sirpurkar commission
-
‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంచ్ స్టే ఇచ్చింది.10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో కమిషన్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్‌నగర్ సీఐ శ్రీధర్‌తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఎన్కౌంటర్ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్‌లో లోపాలు ఉన్నాయన్న కమిషన్..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని రిపోర్టు ఇచ్చింది. ఎన్కౌంటర్ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్.. అప్పటి ఎన్‌కౌంటర్‌ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్ రిపోర్ట్‌పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది -
దిశ ఎన్కౌంటర్: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిశ ఎన్కౌంటర్ కేసు హైకోర్టుకు చేరింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు చేరింది. దిశ కేసులో ఎమికస్ క్యూరీగా దేశాయ్ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది. దిశ కేసు నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు విచారిస్తుందంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. త్వరగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా 287 పేజీల కమిషన్ నివేదికకు సంబంధించి 57 మంది సాక్షులను, 10 మంది పోలీసులను విచారించారు. 2019 నవంబర్ 27న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన యువవైద్యురాలు దిశ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం చటాన్‌పల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన కింద కాలుతూ ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతురాలిని దిశగా తేల్చారు. 2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. షాద్ నగర్‌కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. -
సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించింది?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. అసలు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించిందనేది ఒకసారి చూద్దాం. పోలీసులు ఏం చెప్పారు? సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను సేఫ్ హౌజ్ నుంచి దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు ఉదయం 3గంటలకు సేఫ్ హౌజ్ నుంచి సంఘటనా స్థలానికి బయల్దేరిన పోలీసులు TS 09 PB 4760 మినీ బస్సులో నిందితులను సేఫ్ హౌజ్ నుంచి దిశను చంపిన స్థలానికి తరలించారు ఉదయం 4.30గంటలకు చింతపల్లికి చేరుకున్న పోలీసులు ఇంకా చీకటిగా ఉండటంతో 5.30గంటల వరకు బస్సులోనే కూర్చున్న పోలీసులు పోలీసులు చెప్పిన దాంట్లో భిన్న వాదనలేంటీ? సంఘటన సమయంలో ఉన్న పోలీసులు ఒక్కొక్కరు ఒక్కో సమయం చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేసిన కమిషన్ రాత్రి 11గంటలకే శంకర్‌పల్లిలో నిందితులను ఉంచిన సేఫ్హౌజ్కు బస్ చేరుకున్నట్లు లాగ్‌బుక్‌లో నమోదు ప్రయాణానికి రెండు గంటలు పట్టిందని కొందరు పోలీసులు... గంటలోనే 65కిలోమీటర్లు ప్రయాణించామని కొందరి వాంగ్మూలం జాతీయ మానవహక్కుల సంఘం ముందు ఇచ్చిన వాంగ్మూలానికి... కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా కమిషన్ ముందు పోలీసులు చెప్పిందేంటీ? ఉదయం 5.45నిమిషాలకు బస్సులోంచి దిగి క్రైం సీన్లోకి ఎంటరైన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు 4నిందితులతో పాటు వెళ్లిన 10మంది పోలీసులు ఇద్దరు పంచులు సంఘటన స్థలానికి చేరుకున్న తరువాత చింతపల్లి బ్రిడ్జి వద్ద పరిశీలన చేసిన అధికారులు దిశ మృతదేహం లభించిన ప్రాంతం నుంచి తూర్పున 50అడుగుల దూరంలో ఉన్న పొలాల వైపు వెళ్లిన పోలీసులు నిందితులు దశను హత్యచేసిన తరువాత పొలాల వైపు వెళ్లారని అందుకే... పొలాల్లోకి తీసుకెళ్లామంటున్న పోలీసులు నిందితులు పొలాల్లో మారణాయుధాలు దాచినట్లు పోలీసుల అనుమానం పోలీసులు చెప్పినదానిపై కమిషన్ అనుమానాలేంటీ? పోలీసులు పొలాల్లోకి వెల్లేందుకు అక్కడున్న గేట్ ద్వారా వెళ్లారా లేక... ఫెన్సింగ్ తొలగించారా అనే విషయంపై స్పష్టత లేదు ఇక పొలాల్లోకి వెల్తున్న సమయంలో ఒకరి వెంట ఒకరు సింగిల్ ఫార్మేషన్లో వెళ్లినట్లు వాంగ్మూలం ఇచ్చిన పోలీసులు దాదాపు 300మీటర్లు నడిచిన తరువాత అక్కడ ఉన్న హైటెన్షన్ పోల్ వద్ద ఆగిన పోలీసులు తెల్లవారు జామున మంచు కురుస్తుండటంతో 30ఫీట్ల దూరంలో ఉన్న వ్యక్తి కూడా సరిగా కనిపించని పరిస్థితి నెలకొని ఉంది ఘటనా స్థలంలో ఏం జరిగింది? పోలీసులు కమిషన్‌కు ఏం చెప్పారు? హైటెన్షన్ పోల్ దగ్గర దిశను హత్య చేసిన తరువాత ఆమె వస్తువులను దాచినట్లు చెప్పిన నిందితులు పోల్ దగ్గరకు చేరుకున్న తరువాత అక్కడ తప్పి వస్తువులు తీసేందుకు పోలీసుల యత్నం అదే సమయంలో వంగి తవ్వుతున్న కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కున్న నిందితుడు వెంటనే మిగిలిన నిందితులు పరగెత్తండిరా అంటూ గట్టిగా అరుస్తూ పోలీసుల కళ్లలోకి మట్టి విసిరాడు ఇంతలో మరో ఇద్దరు నిందితులు పోలీసులపైకి రాల్లు రువ్వుతూ పొలాల్లోకి పరిగెత్తారు తుపాకి లాక్కున్న నిందితుడు పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు... పోలీసులు లొంగిపోవాలంటూ అరుస్తున్నా... నిందితుడు కాల్పులు జరుపుతూ పొలాల్లోకి పరుగెత్తాడు ప్రాణ రక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసుల వాంగ్మూలం కాల్పులు ప్రారంభమైన 5నిమిషాల తరువాత 4గురు నిందితులు బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే చనిపోయినట్లు గుర్తింపు కమిషన్ అనుమానాలేంటీ? దిశను హత్యచేసి ఆమె వస్తువులు హైటెన్షన్ పోల్ వద్ద దాచినట్లు గుర్తించామని చెప్పిన పోలీసులు దిశ వస్తువులు వెలికి తీసేందుకే సంఘటనా స్థలానికి వెల్లినట్లు పోలీసుల నివేదిక\ సంఘటనా స్థలంలో దొరికిన దిశా వస్తువులపై నిందితుల ఆనవాళ్లు, వేలి ముద్రలు లేవని గుర్తించిన కమిషన్ సంఘటన 6.15జరిగినట్లు ఎఫ్ఐఆర్ కాని పోలీసుల వాంగ్మూలం ప్రకారం 6.30వరకు బతికే ఉన్న నిందితులు మంచు కారణంగా 20అడుగులు కూడా చూడలేని పరిస్థితి ఉందని కొందరు పోలీసుల వాంగ్మూలం లేదు మంచి విజిబులిటి ఉందని మరికొందరు పోలీసుల వాంగ్మూలం కళ్లలోకి మట్టికొట్టి నిందితులు పారిపోయారన్న విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదు... కళ్లలోకి మట్టి కొట్టిన విషయంపైనా పోలీసుల వాంగ్మూలంలో భిన్న వాదనలు పోలీసులకు తగిలినా గాయాలపైనా అనుమానాలు... ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు నివేదిక పోలీసులు ఇచ్చిన నివేదికలో ముగ్గురు సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు వెళ్లడి కాని ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన నివేదికలో చిన్న చిన్న గాయాలున్నట్లు గుర్తింపు గాయపడిన వారిని అక్కడ ఉన్న పోలీసులే ప్రాథమిక చికిత్స చేసినట్లు వాంగ్మూలం ఇచ్చిన కానిస్టేబుళ్లు గాయపడ్డవారిని అక్కడే ఉన్న బస్సులో ఆసుపత్రికి తరలించకపోవడంపై అనుమానాలు ఆంబులెన్స్ వచ్చినా వారు గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయలేదు... కనీసం వారెవరో అంబులెన్స్ సిబ్బందికి చూపెట్టలేదు ఘటనా స్థలంలో జరిగిన దానిపై కమిషన్‌కు పోలీసులు ఏం చెప్పారు? చింతపల్లికి చేరుకున్న సమయంలో తన పిస్టల్ మ్యాగజీన్ మోడ్‌లో ఉందన్న కానిస్టేబుల్ మ్యాగజీన్ మోడ్‌లో ఉన్న పిస్టల్‌ను కాక్ చేస్తే బుల్లెట్ ఫైరింగ్ చాంబర్లోకి వస్తుంది చాంబర్ మోడ్‌లో ఉన్నప్పుడే తుపాకి ట్రిగ్గర్ నొక్కితే అది పేలుతుంది. అయితే తుపాకి కాక్ చేశాక... చాంబర్ మోడ్‌లో ఉన్నప్పుడు తప్పకుండా సేఫ్టీ పిన్ ఆన్ చేయాలి కాని తన పిస్టల్‌ను కాక్ చేయలేదన్న పోలీస్ అధికారి ఘటనా స్థలంలో జరిగిన దానిపై కమిషన్ అభ్యంతరాలు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారా అన్న విషయంపైనా అనుమానాలు తుపాకి లాక్కునే సమయంలో తుపాకి పెట్టే పౌచ్ చినిగిపోయిందా... అది డెడ్‌బాడి దగ్గర ఎందుకు లేదు? తుపాకి లాక్కుని నిందితులు కాల్పులు జరిపిన తరువాత తుపాకి ఎవరు స్వాధీనం చేసుకున్నారు? తుపాకి పౌచ్ డెడ్‌బాడీకి 22ఫీట్ల దూరంలో దొరికిందన్న పోలీసు అధికారి పౌచ్ కేవలం 5ఫీట్ల దూరంలో దొరికిందన్న మరో పోలీస్ అధికారి బలవంతంగా తుపాకీ లాక్కున్న పౌచ్‌కు ఏమీ కాకపోవడం అనుమానాస్పదంగా లేదా? GSR (గన్ షాట్ రెసిడ్యుయరీ)పై కమిషన్ అభ్యంతరాలు నిందితుల చేతుల నుంచి తుపాకీ కాల్చిన ఆనవాళ్లు కలెక్ట్ చేయడంలోనూ అనుమానాలు నిందితుల కుడి చేతికి గన్ షాట్ రెసిడ్యుయల్ ఉందని గుర్తించిన ఫొరెన్సిక్ నిపుణులు వారి ఎడమచేతిలో ఎలాంటి జిఎస్ఆర్ దొరకలేదన్న ఫొరెన్సిక్ నిపుణులు జీఎస్అర్లో తప్పకుండా ఉండాల్సిన అంటిమోని, బోరియం, లెడ్ మూలకాలు నిందితుల చేతుల నుంచి తీసిన సాంపుల్స్‌లో లభించలేదు కేవలం నైట్రైట్స్ మాత్రమే వారి వద్ద సేకరించిన శాంపిల్స్‌లో లభించాయి. ఎవరైనా చనిపోయిన తరువాత వారి చేతిలో తుపాకి పెట్టి ఉండొచ్చు. చనిపోయిన వ్యక్తి చేతికి నైట్రైట్స్ రాసి ఉండొచ్చు... చనిపోయిన వ్యక్తి చేతిలో తుపాకి పెట్టి కాల్చి ఉండొచ్చు కాల్పులు జరిపిన విధానంపై పోలీసులు ఏం చెప్పారు? కాల్చకండి కాల్చకండి..లొంగిపోండి అంటూ మూడుసార్లు అరిచిన పోలీసు అధికారి పారిపోతూ నిందితులు కాల్పులు జరిపారు... అటు వైపే పోలీసులు కాల్పులు జరిపారు మంచు వల్ల మనిషి కనబడకపోయినా శబ్దం ఆధారంగా కాల్పులు జరిపినట్లు చెప్పిన పోలీసులు ఎలాంటి కాల్పులు జరపని జల్లు శివ,జల్లు నవీన్‌కు ముందు భాగంలో బుల్లెట్లు తగిలాయి కమిషన్ అనుమానాలు పోలీసులు ఎందుకు గాల్లోకి కాల్పులు జరపలేదు? ఎందుకు పారిపోతున్న నిందితుల కాళ్లపైకి కాల్పులు జరపలేదు? పోలీసులు తూటాలు నిందితుల ముందుభాగం నుంచి వెనక్కి వెళ్లినట్లు ఆనవాళ్లు పారిపోతున్న వారిపై వెనక నుంచి కాల్పులు జరిపితే వారికి ముందు భాగంలో గాయాలెలా అయ్యాయి? ఎవరెవరికి ఎక్కడ గాయాలయ్యాయి? మహమ్మద్ ఆరిఫ్ 1. దవడ కింద భాగంలో ఒకటిన్నర సెంటీమీటర్ల బెల్లెట్ ఎంట్రీ గాయం... మెడ వెనక నుంచి దాదాపు 3సెంటీమీటర్ల గాయంతో బయటకు వెళ్లిపోయిన బుల్లెట్ 2.ఛాతి కుడిభాగంలో మరో బుల్లెట్ గాయం... 3.ఛాతి మధ్యభాగంలో మరో బుల్లెట్ గాయం... 4.పొత్తి కడుపులో మరో బుల్లెట్ జొల్లు శివ 1.పొత్తి కడుపులో కుడివైపున చొచ్చుకెల్లిన బుల్లెట్ 2. ఛాతి భాగంలో ఎడమవైపున దూసుకెళ్లిన బుల్లెట్ 3. ఛాతీ భాగంలో ఎడమవైపున దిగువన మూడో బుల్లెట్ జొల్లు నవీన్ 1. ఛాతీలోకి దూసుకెల్లిన బుల్లెట్ 2. తలలోకి దూసుకెల్లిన బుల్లెట్ చింతకుంట చెన్నకేశవులు 1. గొంతులోకి దూసుకెల్లిన బుల్లెట్ పోలీసుల కాల్‌డేటా రికార్డుల్లో ఏముంది? మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవుల చేతుల్లో రెండు 9mm పిస్టల్లు లభ్యం 9ఎంఎం పిస్టల్‌కు సంబంధించిన 10ఎంప్టీ కాంట్రిడ్జెస్ ఎస్ఎల్ఆర్ తుపాకికి సంబందించిన 3ఎంప్టీ కాంట్రిడ్జెస్ ఏకే-47కు చెందిన 6ఎంప్టీ కాంట్రిడ్జెస్ లభ్యం కమిషన్ ముందు డ్రైవర్ ఏం చెప్పారు? తాను బస్సులో పడుకుని ఉండగా తుపాకుల శబ్దం వినిపించిందన్న డ్రైవర్ అయితే బయట చీకటి, పొగమంచు ఉండటంతో తనకేమి కనబడలేదన్న డ్రైవర్