నేడే పిస్టోరియస్ 'హత్యకేసు' తుది తీర్పు!
ప్రిటోరియా: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ తుది తీర్పును వినేందుకు ప్రిటోరియా హైకోర్టుకు చేరుకున్నారు. సంచలనం రేపిన హత్య కేసుకు సంబంధించిన తుది తీర్పును న్యాయమూర్తి సిద్ధం చేశారు. 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపినట్టు కేసు నమోదైంది.
అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. ఈ హత్య కేసులో ఆరోపణలు రుజవైతే జీవితఖైదు పడే అవకాశం ఉంది.