Heineken
-
ఒక యూరోకే దిగ్గజ కంపెనీ అమ్మకం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమయంలో చేసిన ఓ ప్రకటన దిగ్గజ కంపెనీ కొంప ముంచింది. ఫలితంగా వందల కోట్ల కంపెనీని ఒక యూరో (రూ.89.33)కే అమ్మింది. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. డచ్ బ్రూవరీ సంస్థ హైనకెన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఆ దేశం నుంచి హైనకెన్ వైదొలగాలని భావించింది. ఇందుకోసం కేవలం ఒక యూరోకి తన సంస్థను రష్యా కంపెనీ ఆర్నెస్ట్కు విక్రయించింది. ఈ సందర్భంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బ్రూవరీగా పేరు ప్రఖ్యాతలున్న హైనకెన్ 300 మిలియన్ల యూరోల (324.8 మిలియన్ డాలర్ల) నష్టానికే ఆర్నెస్ట్కు అమ్మినట్లు తెలిపింది. అయితే, సంస్థను అతి తక్కువ ధరకే అమ్మడానికి హైనకెన్ మార్చి 2022లో చేసిన ప్రకటనే అని తెలుస్తోంది. యుద్ధం కారణంగా రష్యాలో తమ కార్యకలాపాలు నిలిపిస్తున్నట్లు ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది. కానీ, నెలలు గడుస్తున్నా రష్యాను విడిచి పెట్టకపోవడంపై విమర్శలు, వరుస నష్టాల్ని చవి చూసింది. ఈ క్రమంలో, సుధీర్ఘ కాలం తర్వాత రష్యా నుంచి హైనకెన్ ఎట్టకేలకు వైదొలగింది. రష్యాలో తన సంస్థను వందల కోట్ల నష్టానికే అమ్మింది. మిగిలిన ఏడు బ్రూవరీస్‌ను ఆస్తుల్ని సైతం ఆర్నెస్ట్కు అప్పగించింది. -
మాల్యాకు మరోషాక్, యూబీఎల్ నుంచి ఔట్?
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. యూబీఎల్(యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్) కంపెనీ నుంచి మాల్యాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. యూబీఎల్ కంపెనీలోఇటీవల తన వాటాను భారీగా పెంచుకున్న డచ్ బ్రూవర్ హైనెకెన్, యూబీఎల్ చైర్మన్‌గా మాల్యాను తొలగించేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు కంపెనీ నిబంధనలను మార్చడానికి కూడా ప్రయత్నిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుండి యూబీఎల్‌లో మాల్యా షేర్లను హైనెకెన్ కొనుగోలు చేసింది. తద్వారా తన వాటాను 46.5 శాతం నుంచి 61.5 శాతానికి పెంచుకుంది. ఇపుడిక మాల్యాకు ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు రానున్న ఏజీఎంలో హైనెకెన్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఒఏ) మార్చడానికి వాటాదారుల అనుమతి కోరుతోంది. జూలై 29 న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో హీనెకెన్ అనుమతి పొందవలసి ఉంది. ఎందుకంటే యూబీఎల్‌కు లైఫ్ టైం ఛైర్మన్‌గా ఉన్న మాల్యాకు మాత్రమే తదుపరి ఛైర్మన్‌ను నామినేట్ చేసే అధికారం ఉంది. అయితే ప్రతిపాదిక ఏజీఎం కంటే ముందే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు మాల్యా అంగీకరిస్తే, ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవచ్చని దిఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. సంస్థలో హైనెకెన్ మెజారిటీ వాటాదారే అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఏఓఏ మార్పుకు 75 శాతం వాటా తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతో ఈ వ్యవహారంలో పలు ఆర్థికసంస్థలతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. కాగా 2008లో హైనెకెన్ కొనుగోలుకు మాల్యా చేసుకున్న ఒప్పందం ఇంకా మార్చలేదు. అయితే లిస్టెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉండకూడదంటూ సెబీ అనర్హత వేటు వేయడంతో 2017లో యుబీఎల్ బోర్డు నుండి మాల్యా వైదొలగాల్సి వచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలకింద లండన్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్న మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
మాల్యా వాటాలను హీనెకెన్ కొనేస్తోందా?
న్యూఢిల్లీ: లిక్కర్‌కింగ్, రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. బీరు తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమెటెడ్ లో విజయ్ మాల్యాకుచెందిన మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు డచ్ బ్రూవర్ హైనెకెన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యునైటెడ్ బ్రూవరీస్లో విజయ్ మాల్య వాటాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతొ రుణదాతలతో హీన్కెన్ సంప్రదించినట్టు సమాచారం. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మాల్యానుంచి రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు విశ్వ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇది కీలక పరిణామమని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. హీనెకెన్ నిర్ణయం చాలా ముఖ్యమైనది, ఇది బ్యాంకులపై ఒత్తిడిని రేకెత్తిస్తుందని వ్యాఖ్యానించింది. హీనెకెన్, విజయ్ మాల్యా యూబిఎల్ కంపెనీలో ఉమ్మడి యజమానులుగా ఉన్నారు. మాల్యాకు 30శాతం వాటా వుండగా, హెన్‌కెన్ 43.4 శాతం వాటాకలిగి ఉంది. దీంతో మార్కెట్లో యూబీఎల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. దాదాపు 6.23 శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు ఈ వార్తలతో స్టాక్ ఎక్సేంజ్ లు హెన్‌కెన్ సంస్థను వివరణ కోరింది. కాగా గత ఏడాది మార్చిలో ఇండియా నుంచి పారిపోయని మాల్యాను గత నెల ఏప్రిల్ 18న లండన్ లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు అటు ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా భారత ఈడీ, సీఐడి అధికారులు ప్రత్యేక బృందం ఇప్పటికే లండన్ చేరుకుంది. అక్కడి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.