Virataparvam: Disruption Virataparvam Trailer Launch Event At Kurnool - Sakshi
Sakshi News home page

Virataparvam: విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అపశ్రుతి

Published Sun, Jun 5 2022 9:32 PM | Last Updated on Mon, Jun 6 2022 9:09 AM

Disruption In Virataparvam Trailer Launch Event - Sakshi

సాక్షి, కర్నూలు: విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అపశృతి చోటు చేసుకుంది. కర్నూలులో ఆదివారం సాయంత్రం డీఎస్‌ఏ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు ఎల్‌ఈడీ స్క్రీన్‌ కూలిపోయింది. దీంతో విరాట పర్వం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేదికకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. హీరోహీరోయిన్లు రానా, సాయిపల్లవి రాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది.

చదవండి: విరాటపర్వం ట్రైలర్‌: నీ రాతలో లేకపోవచ్చు, కానీ తలరాతలో నేనే ఉంటా
హోటల్‌కు తీసుకెళ్లి ముద్దులతో ముంచెత్తాడు, అప్పుడే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement