తల్లి అయ్యే వయసులో అమ్మమ్మగా మారిన ఓ మహిళ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె హృదయం ఇప్పుడు మరొకరిని కోరుకుంటోంది. ఆమె ఆ దేశంలో అతి పిన్న వయస్కురాలైన అమ్మమ్మ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఆ మహిళ తన 34 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికూతురుగా ముస్తాబవుతోంది.
రేచెల్ మెక్‌ఇంటైర్ అనే మహిళ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉంటోంది. మీడియా కథనాల ప్రకారం ఆమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన అమ్మమ్మ. కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు రేచెల్ వయసు కేవలం 15 సంవత్సరాలు. పెరిగి పెద్దయిన ఆ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె కూడా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఫలితంగా రేచెల్ తన 33 సంవత్సరాల వయసులో అమ్మమ్మగా మారింది. రేచెల్ జీవిత చిత్రం ఎంతో ఆసక్తికరం. ఈ అమ్మమ్మ ఇప్పుడు మరోమారు పెళ్లికూతురు అవుతోంది.
మూరత్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు రేచెల్ తన కుమార్తెకు చెప్పింది. వీరి ప్రేమకు కుమార్తె కూడా మద్దతు పలికింది. కొంతకాలం క్రితం ఆమె మూరత్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ‘మూరత్ ప్రవర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి నా కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్ సంబరపడుతూ మీడియాకు తెలిపింది.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ఎన్నికలతో భారత్, పాక్, చైనాలకు లింకేమిటి?
Comments
Please login to add a commentAdd a comment