షాద్‌నగర్ రూరల్: అడిగేవాళ్లు లేరనే ఉద్దేశంతోనే ‘దిశ’ఘటనలో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘అగ్రకుల మహిళలకు ఒక న్యాయం.. దళిళ బహుజనులకు ఒక న్యాయం’అనే అంశంపై సమావేశంలో చర్చించారు. దిశ అగ్రకులానికి చెందిన యువతి కావడంతోనే పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని మందకృష్ణ ఆరోపించారు. నిందితులు బడుగు, బలహీన వర్గాల వారు కావడంతోనే ఎన్‌కౌంటర్ పేరుతో అంతమొందించారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎమ్మారీ్పఎస్ నాయకులు బుర్ర రాంచం ద్రయ్య, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment