![Police Inquire Health Condition Of Priyanka Injured In Attack - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/8/Disha.jpg.webp?itok=uilVo-L5)
సాక్షి, విశాఖపట్నం: ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై ‘దిశ’ పోలీసులు ఆరా తీశారు. ప్రియాంక ఆరోగ్యం కొంత క్షీణించింది. దీంతో కేజీహెచ్ వైద్యులు అత్యవసర వైద్యం అందించారు. విశాఖలోని థామ్సన్ స్ట్రీట్‌లో ఉంటున్న ప్రియాంక పక్కింట్లో ఉంటున్న శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమ పేరిట వేధించడమే కాకుండా.. నిరాకరించిందని గొంతుకోశాడు. ఈ ఘటనలో గొంతులో లోతుగా గాయం కావడంతో ఆమెకు కింగ్‌జార్జ్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. అయితే నిన్న రాత్రి గొంతులో కొంత అసౌకర్యం ఏర్పడటంతో ప్రత్యేకంగా వైద్యులు మంగళవారం చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని.. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత కాలం పడుతుందని కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మైథిలి పేర్కొన్నారు. (చదవండి: భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!)
Comments
Please login to add a commentAdd a comment