acuused
-
కోర్టులో లొంగిపోనున్న ప్రదీప్‌రెడ్డి?
సాక్షి, కాజీపేట అర్బన్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోకు ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రదారి పింగిళి ప్రదీప్‌రెడ్డి సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు పుకార్లు శికార్లు చేస్తున్నాయి. ఆనంద్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి మధ్య ఇసుక వ్యాపారం నిమిత్తం 80 లక్షల లావాదేవీల చెల్లింపులో భాగంగా శనిగరంకు చెందిన శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రమేష్ ఈనెల 7న కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆనంద్‌రెడ్డిని కమలాపూర్ మండలం హన్మకొండలో కిడ్నాప్ చేసి భూపాలపల్లి జిల్లా రామారం అడవుల్లో గట్టమ్మగుడి దగ్గర దారుణంగా హత్య చేశారు. లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగానే.. ప్రదీప్‌రెడ్డిపై అనుమానం ఉందని మృతుడు ఆనంద్‌రెడ్డి సోదరుడు శివకుమార్‌రెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు శివరామకృష్ణ, శంకర్, మధుకర్‌లను అరెస్టు చేసి వాహనాన్ని, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగి వారం అవుతున్నా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోనే 2 స్పెషల్ టీంలు.. ఆనంద్‌రెడ్డి హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రెండు స్పెషల్ టీంలు ముగ్గురు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హోటళ్లలో బస చేశారనే సమాచారంతో తనిఖీలు చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ రెడ్డి ఎవరు? ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి మిత్రుడుగా పేర్కొంటున్న విక్రమ్‌రెడ్డి ఎవరు అనే కోనంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌రెడ్డి బంధువులు పోలీస్ విభాగంలో ఉన్నారని, ఇందుమూలంగానే అరెస్ట్ పర్వం ఆలస్యం అవుతుందనే అనుమానం తలెత్తుతుంది. -
దిశ నిందితుల రీ పోస్ట్‌మార్టం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం ప్రారంభమైంది. ఇందుకోసం ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఢిల్లీ)కు చెందిన ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యుల బృందం హైదరాబాద్ చేరుకుంది. గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న నాలుగు మృత దేహాలకు సోమవారం ఉదయం రీ పోస్ట్‌మార్టం చేపట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు టేబుల్స్ పై రీ పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మృతదేహం పోస్ట్‌మార్టం ప్రక్రియకు సుమారు గంటన్నర సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా. రీ పోస్ట్‌మార్టం ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనున్నది. సాయంత్రం 5 గంటల లోపల రీ పోస్ట్‌మార్టం నివేదికను వైద్యులు సీల్డ్ కవర్లో భద్రపరచనున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రీ పోస్ట్‌మార్టం జరిగే మార్చురీ లోపలికి ఎవరిని అనుమతించటం లేదని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి వర్గాలు రీ పోస్ట్‌మార్టంకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
వింత దొంగను పట్టుకున్నారు...
టోక్యోః జపాన్ లోని టోక్యోలో ఓ వింత దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఫేస్ బుక్ ఖాతాలోకి అక్రమంగా చొరబడి, ఆమె లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేసిన ఆరోపణలతో పోలీసులు ఆ వ్యక్తిని వలవేసి పట్టుకున్నట్లు తెలిపారు. వందలకొద్దీ అక్రమ ఖాతాలు, పాస్వర్డ్స్ సేకరించిన అతడి ఇంట్లో సోదాలు జరిపి డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ లో దుస్తుల ఫొటోలను అక్రమంగా దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్లు చేశారు. జపాన్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి, 25 ఏళ్ళ ర్యోసుకే కొగా.. బాధితురాలి ఫేస్ బుక్ ఖాతాలోకి చొరబడి, జనవరినుంచి మూడు నెలల సమయంలో సుమారు 17 సార్లు అక్రమంగా లాగిన్ అయ్యాడు. అంతేకాక ఆమె ఖాతానుంచి లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేశాడని టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐటీ సంస్థలో పనిచేస్తున్నసదరు వ్యక్తి సుమారు 770 ఫేస్ బుక్, ఐ క్లౌడ్ ఐడీలు కలిగి ఉన్నట్లు, వాటినుంచీ సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు స్థానిక మీడియా సహా, జిజి ప్రెస్ విచారణలో వెల్లడైంది. అక్రమంగా సామాజిక మాధ్యమాల్లో చొరబడి, సమాచారాన్ని దొంగిలిస్తున్న కొగాకు మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, సుమారు 5.5 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అన్ని వందల లాగిన్ ఐడీలను.. కొగా ఎలా సేకరించాడన్న విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓ మహిళ అండర్ వేర్ ఫొటోలను డౌన్లోడ్ చేసిన సందర్భంలో ఆ చోరాసురుడి అసలు బండారం బయట పడినట్లు ఓ వార్తా పత్రిక వెల్లడించిన సమాచారంద్వారా తెలుస్తోంది. ఇతరుల అకౌంట్లలో చొరబడ్డమే కాక, కొన్నిలైంగిక చిత్రాలను పోస్టు చేసిన కొగా ఇంట్లో... సోదాలు నిర్వహించిన పోలీసులు.... అతడు సేకరించిన ఐడీ, పాస్వర్డ్ డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు.