కేప్టౌన్(ఐఎఎన్ఎస్): జాతి వివక్ష వ్యతిరేకతకు చిహ్నంగా నిలిచిన నెల్సన్ మండేలా ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మూడు నెలలుగా ఆయన ప్రిటోరియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 95 సంవత్సరాల మండేలాకు ఇంటి వద్దనే చికిత్స కొనసాగుతుంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైన మండేలా ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉంది. ప్రిటోరియా ఆస్పత్రిలో తీసుకున్న జాగ్రత్తలనే డాక్లర్ల బృందం ఆయన ఇంటి వద్ద కూడా తీసుకుంటుంది.
వర్ణ వివక్ష సమయంలో మండేలా 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఆయనకు క్షయ వ్యాధి తీవ్రమైంది. దాని ఫలితంగా ఇప్పుడు ఆయన లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు.