ప్రిటోరియా: ప్రియురాలిని హత్య చేసి జైలు కెళ్లిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక మిగితా శిక్ష కాలాన్ని హౌజ్ అరెస్టు కింద ఉండి పూర్తి చేయనున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా మీడియాకు సమాచారం అందించకుండా సోమవారం రాత్రి ఆయనను విడుదల చేసినట్లు ప్రిస్టోరియస్ కుటుంబ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం అతడు ప్రిటోరియాలోని బంధువుల ఇంట్లో ఉన్నాడని తెలిపారు. మంగళవారం తర్వాత ఆ కుటుంబం పిస్టోరియస్కు సంబంధించి ఓ అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడికి జైలు శిక్ష పడింది.
ప్రియురాలిని చంపిన పిస్టోరియస్ విడుదల
Published Tue, Oct 20 2015 10:35 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement