
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం ప్రారంభమైంది. ఇందుకోసం ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఢిల్లీ)కు చెందిన ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యుల బృందం హైదరాబాద్ చేరుకుంది. గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న నాలుగు మృత దేహాలకు సోమవారం ఉదయం రీ పోస్ట్‌మార్టం చేపట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు టేబుల్స్ పై రీ పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మృతదేహం పోస్ట్‌మార్టం ప్రక్రియకు సుమారు గంటన్నర సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా. రీ పోస్ట్‌మార్టం ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనున్నది. సాయంత్రం 5 గంటల లోపల రీ పోస్ట్‌మార్టం నివేదికను వైద్యులు సీల్డ్ కవర్‌లో భద్రపరచనున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రీ పోస్ట్‌మార్టం జరిగే మార్చురీ లోపలికి ఎవరిని అనుమతించటం లేదని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి వర్గాలు రీ పోస్ట్‌మార్టంకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment