లాభాల్లో దూసుకెళ్లిన హెచ్ యూఎల్
ముంబై : దేశ అతిపెద్ద వినియోగ వస్తువుల సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్ యూఎల్) లాభాల్లో దూసుకెళ్లింది. గడిచిన ఆర్థికసంవత్సర నాలుగో త్రైమాసిక పలితాల్లో హెచ్ యూఎల్ లాభాలు 7శాతం జంప్ అయ్యాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి,నికర లాభాలను రూ.1,090 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.1,018 కోట్లగా ఉన్నాయి.
స్కిన్ కేర్, హెయిర్ కేర్, నిల్వవుంచే ఆహార ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో కంపెనీ లాభాలు పెరిగినట్టు హెచ్ యూఎల్ వెల్లడించింది. ఈ లాభాలతో కంపెనీ ఆదాయం 3.5శాతం వృద్ధితో రూ.7,675 కోట్ల నుంచి రూ.7,946 కోట్లకు ఎగబాకింది. అయితే ఈ త్రైమాసికంలో వాల్యుమ్ పెరుగుదల కొంత నిరాశపరిచింది. గతేడాది 6శాతంగా ఉన్న వాల్యుమ్ వృద్ధి ఈ ఏడాది 4 శాతం మాత్రమే నమోదుచేశాయి.