దేశంలో చిన్నారుల నుంచి టీనేజ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దక్షిణాఫ్రికా మహిళ మంత్రి లులూ గ్జింగ్వాన శనివారం ఖండించారు. దక్షిణాఫ్రికా సమాజంలో అటువంటి సంఘటనలు రోజురోజూకు అధికమవుతున్నట్లు వస్తున్న నివేదికల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో దేశంలో చోటు చేసుకున్న పలు ఘటనలను ఆమె ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు. లైంగిక దాడులకు గురైన బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు మద్దతు అందించాలని ఆమె దక్షిణాఫ్రికా సమాజానికి విజ్ఞప్తి చేశారు.
సమాజంలో ఆటువంటి సంఘటనలు చోటు చేసుకోని సమాజం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించాలని లులూ గ్జింగ్వాన్ దక్షిణాఫ్రికా ప్రజలకు హితవు పలికారు. చిన్నారులు, మహిళలపైన జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఘటనలకు పాల్పడే నిందితులను శిక్షించే క్రమంలో శిక్షించాలను మరింత కఠినతరం చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.