సాక్షి, కాజీపేట అర్బన్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోకు ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రదారి పింగిళి ప్రదీప్‌రెడ్డి సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు పుకార్లు శికార్లు చేస్తున్నాయి. ఆనంద్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి మధ్య ఇసుక వ్యాపారం నిమిత్తం 80 లక్షల లావాదేవీల చెల్లింపులో భాగంగా శనిగరంకు చెందిన శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రమేష్ ఈనెల 7న కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆనంద్‌రెడ్డిని కమలాపూర్ మండలం హన్మకొండలో కిడ్నాప్ చేసి భూపాలపల్లి జిల్లా రామారం అడవుల్లో గట్టమ్మగుడి దగ్గర దారుణంగా హత్య చేశారు.
లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య
మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగానే..
ప్రదీప్‌రెడ్డిపై అనుమానం ఉందని మృతుడు ఆనంద్‌రెడ్డి సోదరుడు శివకుమార్‌రెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు శివరామకృష్ణ, శంకర్, మధుకర్‌లను అరెస్టు చేసి వాహనాన్ని, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగి వారం అవుతున్నా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌లోనే 2 స్పెషల్ టీంలు..
ఆనంద్‌రెడ్డి హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రెండు స్పెషల్ టీంలు ముగ్గురు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హోటళ్లలో బస చేశారనే సమాచారంతో తనిఖీలు చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.
విక్రమ్ రెడ్డి ఎవరు?
ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి మిత్రుడుగా పేర్కొంటున్న విక్రమ్‌రెడ్డి ఎవరు అనే కోనంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌రెడ్డి బంధువులు పోలీస్ విభాగంలో ఉన్నారని, ఇందుమూలంగానే అరెస్ట్ పర్వం ఆలస్యం అవుతుందనే అనుమానం తలెత్తుతుంది.
కోర్టులో లొంగిపోనున్న ప్రదీప్‌రెడ్డి?
Published Mon, Mar 16 2020 10:10 AM | Last Updated on Mon, Mar 16 2020 10:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment