బెంగళూరు: ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. తాజాగా రీ-యూజబుల్ లాంచింగ్ వెహికల్(ఆర్ఎల్వీ) ప్రయోగంలో తొలి అడుగు విజయవంతంగా వేసిన ఇస్రో జూన్ నెలలో ఈ ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్లు చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ కేసీసీఐ) సమావేశంలో మాట్లాడిన ఆయన 22 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్ కు చెందినవి వివరించారు.
జూన్ ఆఖరి వారంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్, కెనడా, ఇండోనేషియా, జర్మనీ తదితర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సీ34 ను వినియోగించనున్నట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కే శివన్ వివరించారు. ఇస్రో 2008లో ఒకేసారి 10 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం పూర్తయిన వెంటనే స్కాటరోమీటర్ ప్రయోగాన్ని, ఆ తర్వాత ఇన్ శాట్-3డీఆర్ లను ప్రయోగించనున్నట్లు కిరణ్ చెప్పారు.
ఒకేసారి 22 ఉపగ్రహాలను పంపుతారట!
Published Sat, May 28 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM
Advertisement
Advertisement