Pretoria
-
ఒకే కాన్పులో పదిమంది: అంతా కట్టుకథ!
ఒకే కాన్పులో పదిమంది పిల్లలకు జన్మనిచ్చానని ప్రకటించుకున్న తల్లి వ్యవహారంలో ఊహించిందే జరిగింది. అనుమానాల్ని పటాపంచల్ చేస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అధికారికంగా ఒక నివేదికను వెల్లడించింది. ఆమె, ఆమె భర్త చెప్పింది పచ్చి అబద్ధమని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గోసియామె తమార సిత్హోల్(37) అల్లింది కట్టుకథేనని ప్రకటిస్తూ.. ఆమెను మానసిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది. ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. అసలు సిత్హోల్ ఈమధ్య కాలంలో గర్భమే దాల్చలేదని అదిరిపోయే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ మేరకు ఆమెను పరీక్షించిన వైద్యుల నివేదికను టెంబిసా అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. అంతేకాదు ఆమె మానసిక ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మెంటల్ హెల్త్ యాక్ట్ కింద ఆమెను అదుపులోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మరోవైపు ఆమె భర్త టెబెహో సోటెట్సిను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని అతితోనే.. జూన్ 7న టెంబిసా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గోసియామె తమార సిత్హోల్ ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది వార్త. ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ పెయిట్ ర్యామ్‌పెడి అత్యుత్సాహం వల్లే ఈ కథనం ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆ పిల్లల ఫొటోలు, వీడియోలు వైరల్ కాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు తమ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని సిత్హోల్, టెబెహో విరాళాలు సేకరించారు. ఒకానొక టైంలో తన భార్యా పిల్లల ఆచూకీ తనకూ తెలియడం లేదని, అప్పటిదాకా విరాళాలు ఇవ్వడం ఆపండని టెబెహో రిక్వెస్ట్ చేశాడు. మరోవైపు గతంలోనూ ముగ్గురు పిల్లలు పుట్టారని సిత్హోల్ ప్రకటించుకుందని, కానీ, అందులో నిజం లేదని బంధువులు చెప్పారు. ఒకానొక టైంలో ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అనుమానాలు-విమర్శల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. టెంబిసాలో ఏ ఆస్పత్రిలో ఆమె డెలివరీ కోసం చేరలేదని నిర్ధారించుకుని.. ఆపై ఆమె కట్టుకథను ఆధారాలతో సహా బయటపెట్టారు అధికారులు. ఇక ఇదంతా ఫేక్ అని తేలడంతో.. మాలి దేశంలో మే నెలలో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన హలీమా సిస్సే రికార్డు పదిలంగా ఉందని చెప్పొచ్చు. చదవండి: 7 నెలల 7 రోజులకే.. -
ఒకే కాన్పులో పది మంది: అసలు బిడ్డలెక్కడ?
దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పుట్టిన బిడ్డలతో సహా ఆ తల్లి ఫొటోలను ఇంతవరకు బయటకు రిలీజ్ చేయకపోగా, ఆ తల్లీబిడ్డల ఆచూకీని ఇప్పటికీ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ వ్యహారంలో ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ పెయిట్ ర్యామ్‌పెడి అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిటోరియా: టెంబిసా పట్టణంలో గోసియామె తమార సిత్హోల్ అనే 37 ఏళ్ల మహిళ.. నెలలు నిండకముందే పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది ప్రిటోరియా న్యూస్ కథనం. ఈ రికార్డు జననాల కథనం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా హౌజ్‌లన్నీ ఆ కథనాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే అధికారికంగా ఈ విషయాన్ని టెంబిసా అధికారులుగానీ, ఏ ఆస్పత్రి వర్గాలుగానీ ప్రకటించలేదు. ఇక వారం గడుస్తున్నా ఆ తల్లీబిడ్డలు మీడియా ముందుకు రాకపోవడంతో ఇది అసలు ఉత్త కథే అని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీనికితోడు ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించిన స్టేట్మెంట్ ప్రకారం చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. స్టీవ్ బికో అకాడమిక్ హస్పిటల్లో తాను పది మందికి జన్మనిచ్చానని సిత్హోల్, ‘క్లెమెంట్ మన్యాతెల షో’లో ఆమె స్వయంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆ హాస్పిటల్ సీఈవో మథాబో మాథ్యుబెలా స్పందించారు. అసలు అలాంటి డెలివరీ కేసు తమ హాస్పిటల్ రికార్డుల్లో నమోదుకాలేదని ఆయన తేల్చేశారు. స్టీవ్ బికో ఆస్పత్రిపాటుతో పాటు ఇలాంటి సంక్లిష్టమైన ప్రసవాల కేసును డీల్ చేసే లూయిస్ పాస్టూర్, మెడిక్లినిక్ మెడ్‌ఫోరం హాస్పిటల్స్ కూడా అలాంటి డెలివరీ తమ దగ్గర రికార్డు కాలేదని వెల్లడించాయి. దీంతో ఈ వ్యవహారంలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ బిడ్డల తండ్రి టెబెహో సోటెట్సి తాజా స్టేట్మెంట్తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎక్కడున్నారో తెలియదు తాను చాలా పేదరికంలో ఉన్నానని, బిడ్డలకు సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని గోసియామె సిత్హోల్ ప్రజలను కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు దక్షిణాప్రికా దేశవ్యాప్తంగా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో విరాళాల్ని ఇవ్వొద్దంటూ ఇప్పుడు స్వయంగా టెబెహో కోరుతున్నాడు. అసలు పిల్లలెక్కడ ఉన్నారో? నాక్కుడా తెలియదు. వాళ్లు ఇంటికి వచ్చేదాకా ఎవరూవిరాళాలు ఇవ్వకండి అంటూ ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా ప్రిటోరియా న్యూస్‌కి సమాచారం అందించింది టెబెహోనే కావడం విశేషం. మరోవైపు సోటెట్సి కుటుంబ సభ్యులు గోసియామో సిత్‌హోల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2018లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిందని ఆమె ప్రకటించుకుందని, ఆ బిడ్డలు మాత్రం జాడలేరని వాళ్లు మీడియాకు తెలిపారు. నన్ను బద్నాం చేయొద్దు కాగా, పది మంది పిల్లల వ్యవహారంలో దక్షిణాఫ్రికా మీడియా నైతికతపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పేద మహిళ జీవితంలోకి తొంగిచూసి.. అనుమానాలు, ఆరోపణలు చేయడం సరికాదని మీడియాను హెచ్చరించారు కొందరు. అయితే ఆ కొందరే ఇప్పుడు అనుమానాల నేపథ్యంలో ఫేక్ కథనాలతో ప్రజల్ని తప్పుబట్టారంటూ మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఇక మంగళవారం ప్రిటోరియా న్యూస్ రూంలో ప్రత్యక్షమైన గోసియామో సిత్హోల్.. తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని, టెబెహో ఫ్యామిలీకి తన మీద మొదటి నుంచి ప్రేమ లేదని, అందుకే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బిడ్డల ఐడెంటిటీని పబ్లిక్‌గా ఎప్పుడు చూపిస్తారనే ప్రశ్నకు ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో అనుమానాలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. #Tembisa10 Two babies: twins Three babies: triplets Four babies: quadruplets Ten babies: missing pic.twitter.com/cEYbrtX81L — Birthmark Pearson ⛴ (@Kai_WithNoX) June 15, 2021 Piet, trying to sort out the Tembisa 10 equation in front of during South Africans. 🙆🏽♂️ 😂😂😂#Tembisa10 pic.twitter.com/wTaZxANKmM — MOSS™🇿🇦🏳️🌈 (@_officialMoss) June 15, 2021 -
అధ్యక్షుడికీ తప్పని.. ఓట్లపాట్లు
జొహాన్నెస్‌బర్గ్: ఓట్ల పండగొస్తే అది అనకాపల్లైనా ఆఫ్రికా అయినా గుళ్లో ఉండే దేవుడి కంటే గల్లీలో ఉండే ఓటరు దర్శనానికే నాయకులు క్యూ కడతారు. ఓటరు మహాశయుడిని కలిసి వారి సుఖదుఃఖాలు తెలుసుకుంటారు. మేమున్నామంటూ మాటిచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజధానిలో ఉండే నేతలు కూడా వాడవాడకూ, ఇంటింటికీ తిరగాల్సిందే. ప్రజలను కలసి హామీల మాయా మూటలు అప్పజెప్పాల్సిందే. లేదంటే ఓటరు మనసు మారిపోదూ!.. అలా అయిన పక్షంలో ప్రాణం కంటే ఖరీదైన ఓటు జారిపోదూ..! అసలు వివయంలోకి వస్తే మన దేశంలోలాగే భగభగ ‘మండే’లా దక్షిణాఫ్రికాలోనూ ఎన్నికలు రెండు నెలల్లో జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సౌతాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫొసా ఇప్పట్నుంచే తన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా రాజధానికి దగ్గరలోని మబోపనే టౌన్‌షిప్‌ను సందర్శించారు. ప్రచార అనంతరం మబోపనే నుంచి రాజధాని ప్రిటోరియాకు సాధారణ ప్రయాణికులతో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ రైలు రాక కోసం రామఫొసా గంటసేపు ఎదురు చూడవలసి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన రైలు 45 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రిటోరియా స్టేషన్‌కు వెళ్లడానికి 3 గంటల సమయం పట్టింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో అనుకోకుండా చాలాసేపు ఆగిపోయింది. ఆ టైమ్‌లో ఆయనతో ఉన్న విలేకరులు ప్రయాణికులతో రామఫొసా ముచ్చటిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికాలో రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణమైన విషయం. ప్రయాణికులతో అధ్యక్షుడు రామఫొసా ఉన్న ఫొటోలపై అక్కడి సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శల దాడికి దిగారు. రామఫొసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ప్రభుత్వానికి సిగ్గులేదని, ఘోరంగా ఉన్న రైల్వే వ్యవస్థ ప్రాసా (ప్యాసింజర్ రైల్ ఏజెన్సీ ఆఫ్ సౌతాఫ్రికా) సర్వీసుల గురించి ప్రజలు గగ్గోలు పెడుతున్నా సిరిల్ సర్కార్ పట్టించుకోవపోవడం పాపమని ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రయాణానంతరం ప్రిటోరియాకు చేరుకున్న అధ్యక్షుడు రామఫొసా అక్కడి రైల్వే అధికారులను కలసి ఇది జాతీయ సమస్యగా మారిందని దీన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్యరించాలని ఆదేశించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రామఫొసా ’’రైళ్లో 50 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్యరించేలా ప్రాసాతో చర్చలు జరుపుతున్నామ’’ని అన్నారు. 400 సీట్లున్న సౌతాఫ్రికా పార్లమెంట్లో సమారు 60 శాతం ఓట్లను గెలుచుకునే దిశగా రామఫొసో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. -
ప్రియురాలిని చంపిన పిస్టోరియస్ విడుదల
ప్రిటోరియా: ప్రియురాలిని హత్య చేసి జైలు కెళ్లిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక మిగితా శిక్ష కాలాన్ని హౌజ్ అరెస్టు కింద ఉండి పూర్తి చేయనున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా మీడియాకు సమాచారం అందించకుండా సోమవారం రాత్రి ఆయనను విడుదల చేసినట్లు ప్రిస్టోరియస్ కుటుంబ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతడు ప్రిటోరియాలోని బంధువుల ఇంట్లో ఉన్నాడని తెలిపారు. మంగళవారం తర్వాత ఆ కుటుంబం పిస్టోరియస్కు సంబంధించి ఓ అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడికి జైలు శిక్ష పడింది. -
బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు 15 ఏళ్లు జైలు
ప్రిటోరియా: ప్రియురాలి హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన దక్షిణాఫ్రికా హైకోర్టు ఈ మేరకు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2013 లో పిస్టోరియస్ తన ప్రియురాలు రీవా స్టెన్ క్యాంప్‌ను హత్య చేసినట్టు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. ఈ కేసును గురువారం విచారించిన న్యాయస్థానం పిస్టోరియన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదంటూ పేర్కొంది. అయితే ఓ వ్యక్తి మరణానికి కారణమైనందున తక్కువ తీవ్రత కలిగిన హోమిసైడ్ కేసును ఈ రోజు విచారించింది. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా ప్రియురాలిని చంపలేదని, అయితే హత్య చేసింది అతనేనని పేర్కొంది. పిస్టోరియస్కు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. -
పిస్టోరియస్ కావాలని చంపలేదు
- ప్రిటోరియా హైకోర్టు తీర్పు - ప్రియురాలి హత్య కేసులో బ్లేడ్ రన్నర్‌కు ఊరట ప్రిటోరియా: బ్లేడ్ రన్నర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్కు తన ప్రియురాలి హత్య కేసులో కాస్త ఉపశమనం లభించింది. ఉద్దేశపూర్వకంగానే అతడీ హత్య చేసినట్టు నిరూపితం కాలేదని అతడిపై ఉన్న హత్యానేరాన్ని ప్రిటోరియా హైకోర్టు జడ్జి తొకోజిలే మసిపా కొట్టివేశారు. అలాగే అత్యంత కఠిన శిక్ష పడే అభియోగాలను సైతం తోసిపుచ్చారు. సంఘటన జరిగిన రోజు తనో హత్య చేయబోతున్నట్టు అతడేమీ ఊహించలేదని తెలిపారు. ‘ఈ హత్య కేసు స్పష్టంగా నిరూపితం కాలేదు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేశాడని చెప్పేందుకు ఆధారాలు లేవు. కచ్చితంగా ఆ రోజు ఇలా జరుగుతుందని పిస్టోరియస్ అనుకోలేదు. తలుపు వెనకాల ఉన్న వ్యక్తిని మాత్రమే తను చంపాడని భావించాడు. ఎందుకంటే ఆ సమయంలో తన ప్రియురాలు బెడ్ రూమ్‌లో ఉన్నట్టు అతడికి తెలుసు. కానీ ఆ సమయంలో తను చాలా ఆదరా బాదరాగా ప్రవర్తించాడు. విపరీతమైన శక్తిని ఉపయోగించాడు. ఓ విధంగా అతను నిర్లక్ష్యంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు వెలువడిన సమయంలో కోర్టు రూమ్‌లోనే ఉన్న పిస్టోరియస్ తల దించుకుని మౌనంగా రోదించాడు. అయితే ఓ వ్యక్తి మరణానికి కారణమైనందున తక్కువ తీవ్రత కలిగిన హోమిసైడ్ కేసు పిస్టోరియస్పై అలాగే ఉంది. ఈ కేసు విచారణ నేడు (శుక్రవారం) కొనసాగనుంది. ఫిబ్రవరి 14, 2013న పిస్టోరియస్ ఇంట్లోని టాయిలెట్లో ఈ హత్య జరిగింది. ఎవరో ఆగంతకుడు ఇంట్లో చొరబడ్డాడనుకుని కాల్పులు జరిపినట్టు ఆది నుంచీ ఈ క్రీడాకారుడు వాదిస్తున్నాడు. అయితే తన ప్రియురాలితో గొడవ పడి కావాలనే చంపేసినట్టు ప్రాసిక్యూషన్ వాదించింది. కానీ ఆ జంట మధ్య గొడవ జరిగినట్టు ఆధారాలు లేవని జడ్జి తేల్చారు. మితిమీరిన మీడియా కవరేజి కూడా సాక్షులపై ప్రభావం చూపిందని చెప్పారు. ఘటన జరిగిన అనంతరం కొద్ది రోజులు జైల్లోనే ఉన్న ఈ 27 ఏళ్ల అథ్లెట్ తిరిగి బెయిల్‌పై విడుదలయ్యాడు. -
కోర్టులో పిస్టోరియస్ కు ఊరట
ప్రిటోరియా: తన ప్రియురాలు రీవా స్టెన్ క్యాంప్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ కు కోర్టులో ఊరట లభించింది. 2013 లో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్ క్యాంప్ ను హత్య చేసాడంటూ అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారణకు స్వీకరించిన దక్షిణాఫ్రికా హైకోర్టు.. పిస్టోరియన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదంటూ పేర్కొంది. ప్రియురాలు రీవా స్టీన్ క్యాంప్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పిస్టోరియస్ ను ముద్దాయిగా నిర్ధారించే సరైన సాక్ష్యం లేవని తెలిపింది. అయితే తీర్పు పాఠం పూర్తిగా చదివి వినిపించేందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందని స్పష్టం చేసింది. 'పిస్టోరియన్ కావాలని ఆమెను హత్య చేసినట్లు నిరూపణ కాలేదు. అందుకు సంబంధించిన సాక్షాలను కూడా పోలీసులు సేకరించలేదు. దీన్ని బట్టి తన వద్ద నున్న గన్ తో కాల్పులు జరిపినా.. స్వతహాగా ఆమెను చంపడానికి యత్నించలేదని స్పష్టమవుతోంది' అంటూ కోర్టు తెలిపింది. అయితే తుది తీర్పును ఇంకా కోర్టు వెలువరించాల్సి ఉంది. 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపినట్టు కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. -
నేడే పిస్టోరియస్ 'హత్యకేసు' తుది తీర్పు!
ప్రిటోరియా: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ తుది తీర్పును వినేందుకు ప్రిటోరియా హైకోర్టుకు చేరుకున్నారు. సంచలనం రేపిన హత్య కేసుకు సంబంధించిన తుది తీర్పును న్యాయమూర్తి సిద్ధం చేశారు. 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టెన్ క్యాంప్ ను దారుణంగా కాల్చి చంపినట్టు కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. ఈ హత్య కేసులో ఆరోపణలు రుజవైతే జీవితఖైదు పడే అవకాశం ఉంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
చిన్నారులపై అత్యాచారాలను ఖండించిన మంత్రి
దేశంలో చిన్నారుల నుంచి టీనేజ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దక్షిణాఫ్రికా మహిళ మంత్రి లులూ గ్జింగ్వాన శనివారం ఖండించారు. దక్షిణాఫ్రికా సమాజంలో అటువంటి సంఘటనలు రోజురోజూకు అధికమవుతున్నట్లు వస్తున్న నివేదికల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో దేశంలో చోటు చేసుకున్న పలు ఘటనలను ఆమె ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు. లైంగిక దాడులకు గురైన బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు మద్దతు అందించాలని ఆమె దక్షిణాఫ్రికా సమాజానికి విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఆటువంటి సంఘటనలు చోటు చేసుకోని సమాజం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించాలని లులూ గ్జింగ్వాన్ దక్షిణాఫ్రికా ప్రజలకు హితవు పలికారు. చిన్నారులు, మహిళలపైన జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఘటనలకు పాల్పడే నిందితులను శిక్షించే క్రమంలో శిక్షించాలను మరింత కఠినతరం చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. -
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం: 29 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని క్వాగ్గాఫొన్టెన్ పట్టణ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు మరణించారని పుమాలంగ్ ప్రావెన్స్ భద్రత విభాగం ప్రతినిధి జోసఫ్ మబుజా మంగళవారం జోహెన్స్‌బర్గ్‌లో వెల్లడించారు. ఆ ఘటనలో 11 మందికి గాయలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని క్వమలంగ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దక్షిణాఫ్రికా రాజధాని నగరాల్లో ఒకటైన ప్రిటోరియా నుంచి వస్తున్న బస్సును ఎదురు వస్తున్న ట్రక్ ఢీ కొన్నడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఆ ప్రమాద ఘటనలో 26 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని, క్షతగాత్రుల్లో మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారని చెప్పారు. దాంతో మృతుల సంఖ్య 29కి చెరుకుందన్నారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ట్రక్ డ్రైవర్ బస్సును ఢీ కొట్టారని జోసఫ్ మబుజా వివరించారు. ఆ దుర్ఘటనలో బస్సు, ట్రక్ డ్రైవర్లు మరణించి ఉండవచ్చు అన్నారు. ప్రిటోరియా వెళ్లే రహదారిలో తరచుగా వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని, ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రొవిన్షియల్ మినిస్టర్ సోమవారం మీడియాకు వెల్లడించారు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో డర్బన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది మరణించగా, మార్చిలో కేప్‌టౌన్ పట్టణంలో డబుల్ డెక్కర్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జి
కేప్‌టౌన్(ఐఎఎన్ఎస్): జాతి వివక్ష వ్యతిరేకతకు చిహ్నంగా నిలిచిన నెల్సన్ మండేలా ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మూడు నెలలుగా ఆయన ప్రిటోరియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 95 సంవత్సరాల మండేలాకు ఇంటి వద్దనే చికిత్స కొనసాగుతుంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైన మండేలా ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉంది. ప్రిటోరియా ఆస్పత్రిలో తీసుకున్న జాగ్రత్తలనే డాక్లర్ల బృందం ఆయన ఇంటి వద్ద కూడా తీసుకుంటుంది. వర్ణ వివక్ష సమయంలో మండేలా 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఆయనకు క్షయ వ్యాధి తీవ్రమైంది. దాని ఫలితంగా ఇప్పుడు ఆయన లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. -
ఆసీస్‌పై భారత్ గెలుపు
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లోభాగంగా ఆస్ట్రేలియా -ఏతో ఇక్కడ బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 244 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఫించ్(20), మార్ష్(11) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మెడిన్సన్(7), మ్యాక్స్‌వెల్(12) విఫలం కావడంతో ఆసీస్‌కు కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్ జట్టులో పోరాట స్ఫూర్తి లోపించడంతో వరుస వికెట్లు చేజార్చుకుని ఓటమి పాలైంది. చివర్లో పెయిన్(47) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 193 పరుగులకే పరిమితమైన ఆసీస్‌కు చుక్కెదురైంది. భారత బౌలర్లలో నందీమ్కు మూడు వికెట్లు, మహ్మద్ షమీకు రెండు వికెట్లు లభించగా, సురేష్ రైనా, పాండే, రసూల్ కు తలో వికెట్టు దక్కింది. అంతకుముందు బ్యాటింగ్ దిగిన భారత్ 49.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ శిఖర్ థావన్(62) పరుగులతో ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్ ఆటగాడు దినేష్ కార్తీక్(73) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడానికి దోహదపడ్డాడు. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.