
ఈ ఏడాది చివరికి సెన్సెక్స్ 30,500 పాయింట్లకు..
హెచ్‌ఎస్‌బీసీ
ముంబై: కేంద్ర ఆర్థిక సంస్కరణలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌స్టీ పన్ను విధానం వల్ల ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 30,500 పాయింట్లకు చేరవచ్చని అంతర్జాతీయ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ అంచనావేసింది. భారీగా ప్రభుత్వ పెట్టుబడులు, సబ్సిడీలు నేరుగా బదిలీ చేయడం వంటివి కూడా ఈ పెరుగుదలకు సహయపడతాయని సంస్థ సీఐఓ తుషార్ ప్రధాన్ చెప్పారు. తెలిపారు. పన్ను విధానాల్లో సంస్కరణలు సవాళ్లను స్వీకరించి వ్యాపార కార్యకలపాలకు సహాయకరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని
ప్రస్తుతం సెన్సెక్స్ 26 వేల నుంచి 27 వేల పాయింట్ల మధ్య కొనసాగుతోంది.
బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 240.85 పాయింట్లు పెరిగి 27,140.41 పాయింట్ల వద్ద ముగిసింది. నోట్ల రద్దు స్వల్పకాలం మాత్రమే వుంటుందని, జీఎస్‌స్టీ అమలు వల్ల స్టాక్‌మార్కెట్ వృద్ధి ధీర్ఘ కాలం కొనసాగవచ్చని ప్రధాన్ చెప్పారు. నోట్ల రద్దు వల్ల రాబోయేకాలంలో ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రతికూలాంశాలు ఎదురుకావచ్చని, జీడీపీలో 61 శాతంగా ఉన్న సేవా రంగం కొంతమేర ఆదాయాన్ని నష్టపోయే అవకాశం ఉందన్నారు. దీని వల్ల 60 శాతం కుటుంబాల మీద భారం పడోచ్చని తెలిపారు. జీఎస్‌స్టీని విజయవంతంగా అమలు చేసినట్లయితే ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుందన్నారు. ద్రవ్యలోటు కూడా సరైన మార్గంలోనే ఉందని ఆయన అన్నారు.