chenna keshavalu
-
రేణుకను బాలికల వసతి గృహానికి పంపండి
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచారం కేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుకను వైద్య సదుపాయం ఉన్న బాలికల వసతి గృహానికి తరలించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు పి.అచ్యుతరావు కోరారు. రేణుక మైనర్ అని, ఆర్నెల్ల్ల గర్భిణీ అయినందున ఆమె ఎప్పుడైనా ప్రసవించే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు వైద్య సేవలు సమీపంలో ఉండాలని, అందుకోసంఅన్ని రకాల వసతులున్న వసతి గృహానికి తరలించాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. అదే విధంగా రేణుకకు పోక్సో చట్టం కింద పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
మార్కాపురం బస్టాండు వద్ద వ్యక్తి హత్య
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండువద్ద మంగళవారం ఉదయం ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో అతన్ని కిరాతకంగా నరికి హత్యచేశారు. మార్కాపురం పట్టణానికి చెందిన చెన్నకేశవులు(43) ఉదయం బస్టాండు వద్ద నడుచుకుంటూ వెళుతుండగా వెంబడించిన దుండగులు దారుణంగా నరికి చంపారు. పాతకక్షల వల్లే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.