మృతుడు అరవింద్, మృతుడు నరేష్
సాక్షి, వరంగల్: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి లో బుధవారం చోటు చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్ల నరేష్(22) కొన్ని నెలలుగా మతి స్థిమితం కోల్పోయాడు. బుధవారం తల్లి లక్ష్మితో కలిసి వ్యవసాయ భూమిలో పంటకు మందు కొట్టేందుకు వెళ్లారు. తల్లి నీళ్లు తాగేందుకు కొంతదూరం వెళ్లగా నరేష్ వద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. గమణించిన తల్లి స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం చిట్యాల సామాజిక ఆరోగ్యానికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మతిస్థిమితం కోల్పోయిన నరేష్ గతంలో కూడా రెండుసార్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్సాడ్డాడని తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పల్లె నర్సింగ్ తెలిపారు.
ఉరి వేసుకుని మరో యువకుడు..
కాజీపేట: ప్రభుత్వ ఐటీఐ చదువులో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మానసిక ఆవేదనతో క్షణికావేశానికిలోనై ఓ యువకుడు బుధవారం కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్‌హాల్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ అజయ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రామకృష్ణకాలనీకి చెందిన తాండ్ర అరవింద్(20) ఇటీవల ఐటీఐలో ఫెయిల్ అయ్యాడు. కొద్ది రోజులుగా మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాడు. చదువులో వెనుకబడిపోయాననే బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపాడు.
మహిళా ఆత్మహత్యాయత్నం..
నర్మెట: ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానకి పాల్ప డింది. ఈ సంఘటన మండలంలోని ఆగాపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా వ్యవసా యం కలసిరాకపోవడంతో రైతు శిల్వారెడ్డి అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది కూడా వర్షాలు కురవకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు భార్య సబీనమ్మ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఎంజీఎంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment