భారత్ వృద్ధి పటిష్టం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: సమీప కాలానికి భారత్ వృద్ధి తీరు మెరుగుపడుతోందని బ్యాంకింగ్ సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. వస్తు సేవల పన్ను బిల్లు ఈ ఏడాది చివర్లో ఆమోదం పొందే వీలుందని, ఆ తర్వాత వృద్ధికి సంబంధించిన అంశాలు మరింత పటిష్టమయ్యే వీలుందని అంచనావేసింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన దివాలాబిల్లుసహా ఆధార్ బిల్లు, మానిటరీ పాలసీ కమిటీ బిల్లు, జీఎస్‌టీ బిల్లు వృద్ధి బాటలో కీలకమని విశ్లేషించింది. బీజేపీకి ప్రజాదరణ తగ్గలేదని తాజా ఎన్నికలు పేర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వానికి కీలక బిల్లుల విషయంలో పెద్దల సభలో ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనావేసింది.