Narsimhareddy
-
రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి నేత మృతి
ధర్మవరం(అనంతపురం): తమిళనాడులోని దిండిగల్ సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏపీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి మృతిచెందారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయనతోపాటు విద్యార్థి విభాగం నేతలు కారులో శబరిమలైకి బయలుదేరారు. తమిళనాడులోని దిండిగల్ వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని వారి వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డితోపాటు కారు డ్రైవర్ మోహన్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న అనంతపురం జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం కార్యదర్శి అమర్నాథ్రెడ్డి, వినయ్‌గౌడ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను దిండిగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, నర్సింహారెడ్డి ప్రస్తుతం ఎస్కే వర్సిటీలో పీజీ చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే వైఎస్సార్‌కాంగ్రెస్ విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయన స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లె. -
సిద్దిపేట డీఎస్పీగా నర్సింహారెడ్డి
సిద్దిపేట రూరల్: స్థానిక డీఎస్పీగా నర్సింహారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట ఇన్చార్జి డీఎస్పీగా ఉన్న షేక్‌లాల్ అహ్మద్ గతంలో ఉన్న బాధ్యలు నిర్వర్తించనున్నట్లు తెలిసింది. నర్సింహారెడ్డి హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శనివారం సిద్దిపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ సైదులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ, సీఐతో కలిసి మొక్కలు నాటారు. -
ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్ కౌంటర్, ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డిపై దుండగుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నర్సింహారెడ్డిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన నర్సింహరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగులపై పోలీసులు జరిపిన ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు మృతి చెందాడు. మరణించిన మృతుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివగా అనుమానిస్తున్నారు.