HSBC-Russia: ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికా మొదలు అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యాతో లావాదేవీలు నిలిపేయాలంటూ పెద్ద బ్యాంకులు సైతం తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాయి.
ఇంగ్లండ్‌కి చెందిన హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు రష్యాకి చెందిన పెద్ద బ్యాంకయిన వీటీబీతో లావాదేవీలు నిలిపేయాలని కోరింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఉద్యోగులకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుగుణంగా హెచ్‌స్‌బీసీ ఈ నిర్ణయం ప్రకటించింది. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు దారిలోనే మరిన్ని ఆర్థిక సంస్థలు త్వరలో తమ నిర్ణయాలు ప్రకటించనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment