RePOST MORTEM
-
‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుమారు నాలుగు గంటలకు పైగా రీ పోస్టుమార్టం తంతు పూర్తి చేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు తయారు చేసిన నేటి పోస్టుమార్టం నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని ఈ మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్ తెలిపారు. మరికాసేపట్లో మృతదేహాలను తరలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే గాంధీ వైద్యులు రెండు ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఇక రెండు రోజుల్లో రీ పోస్టుమార్టం నివేదికను సీల్ట్ కవర్లో హైకోర్టు రిజిస్టార్కు అప్పగించనున్నటట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు పేర్కొన్నారు. -
మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం ప్రారంభం
-
దిశ నిందితుల రీ పోస్ట్‌మార్టం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం ప్రారంభమైంది. ఇందుకోసం ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఢిల్లీ)కు చెందిన ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యుల బృందం హైదరాబాద్ చేరుకుంది. గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న నాలుగు మృత దేహాలకు సోమవారం ఉదయం రీ పోస్ట్‌మార్టం చేపట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు టేబుల్స్ పై రీ పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మృతదేహం పోస్ట్‌మార్టం ప్రక్రియకు సుమారు గంటన్నర సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా. రీ పోస్ట్‌మార్టం ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనున్నది. సాయంత్రం 5 గంటల లోపల రీ పోస్ట్‌మార్టం నివేదికను వైద్యులు సీల్డ్ కవర్లో భద్రపరచనున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రీ పోస్ట్‌మార్టం జరిగే మార్చురీ లోపలికి ఎవరిని అనుమతించటం లేదని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి వర్గాలు రీ పోస్ట్‌మార్టంకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా తమకూ ప్రతిష్టాత్మకమైనదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై ఏమౌతుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని పేర్కొంది. ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలున్నందునే రీపోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని, దీనిపై ప్రభుత్వం కూడా ముందుకొచ్చి పారదర్శకతను చాటుకోవాల్సిన అవసరం ఉందంది. ఎన్కౌంటర్లో మరణించిన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాల వ్యవహారంపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని తేల్చిచెప్పింది. తొలుత ధర్మాసనం ఢిల్లీ వైద్యుల బృందంతో మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులు జారీ చేయబోతుంటే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వ వైఖరిని తెలియజేసేందుకు సోమవారం వరకూ గడువు ఇవ్వాలని ఏజీ కోరగా.. శనివారం ప్రత్యేకంగా ఈ కేసును మాత్రమే విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. రీ పోస్టుమార్టం చేయాల్సిందే.. ఎన్కౌంటర్లో మరణించిన నలుగురి మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనే పిల్‌ను ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. కె.సజన ఇతరుల కేసులో ఈనెల 17న సుప్రీంకోర్టు.. సాక్ష్యాధారాల సేకరణ–మృతదేహాల అప్పగింత వ్యవహారాలపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇందుకు అనుగుణంగా మృతదేహాలకు వేరే రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని పిల్లో కోర్టుకు సహాయకారిగా (ఎమికస్‌క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి కోరారు. వెంటనే అందుకు అనుగుణంగా ధర్మాసనం స్పందించబోతుంటే ఏజీ కల్పించుకుని.. తెలంగాణలో నిష్ణాతులైన ఫోరెన్సిక్ వైద్య నిపుణులున్నారని, వేరే రాష్ట్రాల వైద్యులతో తిరిగి పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మృతదేహాలు పాడైపోతున్నాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు కూడా చెబుతున్నారని, ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయని, ఎన్కౌంటర్ పేరుతో నలుగురిని కాల్చి చంపారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే రీపోస్టుమార్టం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పిల్లో రీపోస్టుమార్టం కావాలని పిటిషనర్ కోరలేదని ఏజీ చెప్పగా, ఒక పిల్లో లేకపోతే మరో పిల్లో ఆ అభ్యర్థన ఉందని, అయినా సుప్రీంకోర్టు తమను నిర్ణయించాలని చెప్పాక ఆకాశమే హద్దుగా చేసుకుని ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్కౌంటర్ విశ్వవ్యాప్తమైంది పోలీసుల ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్టలే కాకుండా తెలంగాణ హైకోర్టు ప్రతిష్ట కూడా ఇందులో ముడిపడి ఉందని, దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ విశ్వవ్యాప్తమైందని, ఏం జరగబోతోందోనని దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బూటకపు ఎన్కౌంటర్ అనే విమర్శలు వచ్చినప్పుడు నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాలని, అయితే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోందో అర్థం కావడం లేదని సందేహాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు దిశ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్టే ఉత్తర్వులు ఇచ్చిందని ఏజీ చెప్పగానే ధర్మాసనం తిరిగి స్పందిస్తూ ఆ తర్వాత మృతదేహాల వ్యవహారాన్ని హైకోర్టే తేల్చాలని తమకు ఆదేశాలిచ్చిందని గుర్తు చేసింది. బంతి మా కోర్టులో ఉందని వ్యాఖ్యానించింది. ఒక ఘటన (ఎన్కౌంటర్) జరిగాక పోస్టుమార్టం జరిగిందని, మళ్లీ పోస్టుమార్టం చేయాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ (చర్యకు కారణం) ఉండాలి కదా అని ఏజీ సందేహాన్ని లేవనెత్తారు. తాము ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆదేమీ అడ్డంకి కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. మృతదేహాలకు కుటుంబసభ్యులు దహన సంస్కారాలు చేయాలని, ఎంతకాలం వాటిని భద్రపర్చుతారని, ఈ ఘటనపై ఆధారాల సేకరణకు వీలుగా మరోసారి వాటికి పోస్టుమార్టం చేయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులను ప్రభుత్వం విభేదిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది. అయితే రీపోస్టుమార్టం చేయాలనే పిల్‌పై ప్రభుత్వ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సోమవారం వరకూ సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరమేముందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరిని తెలుసుకునేందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో సెలవు దినమైనా శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేకంగా విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. విచారణకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. -
రీ పోస్టుమార్టానికి మృతదేహం వెలికతీత
దగదర్తి : తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుమారుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఖననం చేసిన మృతదేహాన్ని రీపోస్టుమార్టం నిమిత్తం వెలికితీశారు. మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో గత నెల 29వ తేదీన గుర్తించిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొత్తపల్లి కౌరుగుంటకు చెందిన నారాయణ (60)గా మరుసటి రోజు కుటుంబ సభ్యులు గుర్తించిన విషయం విదితమే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. అయితే తన తండ్రిని కొందరు హత్య చేశారని మృతుడి కుమారుడు వేణు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శుక్రవారం దగదర్తి తహసీల్దార్ వై.మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీసి, పంచనామా నిర్వహించారు. వైద్యులు మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం కేసు దర్యాప్తు చేస్తామని ఎస్సై విజయ్‌శ్రీనివాస్ తెలిపారు. -
రీ పోస్టుమార్టం చేయండి
-
సుజాతది ఆత్మహత్యే..
అనంతపురం క్రైం : ఏడాదికి పైగా మిస్టరీగా మిగిలిపోయిన న్యాయవాది ఎర్రిస్వామి భార్య సుజాత మిస్సింగ్ కేసు చిక్కుముడి దాదాపు వీడింది. జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. గుర్తు తెలియనిదిగా పూడ్చిపెట్టిన సుజాత శవాన్ని మంగళవారం తహశీల్దారు సమక్షంలో వెలికితీసి వైద్య నిపుణుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. మృతదేహం ఎముకలు, ఎముకల మజ్జ సేకరించారు. వాటిని డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఈ కేసు పూర్తికానుంది. ఇప్పటిదాకా పోలీసులకు లభించిన ఆధారాలు, ఆనవాళ్లను పరిశీలిస్తే సుజాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరాలను ఎస్పీ రాజశేఖర్‌బాబు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఎర్రిస్వామికి 14 ఏళ్ల కిందట కంబదూరు మండలం మరిమేకలపల్లికి చెందిన సుజాతతో వివాహమైంది. వీరికి అమృతకర్, వర్షిత్కర్ అనే కుమారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే ఉండేవారు. ఖర్చులకు సరిపడా సంపాదన లేకపోవడంతో భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో రెండుసార్లు భర్తకు తెలీకుండా సుజాత పుట్టింటికి వెళ్లింది. ఇదే తరహాలో గతేడాది అక్టోబరు 29న కన్పించకుండా పోయింది. అదే ఏడాది నవంబరు 26న ఆమె తండ్రి బోయ చిన్న ఈరన్న కంబదూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబరులో ఓ గుర్తు తెలియని మహిళ శవం అనంతపురం సమీపంలోని నేషనల్ పార్కు వద్ద రైలుపట్టాలపై పడిఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శవం ఫోటోలను కంబదూరు పోలీసులకు ఇచ్చి గుర్తు పట్టమన్నారు. అయితే ఫోటోల్లో ఉన్న శవానికి నల్లటి గ్రీస్ అంటి ఉండడంతో గుర్తుపట్టేందుకు వీలు లేకుండా పోయింది. సుజాత భర్త ఎర్రిస్వామి తన భార్య అదృశ్యంపై కొందరి వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు విన్నవించాడు. కేసును కంబదూరు పోలీస్‌స్టేషన్ నుంచి అనంతపురం టూటౌన్‌కు మార్చాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో కేసును ఇక్కడికి బదిలీ చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఈ నేపథ్యంలో నేషనల్ పార్కు సమీపంలో రైలు కింద పడి మృతి చెందిన గుర్తు తెలియని మహిళ శవానికి, సుజాతకు పోలికలు పరిశీలించాం. ఇదే కోణంలో దర్యాప్తు సాగింది. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు (యూంటీమార్టం.. అంటే చనిపోక ముందు గాయూలు లేవని) పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. మృతురాలి చెంపపై పుట్టుమచ్చ ఉంది. సుజాత ఫైల్ ఫోటోలను పరిశీలించగా పుట్టుమచ్చ సరిపోయింది. ఆమె ధరించిన చెవి కమ్మకు.. శవం వద్ద లభ్యమైన చెవికమ్మకు పోలిక ఉంది. వీటి ఆధారంగా ఆ శవం సుజాతదేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామ’ని ఎస్పీ తెలిపారు. కాగా సుజాత అదృశ్యం వెనుక కొందరు బీజేపీ నాయకుల ప్రమేయమున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేశామన్నారు. సుజాత ఉపయోగించిన సెల్‌ఫోన్ కాల్స్ డిటేల్స్‌ను తెప్పించి విశ్లేషించామన్నారు. ఇందులో బీజేపీ నాయకుల ప్రమేయం లేదని తేలిందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.