లాభం రూ. 2,561 కోట్లు
రూ. 24 తుది డివిడెండ్
న్యూఢిల్లీ: నాలుగో త్రైమాసికంలో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం స్వల్పంగా తగ్గి (1.53%) రూ. 2,561 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఆదాయం రూ. 15,375 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 15,441 కోట్ల కు పెరిగింది. వ్యయా లు రూ. 11,962 కోట్ల నుంచి రూ. 12,100 కోట్లకు చేరా యి.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 61,092 కోట్ల నుంచి రూ. 62,707 కోట్లకు చేరింది. లాభం రూ. 10,143 కోట్లుగా నమోదైంది. బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు.. రూ.1 ముఖ విలువ చేసే షేరు ఒక్కింటికి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. తాత్కాలిక డివిడెండ్ రూ. 18 కూడా కలిపితే పూర్తి సంవత్సరానికి మొత్తం మీద ఒక్కో షేరుకి రూ. 42 డివిడెండ్ ఇచి్చనట్లవుతుందని సంస్థ తెలిపింది.
బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 2,259.15 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment