united king dom
-
రిషి సునాక్ స్థానంలో టోరీల సారథిగా బేడ్‌నాక్.. తొలి నల్లజాతి మహిళగా రికార్డు
లండన్: బ్రిటన్ విపక్ష నేతగా, కన్జర్వేటివ్ పార్టీ సారథిగా కేమీ బేడ్‌నాక్ ఎన్నికయ్యారు. నైజీరియా మూలాలున్న 44 ఏళ్ల కేమీ ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించారు. మూడు నెలల పాటు జరిగిన పార్టీపరమైన ఎన్నికల్లో మాజీ మంత్రి రాబర్ట్ జెన్రిక్ను బేడ్‌నాక్ ఓడించారు. ఆమెకు 53,806 ఓట్లు రాగానే జెన్నిక్కు 41,388 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో రాజీనామా చేసిన మాజీ ప్రధాని రిషి సునాక్ స్థానంలో ఆమె పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సునాక్‌కు బేడ్‌నాక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్థానంలో ఇంకెవరున్నా ఈ కష్టకాలంలో పార్టీ కోసం అంతగా కష్టపడేవారు కాదంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. సునాక్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పార్టీ సారథిగా గొప్పగా రాణిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధాని కియర్ స్టార్మర్ కూడా బేడ్నాక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక నల్లజాతి మహిళ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు స్వీకరించడాన్ని చరిత్రాత్మక పరిణామంగా అభివర్ణించారు. బేడ్‌నాక్ నార్త్‌వెస్ట్ ఎసెక్స్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
యూకే వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
బ్రిటన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇటీవల యూకేలో నెలకొన్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.‘యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’ అని పేర్కొంది. మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.Advisory for Indian Citizens visiting the UK.@VDoraiswami @sujitjoyghosh @MEAIndia pic.twitter.com/i2iwQ7E3Og— India in the UK (@HCI_London) August 6, 2024కాగా వలస వ్యతిరేక గ్రూప్‌లు బ్రిటన్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చేపట్టాయి. ఇవి దేశమంతా విస్తరించిన క్రమంలో హింసాత్మకంగా మారాయి. గతవారం ఓ డ్యాన్స్ క్లాస్‌లో చిన్నారులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఈ ఘటన మెల్లమెల్లగా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చి విసరడం, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్స్‌పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కీర్ స్మార్టర్ అధికారులను ఆదేశించారు. -
15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్ ఇదే!
తల్లి అయ్యే వయసులో అమ్మమ్మగా మారిన ఓ మహిళ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె హృదయం ఇప్పుడు మరొకరిని కోరుకుంటోంది. ఆమె ఆ దేశంలో అతి పిన్న వయస్కురాలైన అమ్మమ్మ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఆ మహిళ తన 34 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికూతురుగా ముస్తాబవుతోంది. రేచెల్ మెక్‌ఇంటైర్ అనే మహిళ యునైటెడ్ కింగ్డమ్లో ఉంటోంది. మీడియా కథనాల ప్రకారం ఆమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన అమ్మమ్మ. కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు రేచెల్ వయసు కేవలం 15 సంవత్సరాలు. పెరిగి పెద్దయిన ఆ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె కూడా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఫలితంగా రేచెల్ తన 33 సంవత్సరాల వయసులో అమ్మమ్మగా మారింది. రేచెల్ జీవిత చిత్రం ఎంతో ఆసక్తికరం. ఈ అమ్మమ్మ ఇప్పుడు మరోమారు పెళ్లికూతురు అవుతోంది. మూరత్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు రేచెల్ తన కుమార్తెకు చెప్పింది. వీరి ప్రేమకు కుమార్తె కూడా మద్దతు పలికింది. కొంతకాలం క్రితం ఆమె మూరత్తో తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ‘మూరత్ ప్రవర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి నా కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్ సంబరపడుతూ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ఎన్నికలతో భారత్, పాక్, చైనాలకు లింకేమిటి? -
యూకేలో మొట్టమొదటిసారిగా అష్టావధానం
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK)లో మొట్టమొదటిసారిగా అష్టావధానం నిర్వహించారు. ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచేతుల మీదుగా జులై 9న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరం ఈ కార్యక్రమానికి వేదికయ్యింది. వందలాది మంది తెలుగు ఎన్నారైలు ఈ వేడుకను తిలకించారు.స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకుడు కుమార్ అనీష్ కందాడ ప్రార్థనా గీతం ఆలపించగా, పల్లవి మంగళంపల్లి తన మధురమైన గాత్రంతో అలరించింది. కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్‌ను పట్టుశాలువా, పూల మాలలు, సన్మాన పత్రంతో సత్కరించారు. -
అయ్యో! అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయిందే
కొన్ని సార్లు కొందరి కథలు వింటే, మనం అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని అనుకుంటాం. అచ్చం అలాంటి కథనే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన శాంటాండర్ క్రిస్మస్ డే రోజున పొరపాటుగా అనుకోకుండా వేలాది మంది వ్యక్తుల ఖాతాలో 130 మిలియన్ల(సుమారు రూ.1000 కోట్లకు పైగా) యూరోలను జమ చేసింది. ఆ ఖాతాదారులు డబ్బులు వచ్చాయి అనే ఖాతాదారులు సంతోషించేలోపు తిరగి వెనక్కి శాంటాండర్ సంస్థ వెనక్కి తీసుకొంది. దీంతో ఆ ఖాతాదారులు అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని భాదపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన శాంటాండర్ క్రిస్మస్ డే రోజున పొరపాటుగా అనుకోకుండా వేలాది మంది వ్యక్తుల ఖాతాలో £130 మిలియన్ల(సుమారు రూ.1000 కోట్లకు పైగా)ను జమ చేసింది. అలా జమ చేసిన నగదును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. డిసెంబర్ 25న శాంటాండర్ "సాంకేతిక సమస్య" కారణంగా 75000 మంది బ్యాంకు ఖాతాల్లో అనుకోకుండా డబ్బులు జమ అయినట్లు బ్యాంకు ప్రతినిధి తెలిపారు. ఈ డబ్బును నేరుగా బ్యాంకు తన స్వంత నిల్వల నుంచి జమ చేసింది. (చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..!) అయితే, ఈ డబ్బు పంపిన ఖాతాలు హెచ్ఎస్బిసి, నాట్ వెస్ట్ మొదలైన వివిధ ఇతర బ్యాంకులకు చెందినవీ. దీంతో ఈ బ్యాంకుల నుంచి రికవరీ చేయడం చాలా కష్టతరం చేసింది. ఈ బ్యాంకు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రహీతల్లో కొందరు ఇప్పటికే డబ్బును ఖర్చు చేశారని భయపడుతున్నారు. యుకెలో ప్రధాన చెల్లింపు వ్యవస్థలను నడుపుతున్న పే యుకె, ఈ సమస్య పట్ల శాంటాండర్తో చర్చిస్తోంది. బ్యాంకు ఈ మొత్తాన్ని తిరిగి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే, నేరుగా నగదు గ్రహీతలతో సంస్థ కమ్యూనికేట్ చేస్తోంది. "సాంకేతిక సమస్య కారణంగా మా కార్పొరేట్ ఖాతాదారుల నుంచి కొంత మొత్తం ఇతరుల ఖాతాలలో జమ చేసినందుకు క్షమించండి" అని బ్యాంకు ప్రతినిధి తెలిపారు. శాంటాండర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో సాంకేతిక లోపం కారణంగా వినియోగదారులు దాదాపు ఒక రోజంతా చెల్లింపులు చేయకుండా నిరోధించడంతో బ్యాంకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆగస్టులో, వేలాది మంది వినియోగదారులు మరొక సమస్య కారణంగా వారి ఆన్ లైన్ ఖాతాలను యాక్సెస్ చేసుకోలేకపోయారు. శాంటాండర్ సంస్థ యుకెలో 14 మిలియన్ల మంది వినియోగదారులు కలిగి ఉండటంతో పాటు, దీనికి 400 భౌతిక శాఖలు ఉన్నాయి. (చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కెవైసీ గడువు పొడిగించిన ఆర్బీఐ!) -
కరోనా: యూకే మరో కీలక నిర్ణయం
లండన్ : భారత్ సహా ప్రపంచంలోనే ఏ దేశం నుంచి వచ్చే వారికైనా కోవిడ్–19 నెగెటివ్ ధ్రువీకరణ తప్పనిసరి అని యూకే ప్రభుత్వం తెలిపింది. యూకేలోకి రావడానికి 72 గంటల ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలని స్పష్టం చేసింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను అరికట్టేందుకు యూకే ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన ముందు జాగ్రత్తల్లో ఇది కూడా ఒకటి. కొత్త నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే తక్షణమే 500 పౌండ్ల జరిమానా విధిస్తామని ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇతర దేశాల నుంచి పడవ, రైలు, విమానాల ద్వారా వచ్చే ప్రయాణీకులెవరైనా 72 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోలేదని తేలితే దేశంలోకి అడుగుపెట్టనీయబోమని కూడా హెచ్చరించింది. హై రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి 10 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ తప్పనిసరి అని యూకే రవాణా శాఖ పేర్కొంది. వీరు లొకేటర్ ఫారం కూడా పూర్తి చేయాలని తెలిపింది. బుధవారం నుంచి అమలవుతున్న లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో మరీ అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. అలాగే, యూకే నుంచి భారత్ సహా ఇతర దేశాలకు వెళ్లే వారు కూడా 72 గంటలు ముందు కోవిడ్ నెగెటివ్ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఇవే ఆంక్షలను అమలు చేయనున్నట్లు స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ కూడా ప్రకటించాయి. శుక్రవారం యూకేలో 68,053 కొత్త కేసులు బయటపడ్డాయి. ఒకే రోజులో అత్యధికంగా 1,325 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,57,472కు చేరుకుంది. మరణాల సంఖ్య 79,833 కు చేరుకుంది. గురువారం నాటికి దేశంలో 15 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కొత్త వేరియంట్ కేసుతో ఆస్ట్రేలియా అప్రమత్తం మెల్బోర్న్: యూకే కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసు ఒకటి బ్రిస్బేన్‌లో నిర్థారణ కావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోనే మూడో అతిపెద్దదైన ఆ నగరంలో మూడు రోజుల లాక్డౌన్ విధించింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రయాణ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ శుక్రవారం తెలిపారు. కరోనా క్వారంటైన్ సెంటర్‌గా మారిన బ్రిస్బేన్‌లోని హోటల్లోని సిబ్బంది ఒకరికి యూకే వైరస్ వేరియంట్ సోకినట్లు నిర్థారణయింది. దీంతో స్థానిక క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 వరకు లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్లో కోవిడ్ మరణాలు 2 లక్షలు పైనే.. సావోపౌలో: బ్రెజిల్లో కోవిడ్–19 ఒక వైపు తీవ్రం గా విజృంభిస్తుండగా కొత్త ఏడాది సందర్భంగా ప్రజలు సంబరాలు ముమ్మరం చేశారు. ఫలితంగా గడిచిన 24 గంటల్లో మరో 1,524 మంది కోవిడ్‌తో మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,00,498కు చేరుకుందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన రెండో దేశం బ్రెజిల్ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. చాలా దేశాలు కరోనా వ్యాప్తి చెందకుండా ఆంక్షలు అమలు చేస్తుండగా డిసెంబర్ 21నుంచి మొదలైన వేసవిని పురస్కరించుకుని బొల్సనారో ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. పార్టీలు, వినోద కార్యక్రమాలు పెరిగి వైరస్ వ్యాప్తి కూడా తీవ్రతరమైంది. అధ్యక్షుడు బొల్సనారో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా, మాస్క్లేకుండానే బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని విమర్శల పాలయ్యారు. కొత్త స్ట్రైయిన్ కేసులు 82 న్యూఢిల్లీ: యూకే వేరియంట్ కరోనా వైరస్ కేసులు దేశంలో ఇప్పటి వరకు 82 వరకు వెలుగులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. బాధితులందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాయని తెలిపింది. వారి దగ్గరి సంబంధీకులను కూడా క్వారంటైన్లో ఉంచామని పేర్కొంది. బాధితుల తోటి ప్రయాణీకులను, కుటుంబసభ్యులను, సన్నిహితంగా మెలిగిన వారిని కూడా గుర్తించి, పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వివరించింది. ఆ ఫ్లైట్లు షురూ.. న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్(యూకే)–భారత్ మధ్య ప్రయాణికుల విమానాల రాకపోకలు శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడిన నేపథ్యంలో గత 16 రోజులుగా ఇరు దేశాల మధ్య ప్యాసింజర్ విమానాల రాకపోకలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ112 విమానం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు లండన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అలాగే విస్టారా విమానం శనివారం లండన్ నుంచి ఢిల్లీకి రానుంది. బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా విమానాలు ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నాయి. జనవరి 8 నుంచి 23వ తేదీ వరకు యూకే–ఇండియా మధ్య కేవలం 30 విమానాలే రాకపోకలు సాగిస్తాయని విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ ప్రకటించారు. ఇందులో యూకే విమానాలు 15, ఇండియా విమనాలు 15 ఉంటాయన్నారు. యూకే నుంచి భారత్‌కు విమానంలో ప్రయాణం చేసేవారు మూడు రోజుల ముందే కరోనా పరీక్ష చేయించుకోవాలని, నెగటివ్‌గా నిర్ధారణ అయితేనే ప్రయాణం కొనసాగించాలని, లేకపోతే విరమించుకోవాలని పేర్కొన్నారు. మూడో వ్యాక్సిన్‌కూ అనుమతి లండన్: కరోనాను ఎదుర్కోవడానికి ఏకంగా మూడో వ్యాక్సిన్‌కు కూడా యూకే అనుమతులు ఇచ్చింది. మోడెర్నా కంపెనీ తయారు చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్‌ను తమ దేశ సైంటిస్టులు పూర్తిగా పరిశీలించిన అనంతరం అనుమతులు ఇస్తున్నట్లు శుక్రవారం ఆ దేశ రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల కోసం పని చేయడమే తమ లక్ష్యమని రెగ్యులేటరీ అధికారి డాక్టర్ జూన్ రైజ్ అన్నారు. ఇప్పటికే 7 మిలియన్ల డోస్‌లకు ప్రీ ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే ఆయా డోసులు దేశానికి చేరుకోవడానికి మరొకొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. యూకే ఇప్పటికే ఆక్సఫర్డ్, ఫైజర్ టీకాలను ప్రజలకు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అనుమతుల ప్రకటనతో ఆ దేశంలో ఇవ్వనున్న మొత్తం టీకాల సంఖ్యమూడుకు చేరనుంది. ఫైజర్‌కు –75డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం కాగా, మోడెర్నాకు కేవలం –25డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత సరిపోతుంది. దీంతో రవాణా సులభతరం కానుందని అధికారులు భావిస్తున్నారు. -
డేవిస్‌కప్ కమిట్మెంట్ అవార్డు విజేత?
ప్రాక్టీస్ బిట్స్ 1. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ఏ ప్రాంతం సెప్టెంబర్ 18న స్వాతంత్య్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది? ఎ) వేల్స్ బి) ఉత్తర ఐర్లాండ్ సి) స్కాట్లాండ్ డి) ఇంగ్లండ్ 2. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-1 క్షిపణిని 2014, సెప్టెంబర్ 11న పరీక్షించారు. దీని పరిధి ఎంత? ఎ) 350 కిలోమీటర్లు బి) 700 కిలోమీటర్లు సి) 500 కిలోమీటర్లు డి) 1500 కిలోమీటర్లు 3. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డేవిస్ కప్ కమిట్మెంట్ అవార్డును ఏ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడికి అందజేసింది? ఎ) యూకీ బాంబ్రీ బి) సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సి) రోహన్ బోపన్న డి) మహేశ్ భూపతి 4. బ్లూమ్‌బర్గ్ మార్కెట్స్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మహిళ? ఎ) నైనాలాల్ కిద్వాయ్ బి) చందా కొచ్చర్ సి) శిఖా వర్మ డి) అరుంధతీ భట్టాచార్య 5. 2014 సెప్టెంబర్‌లో అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో కొత్తగా నిర్మించిన భారత రాయబార కార్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు? ఎ) అరుణ్‌జైట్లీ బి) సుష్మాస్వరాజ్ సి) హమీద్ అన్సారీ డి) నరేంద్ర మోడీ 6. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి ఆసియా దేశం ఏది? ఎ) చైనా బి) ఇండోనేషియా సి) మలేషియా డి) జపాన్ 7. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెబ్సైట్ ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? ఎ) బ్రయాన్ లారా బి) షేన్ వార్న్ సి) జాక్వస్ కల్లిస్ డి) సచిన్ టెండూల్కర్ 8. మహిళల భద్రతకు ఉపయోగపడే రక్ష అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన రాజకీయ పార్టీ ఏది? ఎ) కాంగ్రెస్ బి) భారతీయ జనతా పార్టీ సి) ఆమ్ ఆద్మీ పార్టీ డి) తృణమూల్ కాంగ్రెస్ 9. నూరుశాతం ఈ-అక్షరాస్యతను సాధించిన తొలి గ్రామ పంచాయతీగా ఘనత సాధించిన పల్లిచల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) తమిళనాడు బి) కర్ణాటక సి) కేరళ డి) పశ్చిమెంగాల్ 10. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎ) సెప్టెంబర్ 5 బి) సెప్టెంబర్ 6 సి) సెప్టెంబర్ 9 డి) సెప్టెంబర్ 8 11. ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో రూపొందించిన ప్రపంచ అత్యంత ప్రశంసనీయ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ? ఎ) యాపిల్ బి) అమెజాన్ సి) గూగుల్ డి) బెర్క్‌షైర్ హతవే 12. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనల ప్రకారం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు కంపెనీలు మూడేళ్ల సగటు వార్షిక లాభాల ఆధారంగా ఆర్థిక సంవత్సరం లాభాల్లో కనీసం ఎంత శాతాన్ని ఖర్చు చేయాలి? ఎ) 1 శాతం బి) 2 శాతం సి) 3 శాతం డి) 4 శాతం 13. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు? ఎ) మార్చి 1 బి) మార్చి 3 సి) మార్చి 5 డి) మార్చి 2 14. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్రేమ్ స్మిత్ ఏ దేశానికి 108 టెస్ట్‌ల్లో నాయకత్వం వహించాడు? ఎ) వెస్టిండీస్ బి) న్యూజిలాండ్ సి) ఇంగ్లండ్ డి) దక్షిణాఫ్రికా 15. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచ బిలియనీర్ల జాబితా-2014లో ముకేశ్ అంబానీ స్థానం? ఎ) 32 బి) 35 సి) 40 డి) 22 16. 16వ లోక్‌సభకు ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయి? ఎ) 7 బి) 8 సి) 9 డి) 10 17. భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఏ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రచారకర్తగా ఎంపికయ్యారు? ఎ) మహారాష్ట్ర బి) గుజరాత్ సి) హర్యానా డి) ఉత్తరాఖండ్ 18. దేశంలోని మొదటి మైనారిటీ సైబర్ గ్రామాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఎ) రాజస్థాన్ బి) ఉత్తరప్రదేశ్ సి) మహారాష్ట్ర డి) పశ్చిమబెంగాల్ 19. ‘‘అంబేద్కర్: అవేకనింగ్ ఇండియాస్ సోషల్ కాన్షన్స్’’ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఎ) విజయ్ దర్దా బి) నరేంద్ర జాదవ్ సి) అరుంధతీ రాయ్ డి) వి.కె.మల్హోత్రా 20. ఆర్సెనీయ్ యాట్సెన్యుక్ ఏ దేశానికి ప్రధాని? ఎ) రష్యా బి) కజక్‌స్థాన్ సి) ఉక్రెయిన్ డి) బెలారస్ 21. బోర్ వైల్డ్‌లైఫ్ శ్యాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) మహారాష్ట్ర బి) అస్సాం సి) కర్ణాటక డి) త్రిపుర 22. మైనారిటీల కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఎ) జస్టిస్ సచార్ కమిటీ బి) జస్టిస్ రంగనాథ్‌మిశ్రా కమిటీ సి) జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డి) జస్టిస్ ముద్గల్ కమిటీ 23. కామరాజర్ పోర్ట్ అని ఏ నౌకా కేంద్రాన్ని పిలుస్తారు? ఎ) ట్యుటికోరన్ బి) ఎన్నోర్ సి) కొచ్చిన్ డి) మంగళూరు 24. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? ఎ) పీటర్ స్కాట్ బి) జూలియన్ హక్స్లీ సి) మార్కో లాంబర్టిని డి) మ్యాక్స్ నికోల్సన్ 25. ‘బిగ్ యాపిల్’ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఎ) వార్సా బి) మాడ్రిడ్ సి) బార్సిలోనా డి) న్యూయార్క్ 26. ఈ-మెయిల్‌ను ఎవరు కనుగొన్నారు? ఎ) సబీర్ భాటియా బి) బిల్‌గేట్స్ సి) రే టామ్లిన్సన్ డి) లారీ పేజ్ 27. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య? ఎ) 212 బి) 206 సి) 222 డి) 215 28. విటమిన్ బి లోపం వల్ల ఏ వ్యాధి సంక్రమిస్తుంది? ఎ) రికెట్స్ బి) రేచీకటి సి) బెరిబెరి డి) ఆస్టియో మలేసియాత 29. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? ఎ) 1975 బి) 1980 సి) 1985 డి) 1982 30. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరి స్థానంలో నియమితులయ్యారు? ఎ) బిల్‌గేట్స్ బి) స్టీవ్ బామర్ సి) స్టీవ్ జాబ్స్ డి) పాల్ అలెన్ 31. ఫిబ్రవరి 4ను ఏ దినంగా పాటిస్తారు? ఎ) ప్రపంచ క్షయ దినం బి) ప్రపంచ ఎయిడ్స్ దినం సి) ప్రపంచ కేన్సర్ దినం డి) ప్రపంచ మలేరియా దినం 32. 2014 ఆస్కార్ అవార్డుల్లో పది విభాగాల్లో నామినేషన్ పొందిన ఏ చిత్రానికి ఒక్క అవార్డూ రాలేదు? ఎ) గ్రావిటీ బి) అమెరికన్ హజిల్ సి) ఫాస్ట్ అండ్ ప్యూరియస్ డి) హీలియం 33. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2014లో అగ్రస్థానంలో ఉన్నది? ఎ) బిల్ గేట్స్ బి) కార్లోస్ సిమ్ సి) అమాన్సియా ఒర్టేగా డి) వారెన్ బఫెట్ 34. ఏ ప్రముఖ క్రికెటర్ విగ్రహాన్ని ఆంటిగ్వా రాజధాని సెయింట్ జాన్స్‌లో ఆవిష్కరించారు? ఎ) బ్రయాన్ లారా బి) సర్ గార్ఫీల్డ్ సోబర్స్ సి) క్లైవ్ లాయిడ్ డి) సర్ వివియన్ రిచర్డ్స్ 35. 2014 దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఎ) రోజర్ ఫెదరర్ బి) థామస్ బెర్టిచ్ సి) రఫెల్ నాదల్ డి) కీ నిషికోరి సమాధానాలు: 1) సి; 2) బి; 3) సి; 4) డి; 5) బి; 6) ఎ; 7) డి; 8) బి; 9) సి; 10) డి; 11) ఎ; 12) బి; 13) ఎ; 14) డి; 15) సి; 16) సి; 17) బి; 18) ఎ; 19) బి; 20) సి; 21) ఎ; 22) ఎ; 23) బి; 24) సి; 25) డి; 26) సి; 27) బి; 28) సి; 29) డి; 30) బి; 31) సి; 32) బి; 33) ఎ; 34) డి; 35) ఎ.