షాద్‌నగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిర్వహించారు. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్గోపాల్ వర్మ భేటీ)
శంషాబాద్‌లో అత్యాచారం, హత్య అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే చటాన్‌పల్లి శివారులో మృతదేహాన్ని కాల్చివేసిన బ్రిడ్జి వద్ద స్కూటీ, లారీతో సన్నివేశాన్ని కూడా చిత్రీకరణ చేశారు. కాగా దర‍్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ ఈ నెల 17న శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్‌ను కలిసి దిశ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ )
Comments
Please login to add a commentAdd a comment