![List Of Upcoming New Telugu Movies Releases In June Last Week - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/6/june-movies.jpg.webp?itok=pkF3UFMf)
మొన్నటిదాకా భారీ బడ్జెట్ సినిమాలు దుమ్ములేపాయి. కరోనాతో వెలవెలబోయిన థియేటర్లకు జనాలను రప్పిస్తూ తిరిగి కళకళలాడేలా చేశాయి. దీంతో అప్పటిదాకా రిలీజ్ చేయాలా? వద్దా? అని ఆలోచించిన సినిమాలన్నీ వరుసపెట్టి విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని బోల్తా కూడా కొట్టాయి. మరికొన్ని అంచనాలకు మించిన విజయాన్ని అందుకున్నాయి. ఇదే హుషారుతో జూన్ నెల కూడా బోలెడన్ని సినిమాలతో రెడీ అయింది. ఇప్పటికే జూన్ 3న సౌత్‌లో రిలీజైన రెండు సినిమాలు మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మంచి హిట్లుగా నిలిచాయి. మరి రానున్న రోజుల్లో ఏమేం సినిమాలు రిలీజవుతున్నాయో చూద్దాం..
జూన్ 10న 'అంటే సుందరానికీ', 'సురాపానం, జరిగిన కథ', '777 చార్లీ', 'జురాసిక్ వరల్డ్ డొమీనియన్' సినిమాలు రిలీజవుతున్నాయి. 17వ తేదీన 'గాడ్సే', 'విరాటపర్వం', కన్నడ డబ్బింగ్ మూవీ 'కే3', కీర్తి సురేశ్ 'వాశి', 'కిరోసిన్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే జూన్ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు మరో ఎత్తు. జూన్ ఆఖరి వారంలో ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి.
జూన్ 23న 'కొండా', 24న 'సమ్మతమే', '7 డేస్ 6 నైట్స్', 'ఒక పథకం ప్రకారం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు', '10th క్లాస్ డైరీస్', 'సదా నన్ను నడిపే', 'సాఫ్ట్‌వేర్ బ్లూస్' సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. కృష్ణ వ్రింద విహారి సినిమా కూడా జూన్ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న మూవీస్ కూడా తమ లక్ పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు జై కొడతారనేది చూడాలి.
చదవండి: ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను: ఉదయభాను భావోద్వేగం
నాకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి సల్మాన్ కంటతడి
Comments
Please login to add a commentAdd a comment