కొన్ని సార్లు కొందరి కథలు వింటే, మనం అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని అనుకుంటాం. అచ్చం అలాంటి కథనే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన శాంటాండర్ క్రిస్మస్ డే రోజున పొరపాటుగా అనుకోకుండా వేలాది మంది వ్యక్తుల ఖాతాలో 130 మిలియన్ల(సుమారు రూ.1000 కోట్లకు పైగా) యూరోలను జమ చేసింది. ఆ ఖాతాదారులు డబ్బులు వచ్చాయి అనే ఖాతాదారులు సంతోషించేలోపు తిరగి వెనక్కి శాంటాండర్ సంస్థ వెనక్కి తీసుకొంది. దీంతో ఆ ఖాతాదారులు అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని భాదపడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన శాంటాండర్ క్రిస్మస్ డే రోజున పొరపాటుగా అనుకోకుండా వేలాది మంది వ్యక్తుల ఖాతాలో £130 మిలియన్ల(సుమారు రూ.1000 కోట్లకు పైగా)ను జమ చేసింది. అలా జమ చేసిన నగదును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. డిసెంబర్ 25న శాంటాండర్ "సాంకేతిక సమస్య" కారణంగా 75000 మంది బ్యాంకు ఖాతాల్లో అనుకోకుండా డబ్బులు జమ అయినట్లు బ్యాంకు ప్రతినిధి తెలిపారు. ఈ డబ్బును నేరుగా బ్యాంకు తన స్వంత నిల్వల నుంచి జమ చేసింది.
(చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..!)
అయితే, ఈ డబ్బు పంపిన ఖాతాలు హెచ్‌ఎస్‌బిసి, నాట్ వెస్ట్ మొదలైన వివిధ ఇతర బ్యాంకులకు చెందినవీ. దీంతో ఈ బ్యాంకుల నుంచి రికవరీ చేయడం చాలా కష్టతరం చేసింది. ఈ బ్యాంకు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రహీతల్లో కొందరు ఇప్పటికే డబ్బును ఖర్చు చేశారని భయపడుతున్నారు. యుకెలో ప్రధాన చెల్లింపు వ్యవస్థలను నడుపుతున్న పే యుకె, ఈ సమస్య పట్ల శాంటాండర్‌తో చర్చిస్తోంది. బ్యాంకు ఈ మొత్తాన్ని తిరిగి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే, నేరుగా నగదు గ్రహీతలతో సంస్థ కమ్యూనికేట్ చేస్తోంది. "సాంకేతిక సమస్య కారణంగా మా కార్పొరేట్ ఖాతాదారుల నుంచి కొంత మొత్తం ఇతరుల ఖాతాలలో జమ చేసినందుకు క్షమించండి" అని బ్యాంకు ప్రతినిధి తెలిపారు.
శాంటాండర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో సాంకేతిక లోపం కారణంగా వినియోగదారులు దాదాపు ఒక రోజంతా చెల్లింపులు చేయకుండా నిరోధించడంతో బ్యాంకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆగస్టులో, వేలాది మంది వినియోగదారులు మరొక సమస్య కారణంగా వారి ఆన్ లైన్ ఖాతాలను యాక్సెస్ చేసుకోలేకపోయారు. శాంటాండర్ సంస్థ యుకెలో 14 మిలియన్ల మంది వినియోగదారులు కలిగి ఉండటంతో పాటు, దీనికి 400 భౌతిక శాఖలు ఉన్నాయి.
(చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కెవైసీ గడువు పొడిగించిన ఆర్‌బీఐ!)
Comments
Please login to add a commentAdd a comment