న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ఆదాయపన్ను శాఖ నుంచి రూ.963 కోట్లకు పన్ను నోటీసు అందుకుంది. అయితే దీనిపై చట్టప్రకారం అప్పీల్‌కు వెళ్లనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
హెచ్‌యూఎల్ లోగడ గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ నుంచి హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, వివా బ్రాండ్లను, వాటికి సంబంధించి మేధో సంపత్తి హక్కులను కొనుగోలు చేసింది. ఇందుకు రూ.3,045 కోట్లు చెల్లించింది. దీనిపై టీడీఎస్ వసూలు చేయలేదు. దీంతో రూ.329 కోట్ల వడ్డీ సహా మొత్తం రూ.962.75 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేసింది.
నాటి చెల్లింపులపై టీడీఎస్ వసూలు చేయకపోవడం వెనుక చట్టబద్ధమైన సహేతుకత ఉన్నట్టు హెచ్‌యూఎల్ పేర్కొంది. కనిపించని ఆస్తుల (ఇంటాంజిబుల్) విక్రయం ద్వారా వచ్చే ఆదాయం భారతీయ పన్ను చట్టాల పరిధిలోకి రాదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment