What Did The Sirpurkar Commission Report Look into Disha Case - Sakshi
Sakshi News home page

సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించింది?

Published Sat, May 21 2022 3:58 PM | Last Updated on Sun, May 22 2022 2:52 PM

What Did The Sirpurkar Commission Report Look into Disha Case - Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది.  అసలు సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించిందనేది ఒకసారి చూద్దాం.

పోలీసులు ఏం చెప్పారు?

  •  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను  సేఫ్ హౌజ్ నుంచి దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు
  • ఉదయం 3గంటలకు సేఫ్‌ హౌజ్ నుంచి సంఘటనా స్థలానికి బయల్దేరిన పోలీసులు    
  • TS 09 PB 4760 మినీ బస్సులో నిందితులను సేఫ్‌ హౌజ్‌ నుంచి దిశను చంపిన స్థలానికి తరలించారు
  • ఉదయం 4.30గంటలకు చింతపల్లికి చేరుకున్న పోలీసులు
  • ఇంకా చీకటిగా ఉండటంతో 5.30గంటల వరకు బస్సులోనే కూర్చున్న పోలీసులు


పోలీసులు చెప్పిన దాంట్లో భిన్న వాదనలేంటీ? 

  • సంఘటన సమయంలో ఉన్న పోలీసులు ఒక్కొక్కరు ఒక్కో సమయం చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేసిన  కమిషన్ 
  • రాత్రి 11గంటలకే శంకర్‌పల్లిలో నిందితులను ఉంచిన సేఫ్‌హౌజ్‌కు బస్‌ చేరుకున్నట్లు లాగ్‌బుక్‌లో నమోదు
  •  ప్రయాణానికి రెండు గంటలు పట్టిందని కొందరు పోలీసులు... గంటలోనే 65కిలోమీటర్లు ప్రయాణించామని కొందరి వాంగ్మూలం
  •  జాతీయ మానవహక్కుల సంఘం ముందు  ఇచ్చిన వాంగ్మూలానికి... కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా


కమిషన్‌ ముందు పోలీసులు చెప్పిందేంటీ?

  • ఉదయం 5.45నిమిషాలకు బస్సులోంచి దిగి క్రైం సీన్‌లోకి ఎంటరైన పోలీసులు
  • సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు 4నిందితులతో పాటు వెళ్లిన 10మంది పోలీసులు ఇద్దరు పంచులు
  •  సంఘటన స్థలానికి చేరుకున్న తరువాత చింతపల్లి బ్రిడ్జి వద్ద పరిశీలన చేసిన అధికారులు
  • దిశ మృతదేహం లభించిన ప్రాంతం నుంచి తూర్పున 50అడుగుల దూరంలో ఉన్న పొలాల వైపు వెళ్లిన పోలీసులు
  • నిందితులు దశను హత్యచేసిన తరువాత పొలాల వైపు వెళ్లారని అందుకే... పొలాల్లోకి తీసుకెళ్లామంటున్న పోలీసులు
  • నిందితులు పొలాల్లో మారణాయుధాలు దాచినట్లు పోలీసుల అనుమానం


పోలీసులు చెప్పినదానిపై కమిషన్‌ అనుమానాలేంటీ?

  • పోలీసులు పొలాల్లోకి వెల్లేందుకు అక్కడున్న గేట్ ద్వారా వెళ్లారా లేక... ఫెన్సింగ్ తొలగించారా అనే విషయంపై స్పష్టత లేదు
  • ఇక పొలాల్లోకి వెల్తున్న సమయంలో ఒకరి వెంట ఒకరు సింగిల్ ఫార్మేషన్‌లో వెళ్లినట్లు వాంగ్మూలం ఇచ్చిన పోలీసులు
  • దాదాపు 300మీటర్లు నడిచిన తరువాత అక్కడ ఉన్న హైటెన్షన్ పోల్‌ వద్ద ఆగిన పోలీసులు
  • తెల్లవారు జామున మంచు కురుస్తుండటంతో 30ఫీట్ల దూరంలో ఉన్న వ్యక్తి కూడా సరిగా కనిపించని పరిస్థితి నెలకొని ఉంది


ఘటనా స్థలంలో ఏం జరిగింది? పోలీసులు కమిషన్‌కు ఏం చెప్పారు?

  • హైటెన్షన్ పోల్ దగ్గర దిశను హత్య చేసిన తరువాత ఆమె వస్తువులను దాచినట్లు చెప్పిన నిందితులు
  • పోల్ దగ్గరకు చేరుకున్న తరువాత అక్కడ తప్పి వస్తువులు తీసేందుకు పోలీసుల యత్నం
  • అదే సమయంలో వంగి తవ్వుతున్న కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కున్న నిందితుడు
  • వెంటనే మిగిలిన నిందితులు పరగెత్తండిరా అంటూ గట్టిగా అరుస్తూ పోలీసుల కళ్లలోకి మట్టి విసిరాడు
  • ఇంతలో మరో ఇద్దరు నిందితులు పోలీసులపైకి రాల్లు రువ్వుతూ పొలాల్లోకి పరిగెత్తారు
  • తుపాకి లాక్కున్న నిందితుడు పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు...
  • పోలీసులు లొంగిపోవాలంటూ అరుస్తున్నా... నిందితుడు కాల్పులు జరుపుతూ పొలాల్లోకి పరుగెత్తాడు
  • ప్రాణ రక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసుల వాంగ్మూలం
  • కాల్పులు ప్రారంభమైన 5నిమిషాల తరువాత 4గురు నిందితులు బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే చనిపోయినట్లు గుర్తింపు


కమిషన్‌ అనుమానాలేంటీ?

  • దిశను హత్యచేసి ఆమె వస్తువులు హైటెన్షన్ పోల్ వద్ద దాచినట్లు గుర్తించామని చెప్పిన పోలీసులు
  • దిశ వస్తువులు వెలికి తీసేందుకే సంఘటనా స్థలానికి వెల్లినట్లు పోలీసుల నివేదిక\
  • సంఘటనా స్థలంలో దొరికిన దిశా వస్తువులపై నిందితుల ఆనవాళ్లు, వేలి ముద్రలు లేవని గుర్తించిన కమిషన్
  • సంఘటన 6.15జరిగినట్లు ఎఫ్ఐఆర్ కాని పోలీసుల వాంగ్మూలం ప్రకారం 6.30వరకు బతికే ఉన్న నిందితులు
  • మంచు కారణంగా 20అడుగులు కూడా చూడలేని పరిస్థితి ఉందని కొందరు పోలీసుల వాంగ్మూలం
  • లేదు మంచి విజిబులిటి ఉందని మరికొందరు పోలీసుల వాంగ్మూలం
  • కళ్లలోకి మట్టికొట్టి నిందితులు పారిపోయారన్న విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు పెట్టలేదు...
  • కళ్లలోకి మట్టి కొట్టిన విషయంపైనా పోలీసుల వాంగ్మూలంలో భిన్న వాదనలు
  • పోలీసులకు తగిలినా గాయాలపైనా అనుమానాలు... ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు నివేదిక
  • పోలీసులు ఇచ్చిన నివేదికలో ముగ్గురు సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు వెళ్లడి
  • కాని ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన నివేదికలో చిన్న చిన్న గాయాలున్నట్లు గుర్తింపు
  • గాయపడిన వారిని అక్కడ ఉన్న పోలీసులే ప్రాథమిక చికిత్స చేసినట్లు వాంగ్మూలం ఇచ్చిన కానిస్టేబుళ్లు
  • గాయపడ్డవారిని అక్కడే ఉన్న బస్సులో ఆసుపత్రికి తరలించకపోవడంపై అనుమానాలు
  • ఆంబులెన్స్ వచ్చినా వారు గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయలేదు... కనీసం వారెవరో అంబులెన్స్ సిబ్బందికి చూపెట్టలేదు


ఘటనా స్థలంలో జరిగిన దానిపై కమిషన్‌కు పోలీసులు ఏం చెప్పారు?

  • చింతపల్లికి చేరుకున్న సమయంలో తన పిస్టల్‌ మ్యాగజీన్ మోడ్‌లో ఉందన్న కానిస్టేబుల్‌
  • మ్యాగజీన్ మోడ్‌లో ఉన్న పిస్టల్‌ను కాక్‌ చేస్తే బుల్లెట్‌ ఫైరింగ్ చాంబర్‌లోకి వస్తుంది
  • చాంబర్‌ మోడ్‌లో ఉన్నప్పుడే తుపాకి ట్రిగ్గర్ నొక్కితే అది పేలుతుంది. అయితే తుపాకి కాక్‌ చేశాక... చాంబర్‌ మోడ్‌లో ఉన్నప్పుడు తప్పకుండా సేఫ్టీ పిన్ ఆన్ చేయాలి
  • కాని తన పిస్టల్‌ను కాక్ చేయలేదన్న పోలీస్ అధికారి


ఘటనా స్థలంలో జరిగిన దానిపై కమిషన్‌ అభ్యంతరాలు

  • నిందితులు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారా అన్న విషయంపైనా అనుమానాలు
  • తుపాకి లాక్కునే సమయంలో తుపాకి పెట్టే పౌచ్ చినిగిపోయిందా... అది డెడ్‌బాడి దగ్గర ఎందుకు లేదు?
  • తుపాకి లాక్కుని నిందితులు కాల్పులు జరిపిన తరువాత తుపాకి ఎవరు స్వాధీనం చేసుకున్నారు?
  • తుపాకి పౌచ్‌ డెడ్‌బాడీకి 22ఫీట్ల దూరంలో దొరికిందన్న పోలీసు అధికారి
  • పౌచ్ కేవలం 5ఫీట్ల దూరంలో దొరికిందన్న మరో పోలీస్ అధికారి
  • బలవంతంగా తుపాకీ లాక్కున్న పౌచ్‌కు ఏమీ కాకపోవడం అనుమానాస్పదంగా లేదా?


GSR (గన్‌ షాట్‌ రెసిడ్యుయరీ)పై  కమిషన్‌ అభ్యంతరాలు

  • నిందితుల చేతుల నుంచి తుపాకీ కాల్చిన ఆనవాళ్లు కలెక్ట్ చేయడంలోనూ అనుమానాలు
  • నిందితుల కుడి చేతికి గన్ షాట్ రెసిడ్యుయల్ ఉందని గుర్తించిన ఫొరెన్సిక్ నిపుణులు
  • వారి ఎడమచేతిలో ఎలాంటి జిఎస్‌ఆర్ దొరకలేదన్న ఫొరెన్సిక్ నిపుణులు
  • జీఎస్అర్‌లో తప్పకుండా ఉండాల్సిన అంటిమోని, బోరియం, లెడ్ మూలకాలు నిందితుల చేతుల నుంచి తీసిన సాంపుల్స్‌లో లభించలేదు
  • కేవలం నైట్రైట్స్ మాత్రమే వారి వద్ద సేకరించిన శాంపిల్స్‌లో లభించాయి.
  • ఎవరైనా చనిపోయిన తరువాత వారి చేతిలో తుపాకి పెట్టి ఉండొచ్చు.
  • చనిపోయిన వ్యక్తి చేతికి నైట్రైట్స్ రాసి ఉండొచ్చు...
  • చనిపోయిన వ్యక్తి చేతిలో తుపాకి పెట్టి కాల్చి ఉండొచ్చు


కాల్పులు జరిపిన విధానంపై పోలీసులు ఏం చెప్పారు?

  • కాల్చకండి కాల్చకండి..లొంగిపోండి అంటూ మూడుసార్లు అరిచిన పోలీసు అధికారి
  • పారిపోతూ నిందితులు కాల్పులు జరిపారు... అటు వైపే పోలీసులు కాల్పులు జరిపారు
  • మంచు వల్ల మనిషి కనబడకపోయినా శబ్దం ఆధారంగా కాల్పులు జరిపినట్లు చెప్పిన పోలీసులు
  • ఎలాంటి కాల్పులు జరపని జల్లు శివ,జల్లు నవీన్‌కు ముందు భాగంలో బుల్లెట్లు తగిలాయి


కమిషన్‌ అనుమానాలు

  • పోలీసులు ఎందుకు గాల్లోకి కాల్పులు జరపలేదు?
  • ఎందుకు పారిపోతున్న నిందితుల కాళ్లపైకి కాల్పులు జరపలేదు?
  • పోలీసులు తూటాలు నిందితుల ముందుభాగం నుంచి వెనక్కి వెళ్లినట్లు ఆనవాళ్లు
  • పారిపోతున్న వారిపై వెనక నుంచి కాల్పులు జరిపితే వారికి ముందు భాగంలో గాయాలెలా అయ్యాయి?


ఎవరెవరికి ఎక్కడ గాయాలయ్యాయి?
మహమ్మద్ ఆరిఫ్
1. దవడ కింద భాగంలో ఒకటిన్నర సెంటీమీటర్ల బెల్లెట్ ఎంట్రీ గాయం...
మెడ వెనక నుంచి దాదాపు 3సెంటీమీటర్ల గాయంతో బయటకు వెళ్లిపోయిన బుల్లెట్‌
2.ఛాతి కుడిభాగంలో మరో బుల్లెట్‌ గాయం...
3.ఛాతి మధ్యభాగంలో మరో బుల్లెట్ గాయం...
4.పొత్తి కడుపులో మరో బుల్లెట్‌

జొల్లు శివ
1.పొత్తి కడుపులో కుడివైపున చొచ్చుకెల్లిన బుల్లెట్
2. ఛాతి భాగంలో ఎడమవైపున దూసుకెళ్లిన బుల్లెట్‌
3. ఛాతీ భాగంలో ఎడమవైపున దిగువన మూడో బుల్లెట్

జొల్లు నవీన్‌
1. ఛాతీలోకి దూసుకెల్లిన బుల్లెట్‌
2. తలలోకి దూసుకెల్లిన బుల్లెట్‌

చింతకుంట చెన్నకేశవులు
1. గొంతులోకి దూసుకెల్లిన బుల్లెట్‌

పోలీసుల కాల్‌డేటా రికార్డుల్లో ఏముంది?

  • మహమ్మద్ ఆరిఫ్‌, చెన్నకేశవుల చేతుల్లో రెండు 9mm పిస్టల్లు లభ్యం
  • 9ఎంఎం పిస్టల్‌కు సంబంధించిన 10ఎంప్టీ కాంట్రిడ్జెస్
  • ఎస్‌ఎల్‌ఆర్ తుపాకికి సంబందించిన 3ఎంప్టీ కాంట్రిడ్జెస్
  • ఏకే-47కు చెందిన 6ఎంప్టీ కాంట్రిడ్జెస్ లభ్యం


కమిషన్‌ ముందు డ్రైవర్‌ ఏం చెప్పారు?

  • తాను బస్సులో పడుకుని ఉండగా తుపాకుల శబ్దం వినిపించిందన్న డ్రైవర్
  • అయితే బయట చీకటి, పొగమంచు ఉండటంతో తనకేమి కనబడలేదన్న డ్రైవర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement