మరొకరికి యావజ్జీవ కారాగారం
కాచిగూడ: నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఒకరికి మరణ శిక్ష, మరో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ నాంపల్లి అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ తీర్పు వెలువరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. రాగుల సాయి స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది.
కొన్నాళ్ల తర్వాత నాగరాజు ఆర్తిని వేధింపులకు గురి చేసేవాడు. ఆర్తిని చెల్లిగా పిలవాలని నాగరాజు స్నేహితుడైన రాగుల సాయికి తెలపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని మనసులో పెట్టుకున్న రాగుల సాయి తన స్నేహితుడు ఎ.రాహుల్ ఇద్దరూ కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజును, వీరి ఏడాది కుమారుడు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్‌మెంట్స్ నారాయణగూడ పోలీసులు రికార్డ్ చేసుకొని కేసు నమోదు చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆర్తి, నాగరాజు, వీరి ఏడాది కుమారుడు విష్ణు, ఆర్తి కడుపులోని బిడ్డతో సహా నలుగురూ మృతి చెందారు.
అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న నారాయగూడ పోలీసులు దర్యాప్తు సాగించారు. మొదటి ప్రాధాన్యతగా ఈ కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ శుక్రవారం నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment