AP CM YS Jagan Reaction On Fast Track Court Verdict Over Guntur Btech Student Ramya Murder Case - Sakshi
Sakshi News home page

Btech Student Murder Case Verdict: రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. సీఎం జగన్‌ ట్వీట్‌

Published Fri, Apr 29 2022 5:18 PM | Last Updated on Sat, Apr 30 2022 11:38 AM

CM YS Jagan Tweet On Fast Track Court Verdict On Ramya Murder Case - Sakshi

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్‌ న్యాయవాదిని ఆయన అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పిందన్నారు.
చదవండి: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు 

మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తూ జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పని చేసి మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి, దోషులకు కఠినంగా శిక్షలు పడేలా కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. కాగా, ఇదే విషయమై పోలీసు శాఖకు అభినందనలు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు.    

చదవండి: రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement