రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విరాపటర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఆదివారం (జూన్ 5న) ట్రైలర్ రిలీజైంది. రానా కామ్రేడ్ రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా కనిపించారు. 'చిన్న ఎవడు? పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు? సామ్యవాద పాలననే స్థాపించగ ఎదిగినాడు..' అంటూ రానా మాటలు వినిపించడంతో ట్రైలర్ మొదలవుతుంది. అతడు రాసే పుస్తకాలను చదివి హీరోతో తెలియకుండానే ప్రేమలో పడుతుంది సాయిపల్లవి.
పుస్తకం రాశినోడును చూడాలనుందంటూ అమ్మవారి దగ్గర మొద పెట్టుకుంటుంది హీరోయిన్. అలా అడిగిందో రవన్న దళం ఊర్లో దిగుతుంది. అందులో లీడర్ రానాను చూసి మురిసిపోయింది సాయి. అంతేకాదు, ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తిని పొందడం కోసం తాను కూడా నక్సలైట్‌గా మారుతుంది. కానీ ప్రజాసేవలో మునిగిపోయిన హీరోకు ప్రేమ అంటే గిట్టనట్లే కనిపిస్తున్నాడు. మరి అతడు వెన్నెల ప్రేమను అర్థం చేసుకుంటాడా? వీరి ప్రేమ ఏ తీరాన్ని చేరిందనేది ఆసక్తికరంగా మారింది.
'నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉన్నా', 'ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది' అన్న డైలాగ్స్ బాగున్నాయి. ఇక నక్సలైట్ల వల్ల ఏమన్న ఉపయోగం ఉందా? అని ఓ పోలీసు అడగ్గా.. 'మా ఊర్ల ఆడోళ్ల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ రాలేదు, మా అన్నలు వచ్చిర్రు' అని నక్సలైట్ల మంచితనాన్ని గురించి చెప్పాడు రాహుల్ రామకృష్ణ. ట్రైలర్ చూస్తుంటే వెండి తెరపై ఓ చిన్నపాటి యుద్ధమే చేయనున్నట్లు కనిపిస్తోంది. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. నవీన్ చంద్ర సీనియర్ ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటించారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.
చదవండి 👇
ఛీ, దరిద్రమంటూ నెటిజన్ ఓవరాక్షన్, కౌంటరిచ్చిన రానా
వర్జినా? అన్న ప్రశ్నకు సుశాంత్ ఏమని ఆన్సరిచ్చాడంటే?
Comments
Please login to add a commentAdd a comment