సాక్షి, జాగిత్యాల : దిశ కేసులో పోలీసులు చేసిన పని సరైనదేనని తాను భావిస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. అటువంటి దుర్మార్గులకు శిక్ష పడితేనే ప్రజల్లో పరివర్తన వస్తుందని తెలిపారు. కళ్లముందే మహిళపై అన్యాయం జరిగినా పట్టిచ్చుకునే నాథుడే లేడని పేర్కొన్నారు. ఇప్పుడున్న పాతకాలపు చట్టాలను మార్చి ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొస్తే బాగుటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు ఆత్మస్తైర్యం దెబ్బతిన్న రోజు ప్రజలను రక్షించేవారు కరువవుతారని విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment