
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచారం కేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుకను వైద్య సదుపాయం ఉన్న బాలికల వసతి గృహానికి తరలించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు పి.అచ్యుతరావు కోరారు. రేణుక మైనర్ అని, ఆర్నెల్ల్ల గర్భిణీ అయినందున ఆమె ఎప్పుడైనా ప్రసవించే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు వైద్య సేవలు సమీపంలో ఉండాలని, అందుకోసంఅన్ని రకాల వసతులున్న వసతి గృహానికి తరలించాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. అదే విధంగా రేణుకకు పోక్సో చట్టం కింద పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.