ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమయంలో చేసిన ఓ ప్రకటన దిగ్గజ కంపెనీ కొంప ముంచింది. ఫలితంగా వందల కోట్ల కంపెనీని ఒక యూరో (రూ.89.33)కే అమ్మింది. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.
డచ్ బ్రూవరీ సంస్థ హైనకెన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఆ దేశం నుంచి హైనకెన్ వైదొలగాలని భావించింది. ఇందుకోసం కేవలం ఒక యూరోకి తన సంస్థను రష్యా కంపెనీ ఆర్నెస్ట్‌కు విక్రయించింది. ఈ సందర్భంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బ్రూవరీగా పేరు ప్రఖ్యాతలున్న హైనకెన్ 300 మిలియన్ల యూరోల (324.8 మిలియన్ డాలర్ల) నష్టానికే ఆర్నెస్ట్‌కు అమ్మినట్లు తెలిపింది.
అయితే, సంస్థను అతి తక్కువ ధరకే అమ్మడానికి హైనకెన్ మార్చి 2022లో చేసిన ప్రకటనే అని తెలుస్తోంది. యుద్ధం కారణంగా రష్యాలో తమ కార్యకలాపాలు నిలిపిస్తున్నట్లు ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది. కానీ, నెలలు గడుస్తున్నా రష్యాను విడిచి పెట్టకపోవడంపై విమర్శలు, వరుస నష్టాల్ని చవి చూసింది. ఈ క్రమంలో, సుధీర్ఘ కాలం తర్వాత రష్యా నుంచి హైనకెన్ ఎట్టకేలకు వైదొలగింది. రష్యాలో తన సంస్థను వందల కోట్ల నష్టానికే అమ్మింది. మిగిలిన ఏడు బ్రూవరీస్‌ను ఆస్తుల్ని సైతం ఆర్నెస్ట్‌కు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment