భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో.. | Wife Complains On Husband At Guntur District | Sakshi
Sakshi News home page

భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..

Nov 22 2020 11:03 AM | Updated on Nov 22 2020 1:38 PM

Wife Complains On Husband At Guntur District - Sakshi

సాక్షి, పట్నంబజారు(గుంటూరు): భార్య నగ్న వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన భర్తపై కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు నగరం ఏటీ అగ్రహారానికి చెందిన ఒక మహిళ తన భర్త వికృత నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి పనులు చేయకుండా, యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న భర్త, భార్యతో ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు తీసిన ఘటన వెలుగు చూసింది.   (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!)

విషయం తెలుసుకున్న భార్య పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లటంతో దిశా పోలీసుస్టేషన్‌కు విచారణ నిమిత్తం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటీకే ఐటీ కోర్‌ బృందం ఆ వీడియోలు అప్‌లోడ్‌లను తీసివేసే పనిలో నిమగ్నమైంది. పోలీసులు యుద్ధప్రాతిపదికన కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పుడు అప్‌లోడ్‌ చేశాడు.. ఎన్ని వీడియోలు ఉన్నాయి.. యూట్యూబ్‌లో కాకుండా, ఇతరత్రా సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అప్‌లోడ్‌ చేశాడా...? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదును స్వయంగా అర్బన్‌ పోలీసు ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు.    (మైనర్‌తో అసభ్య చాటింగ్‌)

చదవండి: (సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement