శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) బెంగుళూరులోని తయారీ కేంద్రం నుంచి కార్టోశాట్-2సీ ఉపగ్రహన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య శ్రీహరికోటకు చేర్చింది. ఈ నెల 20న ఉదయం 9.30 నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ-34 ఉపగ్రహవాహక నౌక ద్వారా ప్రయోగించనున్న 22 ఉపగ్రహాల్లో కార్టోశాట్-సీ2 ప్రధానమైనది.