
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK)లో మొట్టమొదటిసారిగా అష్టావధానం నిర్వహించారు. ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచేతుల మీదుగా జులై 9న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరం ఈ కార్యక్రమానికి వేదికయ్యింది. వందలాది మంది తెలుగు ఎన్నారైలు ఈ వేడుకను తిలకించారు.స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గాయకుడు కుమార్ అనీష్ కందాడ ప్రార్థనా గీతం ఆలపించగా, పల్లవి మంగళంపల్లి తన మధురమైన గాత్రంతో అలరించింది. కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్‌ను పట్టుశాలువా, పూల మాలలు, సన్మాన పత్రంతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment