శ్రీహరికోట: PSLV C59 ప్రయోగం వాయిదా | Proba-3 mission: Isro PSLV-C59 launch Halted | Sakshi
Sakshi News home page

శ్రీహరికోట: ప్రోబాలో సమస్య.. PSLV C59 ప్రయోగం వాయిదా

Published Wed, Dec 4 2024 3:36 PM | Last Updated on Wed, Dec 4 2024 4:36 PM

Proba-3 mission: Isro PSLV-C59 launch Halted

తిరుపతి, సాక్షి: శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన నిర్వహించాల్సిన పీఎస్‌ఎల్వీ C-59 ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగానికి గంట ముందు.. ప్రోబా-3లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అధికారులు కౌంట్‌డౌన్‌ నిలిపివేసి.. ప్రయోగాన్ని వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. 

యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి!.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement