ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడని జడ్జి భావించారు. ఈ కేసులో ఇదే అఖరు తీర్పు కాబోదు. తెల్ల రంగు చొక్కా, నల్లరంగు కోటు వేసుకున్న పిస్టోరియస్ కుటుంబ సభ్యులు, లాయర్లతో కలసి కోర్టుకు వచ్చాడు. ఈ తీర్పుపై పిస్టోరియస్ అప్పీల్‌కు వెళ్లాలని అనుకోవడం లేదని అతని న్యాయ సలహాదారుల బృందం తెలిపింది. 2013 ప్రేమికుల రోజున తన ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడని భావించిన పిస్టోరియస్ బాత్రుమ్ తలుపు వెనుక నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అతని ప్రియురాలు రీవా మరణించింది. -
బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు షాక్
ప్రిటోరియా: ప్రియురాలిని హత్య చేసిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు చుక్కెదురైంది. అతడికి కింది కోర్టు విధించిన జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్ధించింది. 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు హత్యచేసినట్టు సాక్ష్యాలు బలంగా ఉండడంతో ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు జడ్జి తీర్పు చెప్పారు. తలుపులోంచి తుపాకీ కాల్చి ప్రియురాలిని హతమార్చినట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం హత్య కేసులో దోషులుగా తేలిన వారికి కనీసం 15 ఏళ్లు జైలు పడుతుంది. అయితే పిస్టోరియస్ అంగవైకల్యం, భావోద్వేగ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అతడికి తక్కువ శిక్ష విధించాలని డిఫెన్స్ వాదించింది. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన సమయంలో పిస్టోరియస్ కోర్టులోనే ఉన్నాడు. 2013 సంవత్సరంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంప్‌ను పిస్టోరియస్ కాల్చి చంపాడు. ఈ కేసులో అతడికి కింది కోర్టు ఐదేళ్లు జైలు విధించింది. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయించగా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. వాదనలు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన రెండు కాళ్లకు అమర్చిన బ్లేడ్స్ తీసేసి కోర్టు ముందుకు వచ్చాడు. తన రెండు కాళ్లు లేవని, తన వైకల్యం దృష్ట్యా జైలులో ఉండలేనని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. అతడి అభ్యర్థనలకు కోర్టు తోసిపుచ్చింది. -
'డబ్బు ఇవ్వకుంటే జైలులో గ్యాంగ్ రేపే!'
న్యూయార్క్: తమ కుమారుడు అస్కార్ పిస్టోరియస్ను కొట్టి సామూహిక లైంగిక దాడి చేస్తామని బెదిరించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు విచారణ తీవ్రత తగ్గాలంటే తమకు భారీ మొత్తంలో లంఛం ఇవ్వాలని లేదంటే అతడిని పై విధంగా శిక్షిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. అయితే, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. 2013 జూలై 6న పిస్టోరియస్ తన ప్రేయసిని హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణకు సంబంధించి అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు వివరాలు పిస్టోరియస్ కుటుంబ ప్రతినిధి అన్నెలైజే బర్గెస్ మీడియాకు చెబుతూ ఈ కేసులో విచారణకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు భారీ మొత్తంలో తమకు లంఛం ఇవ్వాలని, లేదంటే పిస్టోరియస్పై సామూహిక లైంగిక దాడి చేయిస్తామని, దారుణంగా కొట్టిస్తామని కొందరు హెచ్చరించినట్లు చెప్పారు. అయితే, ఈ బెదిరింపులు పిస్టోరియస్ కజిన్ ఆర్నోల్డస్ మొబైల్ కు వచ్చినట్లు తెలిసింది. -
'మా అల్లుడికి కఠిన శిక్ష వేయండి'
తన కూతుర్ని హత్య చేసిన పిస్టోరియస్ కు కచ్చితంగా తగిన శిక్ష పడాలని మోడల్ అయిన రీవా స్టీన్ కాంప్ తండ్రి బార్రీ స్టీన్ కాంప్ విజ్ఞప్తి చేశాడు. ప్రియురాలి హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు దక్షిణాఫ్రికా హైకోర్టు గతంలో 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నేడు ఆ కేసు విచారణకు వచ్చింది. 2013లో వాలెంటైన్స్ డే రోజు రీవా స్టీన్ కాంప్ ను హత్య చేశాడని గతంలో నిరూపితమైంది. ఒక ఏడాది జైలులో గడిపిన పిస్టోరియస్ ఈ హత్య చేసినందుకు తాను సిగ్గు పడుతున్నానని, శిక్ష తగ్గించాలని కోరుతూ గతేడాది డిసెంబర్ లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను ఉద్దేశపూర్వకంగా హత్యచేయలేదని, ఇంట్లోకి ఎవరో దొంగ ప్రవేశించాడని భావించి కాల్పులు జరిపగా ప్రియురాలు రక్తపు మడుగులో పడిపోయిందని కేసు తొలి విచారణలో చెప్పాడు. బుల్లెట్లు తగిలినప్పుడు నా కూతురు ఎంత భయాన్ని, బాధను అనుభవించిందో ప్రతిక్షణం అదే తనకు గుర్తుకువస్తున్నాయని బార్రీ స్టీన్ కాంప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కచ్చితంగా ఆరోజు వారిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని, ఆ ఆవేశంలోనే కాల్పులు జరిపి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. తన భార్య ఫోన్ చేసి వణుకుతున్న స్వరంతో కూతురి మరణవార్తను చెప్పిందని, ఆ క్షణంలో జరిగిన ప్రతి విషయాన్ని కోర్టులో వివరించారు. తన కూతుర్ని హత్య చేసినందుకు పిస్టోరియస్ కు మాత్రం కఠిన శిక్ష వేయాలంటూ ప్రధాన న్యాయమూర్తిని కోరాడు. -
జూన్ లో జైలుకు వెళ్లనున్న క్రీడాకారుడు
ప్రిటోరియా: తన ప్రియురాలు, మోడల్ అయిన రేవా స్టీన్ కాంప్ ను హత్య చేసిన కేసులో సౌతాఫ్రికన్ ఒలింపిక్ క్రీడాకారుడు ఆస్కార్ పిస్టోరియస్ జూన్ లో జైలుకు వెళ్లనున్నాడు. ప్రియురాలి హత్య కేసులో ఈ బ్లేడ్ రన్నర్ కు న్యాయస్థానం గతంలోనే ఐదేళ్ల శిక్షను విధించింది. అయితే ఒక ఏడాది జైలులో గడిపిన పిస్టోరియన్ ఈ హత్యకు తాను సిగ్గు పడుతున్నానని, శిక్ష తగ్గించాలని కోరుతూ గతేడాది డిసెంబర్ లో సౌతాఫ్రికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి.. పిస్టోరియస్ జూన్ నుంచి కొత్తగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. కోర్టు శిక్ష ఖరారుకు ముందు వరకు ఆయన గృహనిర్భందంలో ఉన్నారు. -
పిస్టోరియస్కు బెయిల్ మంజూరు
బ్లూమ్‌ఫోంటేన్: దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు కోర్టులో ఊరట లభించింది. పిస్టోరియస్ దేశం విడిచిపోకుండా ఉంటాడన్న అతని తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జడ్జి లెడ్వాబా 500 యూరోల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఎలక్ట్రికల్ టాగ్‌ను అతనికి అమర్చి ఇంటికి 20 కిలో మీటర్లో దూరంలో మాత్రమే వెళ్లే అవకాశం కల్పించారు. అతని పాస్ పోర్టును కూడా స్వాధీనం చేకసుకోవాలని కోర్టు సూచించింది. అయితే పిస్టోరియస్ను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కాన్సిట్యూషనల్ కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు అతని తరఫు న్యాయవాది తెలిపారు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేసినట్టుగా ఆదేశ సుప్రీం కోర్టు తేల్చింది. బాత్రూమ్లో తలుపు వెనకాల స్టీన్కాంప్ కానీ ఆగంతకుడు కానీ ఎవరున్నా తుపాకీతో కాల్చితే కచ్చితంగా మరణిస్తారని పిస్టోరియస్కు తెలుసని జడ్జి అభిప్రాయపడ్డారు. అతడికి తొలుత స్థానిక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పు దోషపూరితంగా ఉందని, అతడికి కఠిన శిక్ష వేయాల్సిందేనని స్పష్టం చేస్తూ కేసును ట్రయల్ కోర్టుకు తిప్పి పంపింది. దీంతో 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలుండటంతో పిస్టోరియస్ తిరిగి సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ కాన్సిట్యూషనల్ కోర్టులో అప్పీల్ చేయనున్నాడు. స్థానిక కోర్టు విధించిన జైలు శిక్షలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న తను అక్టోబర్‌లో పెరోల్‌పై విడుదలై గృహ నిర్భందంలో ఉండేందుకు కోర్టు అనుమతించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆస్కార్‌కు కఠిన శిక్ష పడలేదని గట్టిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసును సుప్రీం కోర్టు తిరిగి విచారించి కఠిన శిక్ష విధించాలని తెలిపింది. -
పిస్టోరియస్ ను మళ్లీ దోషిగా తేల్చారు..
బ్లొమ్ఫోంటిన్ : గర్ల్ ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ను దోషిగా దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తేల్చింది. పిస్టోరియస్కు సంబంధించిన కేసుపై వచ్చిన అప్పీల్‌పై అక్కడి సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ జరిపింది. అయితే గతంలో ఇచ్చిన తీర్పు చాలా తక్కువ తీవ్రత కలిగి ఉండటంతో ఈ కేసుపై పరిస్థితులు మరింత కఠినతరం అయ్యాయి. హౌస్ అరెస్ట్ కింద శిక్ష కాలాన్ని పూర్తి చేయడానికి స్థానిక కోర్టు తీర్పు ఇవ్వడంతో నిందితుడికి తగిన శిక్ష విధించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన విషయం అందరికీ విదితమే. దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు గతంలో ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితోనే గర్ల్ ఫ్రెండ్‌ను హత్యచేశాడని జడ్జి జస్టీస్ ఎరిక్ లీచ్ మీడియాకు తెలిపారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం పిస్టోరియస్ను దోషిగా తేల్చుతూ తగిన శిక్ష విధించాలని ట్రయల్ కోర్టుకు కేసును తిప్పిపంపింది. 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
ప్రియురాలిని చంపిన పిస్టోరియస్ విడుదల
ప్రిటోరియా: ప్రియురాలిని హత్య చేసి జైలు కెళ్లిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక మిగితా శిక్ష కాలాన్ని హౌజ్ అరెస్టు కింద ఉండి పూర్తి చేయనున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా మీడియాకు సమాచారం అందించకుండా సోమవారం రాత్రి ఆయనను విడుదల చేసినట్లు ప్రిస్టోరియస్ కుటుంబ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతడు ప్రిటోరియాలోని బంధువుల ఇంట్లో ఉన్నాడని తెలిపారు. మంగళవారం తర్వాత ఆ కుటుంబం పిస్టోరియస్కు సంబంధించి ఓ అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడికి జైలు శిక్ష పడింది. -
కథ మారింది
ఆవేశం... మనిషిని మనిషిలా ఉండనివ్వదు.ఎంతకైనా దిగజారుస్తుంది.ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది.అది తెలిసి కూడా ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు ఆస్కార్ పిస్టోరియస్. ‘బ్లేడ్న్న్రర్’గా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆస్కార్... ఆవేశమనే శత్రువును అణచుకోలేక అదే ప్రపంచం ముందు దోషిలా నిలబడ్డాడు. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు! అక్టోబర్ 21, 2014... దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా కోర్టు కిటకిటలాడుతోంది. ఎప్పుడూ లేనంత నిండుగా ఉంది. అక్కడున్న అందరి ముఖాల్లోనూ ఆతృత కనిపిస్తోంది. ఏం జరగబోతోంది అన్న ప్రశ్న అందరి కళ్లలోనూ కదలాడుతోంది. దు వరుసలో బెంచీమీద కూర్చున్న వ్యక్తి ముఖమైతే బాగా పాలిపోయింది. టెన్షన్ పడుతున్నట్టుగా పెదవులు అదురుతున్నాయి. భీతితోనో, బాధతోనో గానీ... కళ్లు మాటిమాటికీ చెమ్మగిల్లు తున్నాయి. తల దించుకుని పదే పదే వేళ్లతో కళ్లను ఒత్తుకుంటున్నాడు. తలో హాలులో చిన్నపాటి అలికిడి. న్యాయమూర్తి రావడంతో అందరూ లేచి నిలబడ్డారు. ఆవిడ కూర్చోగానే కూర్చున్నారు. న్యాయమూర్తి కాసేపు తన దగ్గరున్న కాగితాలను తిరగేసింది. అప్పుడప్పుడూ తలెత్తి కోర్టులో వారందరినీ పరిశీలించింది. మధ్యమధ్యన ఆ వ్యక్తివైపు కూడా నిశితంగా చూసింది. కాసేపటి తర్వాత చేతిలోని కాగితాలను టేబుల్ మీద పెట్టి పెదవి విప్పింది. ‘‘కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట... రీవా స్టీన్‌క్యాంప్‌ను తుపాకితో కాల్చి, ఆమె మరణానికి కారకుడైనందుకుగాను... ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల కారాగారశిక్ష విధించడమైనది.’’ అందరూ ఆశ్చర్యపోయారు. హతురాలి తల్లి అయితే హతాశురాలైంది. ‘‘ఇది అన్యాయం. నా కూతుర్ని పొట్టనబెట్టుకున్నవాడికి, ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్నవాడికి శిక్ష కేవలం అయిదేళ్లా?’’ అంటూ బావురుమంది. వేదనతో అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోయింది.ఆ వ్యక్తి తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. దుఃఖపడుతున్నాడనడానికి సాక్ష్యంగా అతడి భుజాలు రెండూ కదులుతున్నాయి. ‘‘మిస్టర్ పిస్టోరియస్... లేవండి వెళ్దాం’’ ఇన్స్పెక్టర్ గొంతు వినగానే కళ్లు తుడుచుకుని లేచాడా వ్యక్తి. ఓసారి చుట్టూ చూశాడు. దూరంగా నిలబడి తనవైపే చూస్తోన్న తల్లి, చెల్లిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. బలవంతాన అదిమి పెట్టి, పోలీసుల వెంట వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు. అతడు పోలీసుల వాహనంలోకి ఎక్కుతుంటే కాస్త దూరం నుంచి చూస్తోన్న హతురాలి తల్లి అరుస్తోంది... ‘‘వాడు రాక్షసుడు. నా కూతురి ప్రాణాలు హరించాడు. ఈ శిక్ష వాడికి చాలదు. చూస్తూండండి. వాడు త్వరలో మరో నేరం చేసినా చేస్తాడు’’. ఆమె మాటలకు కొందరు అవాక్క య్యారు. కొందరు జాలిపడ్డారు. కొందరు ఆమెను తప్పుబట్టారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడింది ముక్కూ ముఖం తెలియని ఓ సామాన్య వ్యక్తి గురించి కాదు. ప్రపంచమే గొప్పగా చెప్పుకునే అథ్లెట్ గురించి. కాళ్లు లేకపోయినా కృత్రిమకాళ్లతో రికార్డులు సాధించిన పరుగుల వీరుడి గురించి. బ్లేడ్ రన్నర్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే... ఆస్కార్ పిస్టోరియస్ గురించి! త గొప్ప ఆటగాడు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు... హత్య చేశాడా? ఎందుకు? అసలిది నిజమేనా? లేక తప్పుడు కేసా? అసలింతకీ ఏం జరిగింది? ఆస్కార్ నేరస్తుడా? అమాయకుడా? ఫిబ్రవరి 14, 2013... ‘‘ఏం జరిగింది సర్... అంబులెన్స్ కోసం ఫోన్ చేశారెందుకు?’’... లోపలకు అడుగు పెడుతూనే అడిగాడు అంబులెన్స్‌తో పాటు వచ్చిన మేల్ నర్స్. ఆస్కార్ మాట్లాడలేదు. నీళ్లు నిండిన కళ్లతో నిస్తేజంగా చూస్తున్నాడు. ‘‘చెప్పండి సర్. ఏం జరిగింది? మీ ఆరోగ్యం బాగానే ఉందా?’’ అన్నాడతను కంగారుగా. తన అభిమాన ఆటగాడికి ఏమయ్యిందోనన్న కంగారు అతడిలో. ఈసారి కూడా ఆస్కార్ సమాధానం చెప్పలేదు. అటు చూడమన్నట్టుగా చేతిని చాచాడు. చూసిన నర్స్ ఉలిక్కిపడ్డాడు. అక్కడ... నేలమీద... రక్తపు మడుగులో అచేతనంగా పడివుంది ఓ అమ్మాయి. ‘‘ఎవరు సర్... ఏమయ్యింది?’’ అన్నాడతను కంగారుగా. ప్రాణాలతో ఉందేమో చూద్దామని దగ్గరకు వెళ్లబోయాడు. అప్పుడు పెగిలింది ఆస్కార్ గొంతు. ‘‘తను చనిపోయింది’’ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడతడు. ‘‘ఎలా సర్?’’ అన్నాడు అయోమయంగా. ‘‘నేనే చంపేశాను’’ బావురుమన్నాడు ఆస్కార్. అవాక్కయిపోయాడా వ్యక్తి. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. విషయం పోలీసుల చెవిని వేశాడు. ‘‘తల, నడుము, భుజం... మూడు చోట్ల బుల్లెట్లు దిగాయి. అంత దారుణంగా ఎలా చంపగలిగారు మిస్టర్ పిస్టోరియస్?’’ సూటిగానే అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘కావాలని చేయలేదు సర్. బాత్రూమ్లో అలికిడి అవుతుంటే దొంగ దూరాడేమో అనుకున్నా. బయటకు రమ్మన్నా రాకపోవడంతో షూట్ చేశా. కానీ...’’ ‘‘కానీ లోపల ఉన్నది దొంగ కాదు. మీ ప్రియురాలు రీవా. మిమ్మల్ని నమ్మి, మీతోనే కలిసి జీవిస్తోన్న రీవా. త్వరలోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటోన్న రీవా. అంతే కదూ?’’ ‘‘మీ మాటల్లో వ్యంగ్యం నాకు అర్థమయ్యింది సర్. కానీ నేను చెప్పింది నిజం. నేను తనని చంపలేదు. దొంగ అనుకుని షూట్ చేస్తే తను చనిపోయింది.’’ ‘‘అవునా... అయినా దొంగ బాత్రూములో ఎందుకుంటాడు మిస్టర్ పిస్టోరియస్?’’ ‘‘బాత్రూమ్లో ఓ కిటికీ ఉంది. దానిగుండా జొరబడ్డాడేమో అనుకున్నాను.’’ వెటకారంగా నవ్వాడు ఇన్స్పెక్టర్. ఆస్కార్ ఎన్ని చెప్పినా అతడు నమ్మలేదు. ఎందుకంటే, అతడు చెప్పేది నమ్మశక్యంగా లేదు కాబట్టి. ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించింది రీవా స్టీన్‌క్యాంప్. ప్రముఖ మోడల్ అయిన ఆమె ఆస్కార్‌కి అర్ధాంగి కావాలని ఆశపడింది. చివరికి అతడి చేతిలోనే హత్యకు గురయ్యింది. స్కార్ చెప్పినదాని ప్రకారం... ఫిబ్రవరి పద్నాలుగు తెల్లవారుజామున నిద్రలో ఉండగా... బాత్రూమ్లో ఏదో అలికిడి వినిపించి మెలకువ వచ్చింది ఆస్కార్‌కి. ఎవరూ అని అరిచాడు. సమాధానం రాలేదు. దాంతో తుపాకీ తీసుకుని బాత్రూమ్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపల నుంచి గడియ పెట్టి వుంది. ఎంత పిలిచినా లోపలి వ్యక్తి తలుపు తీయలేదు. దాంతో తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత ఎందుకో మంచం వైపు చూస్తే రీవా కనిపించలేదు. ఆస్కార్ అమాయకుడని అతడి అభిమానులు నమ్మినా... అతగాడి స్వభావం తెలిసినవాళ్లంతా అతడినే దోషి అంటున్నారు. బరిలో ఆత్మవిశ్వాసంలో పరుగులు తీసే ఆస్కార్... వ్యక్తిగత జీవితంలో ఆవేశంతో తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాడు. రెండుసార్లు పబ్లిక్ ప్లేసుల్లో కొట్లాటలకు దిగి, కోపాన్ని అణచుకోలేక తుపాకీతో కాల్పులు జరిపాడు. కేసుల పాలయ్యాడు. మూడేళ్ల పాటు క్రీడా రంగంలో నిషేధానికి గురయ్యాడు. కోపం వస్తే కంట్రోల్ తప్పిపోయే అతగాడు, రీవాని కావా లనే ఎందుకు చంపివుండకూడదు అన్నది పలువురి సందేహం. అది నిజమే కావచ్చు. కానీ న్యాయస్థానం అలా ఆలోచించనప్పుడు చేసేదేముంది! అన్యాయం జరిగింది అని భావిస్తే... రీవా ఆత్మశాంతికి ప్రార్థించడం తప్ప! అనుమానం వచ్చి క్రికెట్ బ్యాట్‌తో తలుపు పగులగొట్టాడు. లోపల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది రీవా. తనను ఎలాగైనా కాపాడుకోవాలని అంబులెన్సు కోసం ఫోన్ చేసి, ఆమెను చేతుల్లో ఎత్తుకుని హాల్లోకి తీసుకొస్తుండగానే సమయం మించిపోయింది. రీవా ఊపిరి ఆగిపోయింది. ఇదీ ఆస్కార్ పోలీసులకు, కోర్టుకు చెప్పిన విషయం. అయితే జరిగినదానికీ, దొరికిన సాక్ష్యాలకీ, ఆస్కార్ చెప్పినదానికీ ఏమాత్రం పొంతన కుదరలేదు. రీవాకి బుల్లెట్లు తగిలిన విధానాన్ని బట్టి ఆమె వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుని ఉంది. అప్పుడే ఆస్కార్ షూట్ చేశాడు. అతడి పిలుపు వినివుంటే ఆమె బదులు పలికేది కదా! లేచి తలుపు తీసేది కదా! అన్నిసార్లు పిలిచినా ఎందుకు మాట్లాడదు! పోనీ ఏదైనా గొడవ జరిగిందా? కోపంతో పలకలేదా? లేదంటే ఏ కారణం చేత అయినా అతడికి భయపడి దాక్కుని ఉందా? అలా అనుకున్నా నిలబడి ఉంటుంది కానీ ఎందుక్కూర్చుంటుంది? అలికిడి వినగానే కృత్రిమకాళ్లు అమర్చుకోకుండానే పాకుతూ బాత్రూమ్ దగ్గరకు వెళ్లానని, తర్వాత మంచం వైపు చూస్తే రీవా లేదని, దాంతో వెళ్లి కాళ్లు అమర్చుకుని వచ్చి తలుపు పగుల గొట్టానని, ఆమెను ఎత్తుకుని కిందికి తీసుకొచ్చానని ఆస్కార్ చెప్పాడు. నడవలేని వ్యక్తి ఎవరైనా.... తనతో పాటు ఒక మనిషి ఉన్నప్పుడు, అలికిడి అవగానే అదేంటో చూడమని ఆ మనిషితో చెప్తాడు కానీ, తనే ఎందుకు పాక్కుంటూ వెళ్తాడు? మరో విషయం... పిలిచినప్పుడు ఆమె కావాలని పలకకపోయినా, మొదటి బుల్లెట్ తగలగానే కేక పెడుతుంది కదా! అది విని అయినా ఇక కాల్చడం మానేయాలి కదా! ఈ ప్రశ్నల్లో వేటికీ ఆస్కార్ దగ్గర సమాధానం లేదు. దాంతో రీవా తల్లి చెప్పిన మాటలు నిజమేనేమో అనిపించింది పోలీసులకు. రీవా ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించిందని, కానీ అతడు అసూయాపరుడని, పురుషాహంకారంతో రీవాని హింసించేవాడనీ ఆమె చెప్పింది. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన రీవా, అతడికి దూరమైపోవాలనుకుంటున్నట్టు ఆ రోజు రాత్రే తనతో చెప్పిందని అందామె. ఆ రాత్రి తెల్లవారకముందే రీవా మృత్యు వాత పడింది. బహుశా వదిలి వెళ్తానం దన్న కోపంతోనే రీవాని చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిందామె. ఎలా చూసినా సాక్ష్యాలన్నీ ఆస్కార్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకే అతడికి జీవితఖైదు పడొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ కేవలం ఐదేళ్లు శిక్ష వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యాయమూర్తి మసిపాకు ఆస్కార్ చేసింది హత్య అనిపించలేదు. దొంగ అనుకునే కాల్పులు జరిపాడని నమ్మిందామె. అందుకే ఐదేళ్లు శిక్ష విధిస్తున్నానని చెప్పింది. కానీ అది న్యాయమేనా? అతడు చెప్పేదానిలో ఏ మాత్రం వాస్తవం ఉన్నట్టు అనిపించకపోయినా, దొరికిన సాక్ష్యాలన్నీ అతడే దోషి అని నిరూపిస్తున్నా... పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడంటూ తక్కువ శిక్షను వేయడం సబబేనా? ఇరవై తొమ్మిదేళ్ల వయసులో చేయని తప్పుకు బలైపోయిన రీవాకు న్యాయం జరిగినట్టేనా?!! - సమీర నేలపూడి -
పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష
బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా తన తీర్పు వెలువరించారు. తన స్నేహితురాలిని తుపాకితో కాల్చిచంపినందుకు పిస్టోరియస్ ఐదు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండాలని తీర్పు ఇచ్చారు. 2013 సంవత్సరంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన స్నేహితురాలు రీవా స్టీన్‌క్యాంప్‌ను పిస్టోరియస్ కాల్చి చంపాడు. అయితే.. అది హత్య కాదని, హత్యకు దారితీసిన పరిస్థితి (కల్పబుల్ హోమిసైడ్) అని జడ్జి భావించారు. అందుకే ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మరో కేసులో మూడేళ్ల సస్పెండ్ శిక్ష కూడా పిస్టోరియస్కు విధించారు. -
కోర్టులో పిస్టోరియస్ కు ఊరట
ప్రిటోరియా: తన ప్రియురాలు రీవా స్టెన్ క్యాంప్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ కు కోర్టులో ఊరట లభించింది. 2013 లో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్ క్యాంప్ ను హత్య చేసాడంటూ అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారణకు స్వీకరించిన దక్షిణాఫ్రికా హైకోర్టు.. పిస్టోరియన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదంటూ పేర్కొంది. ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పిస్టోరియస్ ను ముద్దాయిగా నిర్ధారించే సరైన సాక్ష్యం లేవని తెలిపింది. అయితే తీర్పు పాఠం పూర్తిగా చదివి వినిపించేందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందని స్పష్టం చేసింది. 'పిస్టోరియన్ కావాలని ఆమెను హత్య చేసినట్లు నిరూపణ కాలేదు. అందుకు సంబంధించిన సాక్షాలను కూడా పోలీసులు సేకరించలేదు. దీన్ని బట్టి తన వద్ద నున్న గన్ తో కాల్పులు జరిపినా.. స్వతహాగా ఆమెను చంపడానికి యత్నించలేదని స్పష్టమవుతోంది' అంటూ కోర్టు తెలిపింది. అయితే తుది తీర్పును ఇంకా కోర్టు వెలువరించాల్సి ఉంది. 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపినట్టు కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. -
నేడే పిస్టోరియస్ 'హత్యకేసు' తుది తీర్పు!
ప్రిటోరియా: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ తుది తీర్పును వినేందుకు ప్రిటోరియా హైకోర్టుకు చేరుకున్నారు. సంచలనం రేపిన హత్య కేసుకు సంబంధించిన తుది తీర్పును న్యాయమూర్తి సిద్ధం చేశారు. 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపినట్టు కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. ఈ హత్య కేసులో ఆరోపణలు రుజవైతే జీవితఖైదు పడే అవకాశం ఉంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)